← Back to news

కుటుంబాన్ని బంధించి 66 తులాల బంగారం చోరీ

By DK· 22 Jul 2026· కరీంనగర్ జిల్లా
కుటుంబాన్ని బంధించి 66 తులాల బంగారం చోరీ

TG: కరీంనగర్‌లో మంగళవారం అర్ధరాత్రి భారీ దోపిడీ ఘటన కలకలం రేపింది. భగత్ నగర్‌కు చెందిన వృద్ధుడు అజ్మత్ అలీ ఇంట్లోకి చొరబడిన దుండగులు కుటుంబ సభ్యులను బంధించి, తుపాకులు, కత్తులతో బెదిరించి 66 తులాల బంగారం, రూ.21 లక్షల నగదు, 10 తులాల వెండిని దోచుకెళ్లారు. అరుపులు వినపడకుండా TV సౌండ్ పెట్టి బాధితులను తీవ్రంగా కొట్టి గదిలో బంధించారు. మొబైల్ ఫోన్లు తీసుకెళ్లిన దుండగులు కింద పార్కింగ్‌లో ఉన్న రెండు బైకులను కూడా దొంగిలించి వేములవాడ బైపాస్ వైపు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 14h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.