← Back to news

కోనసీమ జిల్లాలో ఆక్వా రైతు దారుణ హత్య

By డీకే· 18 Jun 2026· Hmtvlive· కోనసీమ జిల్లా
కోనసీమ జిల్లాలో ఆక్వా రైతు దారుణ హత్య

AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం మురమళ్ల గ్రామానికి చెందిన ఆక్వా రైతు దాట్ల కృష్ణంరాజు దారుణ హత్యకు గురయ్యాడు. నిన్నటి నుంచి కృష్ణంరాజు కనపడకుండా పోవడంతో కుటుంబసభ్యులు స్థానిక చెరువు వద్ద వెతకగా డెడ్‌బాడీని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్‌బాడీని పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను హత్య చేసి, మృతదేహానికి రాళ్లు కట్టి రొయ్యల చెరువులో పడేసి పరారయ్యారైనట్లు తెలిపారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 23h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.