మీరు నైట్ డ్యూటీ చేస్తున్నారా ? బీ కేర్ ఫుల్
పగలు పని చేయాలి. రాత్రి నిద్రపోవాలి. మన బయలాజికల్ క్లాక్ అప్పుడే సరిగ్గా పని చేస్తుంది. కానీ సాఫ్ట్ వేర్ రంగం విస్తరించాక యూత్ కి నైట్ డ్యూటీలు ఎక్కువైపోయాయి. అలాంటి వారందరూ ఆరోగ్యంపై కచ్చితంగా దృష్టి పెట్టాలి. ఏళ్ల తరబడి నైట్ డ్యూటీలు చేయడం వల్ల 77శాతం మందిలో షుగర్, గుండె జబ్బుల బారిన పడే ముప్పు ఉందని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి తాజా అధ్యయనంలో వెల్లడైంది. రాత్రి నిద్ర లేకపోతే హార్మోన్ల వ్యవస్థ ఛిన్నాభిన్నమై వారిలో మానసిక సమస్యలు కూడా రావొచ్చు. పగలు నిద్రపోవడం వల్ల సూర్యరశ్మి సోకక డీ విటమిన్ లోపాలు ఎదుర్కొంటున్నారు. నైట్ షిఫ్ట్ కంపల్సరీగా చేయాల్సిన వాళ్లు ముందుగా వైద్యుల్ని సంప్రదించి వారి సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని అధ్యయనం వెల్లడించింది.



