← Back to news

గాంధీ ఆసుపత్రికి కొత్త సూపరింటెండెంట్

By siddu vinay· 1h ago
గాంధీ ఆసుపత్రికి కొత్త సూపరింటెండెంట్

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి డా. టి. ఉషారాణి కొత్త సూపరింటెండెంట్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. ఇప్పటివరకు డా. ఉషారాణి నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా పనిచేశారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా Z. చోంగ్తు ఆమెను నియమించారు. మరోవైపు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి చెందిన వైద్య విద్య అడిషనల్ డైరెక్టర్ సి.హెచ్. రాజా కుమారిని ప్రభుత్వం తక్షణమే తన విధులకు సంబంధించిన బాధ్యతల నుంచి తప్పించింది. ఆమెను వైద్య విద్య డైరెక్టర్ (DME)కి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది.

More in TG