బోయిన్‌పల్లి పీఎస్ దగ్గర రచ్చ రచ్చ

TG: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదు అన్నారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. ఎర్రవల్లికి వెళ్తున్న ఆయన్ని పోలీసులు అదుపులోకి బోయిన్‌పల్లి పీఎస్‌కి తీసుకెళ్లడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు అక్కడికి తరలిరావడంతో.. రెండు వర్గాల మధ్యా ఘర్షణ తలెత్తింది. పీఎస్ ముందే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసుకున్నారు. రాళ్లు, కుర్చీలు విసురుకున్నారు. పోలీసులు బలవంతంగా రెండు వర్గాలనూ చెదరగొట్టారు.



