పిట్ట కొంచెం.. తబలాలో ఘనం
ఢిల్లీ ఘరానాకు చెందిన యువ తబలా విద్వాంసురాలు సయేషా చౌదరి. ఆమె తాతగారు, గురువు పండిత్ కేశబ్ కాంతి చౌదరి దగ్గర 1.5 సంవత్సరాల వయస్సు నుండే ట్రైనింగ్ తీసుకుంది. మూడేళ్ల వయస్సు నుండి ప్రదర్శనలు ఇచ్చారు. 2022లో ఆరేళ్ల వయసులో జీ ఎంటర్‌టైన్‌మెంట్ ‘Born to Shine’ కార్యక్రమంలో తబ్లా విభాగంలో గర్ల్ చైల్డ్ ప్రాడిజీ అవార్డు అందుకున్నారు. ఆమె వేళ్ల వేగం, బలం ప్రేక్షకులను, సంగీత ప్రేమికులను ఆశ్చర్యపరిచాయి. ప్రస్తుతం తనకు పదేళ్ల వయస్సు.



