గురజాడ కలం.. ‘కన్యక’లో ఆత్మగౌరవ గళం!

తెలుగు సాహిత్యంలో సామాజిక చైతన్యానికి బాటలు వేసిన కవి, రచయిత గురజాడ అప్పారావు జయంతి ఇవాళ. 1912లో ఆయన రాసిన చిన్న పద్యకావ్యం ‘కన్యక’ వాసవి కన్యకాపరమేశ్వరి కథ ఆధారంగా రూపుదిద్దుకుంది. రాజుల అధికారం, స్త్రీలపై ఆధిపత్యం, సామాన్యులపై జరిగే దురాగతాలను గురజాడ ఇందులో ప్రశ్నించారు. సామాజిక అంతరాలు, అణగారిన వర్గాల ఆత్మగౌరవం, స్త్రీ గౌరవం, సంఘ సంస్కరణ, హేతుబద్ధతను ‘కన్యక’ ద్వారా బలంగా చాటిచెప్పారు. ‘పూర్ణమ్మ’లాగే స్త్రీ ఆత్మగౌరవం ఈ రచనలోనూ కీలకాంశంగా నిలిచింది.



