ట్రక్కును ఢీకొట్టిన కారు.. ఏడుగురు మృతి

గుజరాత్‌లో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భావ్‌నగర్ జిల్లాలో వేగంగా వెళ్తున్న కారు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో అలాంగ్ షిప్‌యార్డ్‌కు వెళ్తున్న 7 మంది ఉద్యోగులు అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. ప్రమాదానికి అసలు కారణం ఏమిటనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
