నిరుపేదలకు అండగా వెల్ విషర్ ట్రస్ట్

AP: మదర్ థెరిసా స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు అండగా నిలవడం అభినందనీయమని మంగళగిరి మున్సిపల్ కమిషనర్ అలీమ్ బాషా అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి బాప్టిస్ట్‌పేటలో వెల్ విషర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు, నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. షైన్ ఆశ్రమానికి రూ.10 వేల ఆర్థికసాయం అందించారు. వికలాంగుల విద్యకోసం మరో రూ.8వేల సహాయాన్ని అందజేశారు.



