యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు.. హైవేపై ధర్నా
TG: మెదక్ జిల్లా మాసాయిపేటలో యూరియా కొరతపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాసాయిపేట మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద జాతీయ రహదారి-44పై రైతులు ధర్నాకు దిగారు. ఫర్టిలైజర్ యాప్‌ను రద్దు చేసి పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. యాప్‌లో నమోదు చేసిన గంటలోపే యూరియా స్టాక్ అయిపోయిందని చెబుతున్నారని, సర్వర్ సమస్యలతో చదువురాని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కనీసం ఒకటి, రెండు యూరియా బస్తాలైనా దొరికేవని పేర్కొన్నారు.

