సౌదీలో ఫ్లైట్స్ క్యాన్సిల్.. ప్రయాణికులకు అలర్ట్!

సౌదీ అరేబియాలో ఫ్లైట్ సర్వీసులకు ప్రాబ్లమ్ రావడంతో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఆకాశా ఎయిర్, ఇండిగో తమ ఫ్లైట్స్‌ను అక్టోబర్ 17 వరకు తాత్కాలికంగా క్యాన్సిల్ చేశాయి. రియాద్, దమ్మామ్, జెడ్డా, మదీనా నగరాలకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే ఫ్లైట్స్‌పై ఈ ప్రభావం ఉంది. ఉమ్రా యాత్రకు వెళ్లినవాళ్లు సహా భారతీయులు ఫ్లైట్ స్టేటస్‌ను ముందే చెక్ చేసుకుని, కన్ఫర్మ్ చేసుకున్నాకే ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాలని ఇండియన్ ఎంబసీ తెలిపింది.


