Latest

డ్రైవర్‌కు గుండెపోటు.. ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టిన బస్సు
Local· 24 Aug 2026

డ్రైవర్‌కు గుండెపోటు.. ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టిన బస్సు

AP: గుంటూరు ఎస్‌వీఎన్‌ కాలనీ సమీపంలో ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్‌కు ప్రయాణిస్తుండగానే తీవ్ర గుండెపోటు వచ్చింది. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టింది. బస్సులో ఉన్న పాఠశాల చిన్నారులు ఒక్కసారిగా భయంతో కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. వెంటనే బస్సు వద్దకు చేరుకుని విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానికులు సమయస్ఫూర్తితో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.

ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి
Local· 24 Aug 2026

ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి

TG: జగిత్యాల కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ప్రజల నుంచి 53 ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ప్రతి అర్జీపై సమగ్ర విచారణ జరిపి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం 182 ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. వీటిలో 93 దరఖాస్తులు 30 రోజులకు పైగా పరిష్కారం కాకుండా ఉన్నట్లు వెల్లడించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.

20 ఏళ్ల తర్వాత మళ్లీ రైలు కూత
Local· 24 Aug 2026

20 ఏళ్ల తర్వాత మళ్లీ రైలు కూత

TG : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు రైల్వే స్టేషన్‌కు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. 20 ఏళ్లుగా ప్యాసింజర్ రైళ్లు ఆగిపోయి, కేవలం బొగ్గు రవాణాకు (గూడ్స్) మాత్రమే వాడుతున్న ఈ ట్రాక్‌పై మళ్లీ ప్రయాణికుల రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ పనులు ప్రారంభించింది. 20 ఏళ్ల తర్వాత తమ ఊరి నుంచి మళ్లీ రైలు ఎక్కవచ్చని ఇల్లందు ప్రజలు చాలా సంతోషపడుతున్నారు.

బ్రిటిష్ కాలం నాటి స్టేషన్కు మళ్లీ శ్వాస!
Local· 24 Aug 2026

బ్రిటిష్ కాలం నాటి స్టేషన్కు మళ్లీ శ్వాస!

భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందులో బ్రిటిష్ కాలం నాటి రైల్వే స్టేషన్ మళ్లీ సజీవమవుతోంది! బొగ్గు రవాణాతో పాటు ప్యాసింజర్ రైళ్లు కూడా నడిచే ఈ స్టేషన్లో గూడ్స్ మాత్రమే మిగిలి, ప్యాసింజర్ సేవలు 20 ఏండ్లుగా నిలిచిపోయాయి. ఇప్పుడు ప్రజల విజ్ఞప్తి మేరకు రైల్వే శాఖ పునరుద్ధరణ పనులు ప్రారంభించింది. తొలి దశలో కారేపల్లి నుంచి ఇల్లందు వరకు రైల్వే మార్గం, స్టేషన్ మౌలిక వసతుల పునరుద్ధరణ పనులు మొదలయ్యాయి. స్వాతంత్ర్యానికి ముందే నిజాం కాలంలో విజయవాడ–డోర్నకల్ మీదుగా ఇక్కడ ప్యాసింజర్ రైళ్లు నడిచిన చరిత్ర ఉంది.

కలెక్టరేట్ ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా
Local· 24 Aug 2026

కలెక్టరేట్ ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా

TG: జీవో 97ను వ్యతిరేకిస్తూ వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలను జీవో 97 ద్వారా ‘శక్తి’ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ విలీనంతో పాలిటెక్నిక్ విద్యార్థులకు ECET ద్వారా బీటెక్‌లో లేటరల్ ఎంట్రీ అవకాశం దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే మూడేళ్ల పాలిటెక్నిక్ విద్య పూర్తి చేసిన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు.

జీవో 97ను వెనక్కి తీసుకోండి
Local· 24 Aug 2026

జీవో 97ను వెనక్కి తీసుకోండి

హనుమకొండ జిల్లా పరకాల అంబేడ్కర్ సెంటర్‌లో పాలిటెక్నిక్ కాలేజ్ పిల్లలు రోడ్డు ఎక్కి దర్నా చేశారు. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీవో నెంబర్ 97 వల్ల తమ చదువులు, భవిష్యత్తు నాశనమైపోతాయని రోడ్డుపైనే కూర్చుని నిరసన తెలిపారు. ఈ జీవో వల్ల ముఖ్యంగా పేద పిల్లలే నష్టపోతున్నారని అంటున్నారు. అంబేడ్కర్ విగ్రహం దగ్గర గట్టిగా నినాదాలు చేస్తూ, ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ జీవోను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్!
TG· 24 Aug 2026

తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్!

TG: తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు, రేపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. దీంతో అధికారులు అలెర్ట్‌గా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని, భారీ హోర్డింగులు, పెద్ద చెట్ల కింద నిలబడవద్దని సూచించింది. హైదరాబాద్ సహా కొన్ని జిల్లాలకు Yellow అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ప్రజావాణిలో ప్రజలున్నారు... అధికారులు?
Local· 24 Aug 2026

ప్రజావాణిలో ప్రజలున్నారు... అధికారులు?

భీమదేవరపల్లిలో ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు సమయానికి రాకపోవడంతో న్యాయవాది తాళ్లపల్లి మధుకర్ ఫిర్యాదు చేశారు. ఈనెల 17న ఎంపీడీవో ఆఫీసులో జరిగిన ప్రజావాణిలో – అధికారులిచ్చిన టైమ్‌కు వాళ్లే రాలేదట. "ప్రజా సమస్యల కోసం వచ్చిన వాళ్లందరూ ఎదురుచూడాల్సిందేనా?" అంటూ మధుకర్ కలెక్టర్కు వినతిపత్రం అందించారు."అధికారులే లేట్ అయితే, ప్రజలు ఎవరికి చెప్పుకోవాలే" – ఇదీ ఆయన ప్రశ్న. ఇప్పుడు ఈ ఫిర్యాదు కలెక్టర్ దృష్టికి వెళ్లింది. సమయానికి రాని అధికారులపై చర్యలు తీసుకుని ఓ క్లియర్ మెసేజ్ ఇస్తారో లేదో చూడాలి.

రామాయంపేట రోడ్లపై నరకయాతన.. స్థానికుల ఆవేదన
Local· 24 Aug 2026

రామాయంపేట రోడ్లపై నరకయాతన.. స్థానికుల ఆవేదన

TG: చిన్న వర్షానికే రామాయంపేట రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.. గుంతల్లో నిలిచిపోతున్న వర్షపు నీటితో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు. మెదక్ జిల్లా రామాయంపేటలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. రోడ్లపై ఏర్పడిన భారీ గుంతల్లో చిన్నపాటి వర్షానికే నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతలు నీటితో నిండిపోవడంతో వాటి లోతు తెలియక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల దుస్థితిపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు చేపట్టలేదన్నారు.

ఆదివాసీల రక్షణ కవచంపై దెబ్బ
Local· 24 Aug 2026

ఆదివాసీల రక్షణ కవచంపై దెబ్బ

AP : ఆంధ్రప్రదేశ్‌లోని 5వ షెడ్యూల్ ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజనులకు 1/70 భూ బదిలీ నిరోధక చట్టమే కొండంత అండ. కానీ, ఈ చట్టాన్ని సవరించాలని కోరుతూ 2023లో 1,672 మంది గిరిజనేతరులు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదివాసులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ పక్షాన గట్టిగా నిలబడి, హక్కుల రక్షణ కవచమైన 1/70 చట్టాన్ని కాపాడాలని ఆదివాసీ సమాజం ఆశగా ఎదురుచూస్తోంది.

1/70 పై ఎపి కౌంటర్?
Local· 24 Aug 2026

1/70 పై ఎపి కౌంటర్?

ఏపీ 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసీల భూహక్కులకు కవచమైన 1/70 చట్టం ఇప్పుడు సుప్రీంకోర్టులో టక్కర్‌కు సిద్ధంగా ఉంది. 2023లో 1,672 మంది గిరిజనేతరులు ఈ చట్టాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనేతరులు అధిక సంఖ్యలో ఉన్నారని, వారికి భూములు కొనుగోలు చేసే అవకాశం లేకుండా పోయిందని వారి వాదన. ఇప్పటికే అల్లూరి జిల్లాలో ఆదివాసీలు భారీ ర్యాలీలు నిర్వహించినప్పుడు, ఆదివాసీల తరఫున సుప్రీంలో కౌంటర్ పిటిషన్ వేస్తామని చెప్పిన ప్రభుత్వం దానిని మర్చిపోయింది.. ఇప్పటికైనా మేల్కొంటుందా?

ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ
Local· 24 Aug 2026

ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

TG: భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బొజ్జాయిగూడెం గ్రామంలోని ఐటీడీఏ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని వారితో కలిసి తిని, నాణ్యతపై హాస్టల్ వార్డెన్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తరగతి గదులు, పాఠశాల పరిసరాల్లో తిరిగి విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను పరిశీలించారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెరుగైన వసతులు కల్పించాలని హెడ్‌మాస్టర్‌ను ఆదేశించారు.

మద్యం మత్తులో హల్‌చల్.. వాహనదారులకు టెన్షన్
Local· 24 Aug 2026

మద్యం మత్తులో హల్‌చల్.. వాహనదారులకు టెన్షన్

AP: విజయనగరం జిల్లా రాజాం అంబేద్కర్ జంక్షన్‌లో ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. రోడ్డుపై వాహనాలకు ఎదురుగా పడుకుని వాటిని ముందుకు కదలనీయకుండా అడ్డుకున్నాడు. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ కానిస్టేబుల్ పరిస్థితిని గమనించి మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని రోడ్డుపై నుంచి పక్కకు తీసుకెళ్లాడు. దీంతో వాహనాల రాకపోకలు పునరుద్ధరించడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.

శిలాఫలకం వేసి మూడేళ్లైనా.. రోడ్డు పనులు ఏవి?
Local· 24 Aug 2026

శిలాఫలకం వేసి మూడేళ్లైనా.. రోడ్డు పనులు ఏవి?

TG : మోత్కూర్ మండలం సదర్శాపురం కొమ్మూరిబావి దగ్గర రోడ్డు చాలా రోజులుగా దారుణంగా ఉంది. వర్షం పడితే, ఊరంతా బురదగా అవుతుందని ప్రజలు అంటున్నారు. రోడ్డు వేస్తామని శిలాఫలకం వేసి, నిధులు మంజూరై మూడేళ్లు అవుతున్నా, ఇప్పటివరకు పనులు మొదలుకావట్లేదని తెలిపారు. నడిచేవాళ్లు, బైక్‌లపై వెళ్లేవాళ్లు ఈ రోడ్డుపై వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు. అధికారులు, నాయకులు స్పందించి వెంటనే ఈ రోడ్డు పని పూర్తి చేసి కష్టాలు తీర్చాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఫార్చూనర్లో వచ్చి రోడ్లు ఊడ్చుతున్న కార్మికుడు
Motivational· 24 Aug 2026

ఫార్చూనర్లో వచ్చి రోడ్లు ఊడ్చుతున్న కార్మికుడు

కర్ణాటక దక్షిణకన్నడ జిల్లా బంట్వాళకు చెందిన శేషప్పణ్ణ అనే పారిశుధ్య కార్మికుడు రోజూ లగ్జరీ ఫార్చూనర్ కారులో వచ్చి రోడ్లు ఊడ్చడం వైరల్ అవుతోంది. 1996లో రూ.50 కూలీగా చేరి పర్మినెంట్‌ ఉద్యోగి అయిన ఆయన, ఆఫ్టర్‌నూన్ పశువుల పెంపకం ద్వారా నెలకు రూ.40వేలు సంపాదిస్తున్నారు. ఈ హార్డ్‌వర్క్‌తో ఆల్టో, స్కోర్పియోల నుంచి ఫార్చూనర్ కార్ దాకా కొనుగోలు చేశారు. గతంలో మద్యానికి బానిసనై ఎన్నో కోల్పోయానని, ఏ పని చేస్తున్నామనేది కాదని, గౌరవమే ముఖ్యమని శేషప్పణ్ణ చెప్తున్నారు.

రూ.146 కోట్లు.. నాగర్ కర్నూల్లో రోడ్ల రేసులు!
Local· 24 Aug 2026

రూ.146 కోట్లు.. నాగర్ కర్నూల్లో రోడ్ల రేసులు!

బల్మూర్‌లో రోడ్ల డెవలప్మెంట్ కి భారీ బడ్జెట్! రూ.146.71 కోట్లతో మూడు కీలక రహదారులను HAM మోడల్‌లో అప్గ్రేడ్ చేస్తున్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు కలిసి శంకుస్థాపన చేశారు. అమ్రాబాద్–తొల్పలపల్లి, బల్మూర్–నాగర్‌కర్నూల్, అచ్చంపేట–రాకొండ – ఈ మూడు రోడ్లను రెండు లేన్లుగా విస్తరించనున్నారు. దీంతో అచ్చంపేట నియోజకవర్గంలో ట్రాఫిక్ స్మూత్ అవ్వడమే కాదు, వ్యాపార, రవాణా రంగాలకు కూడా ఊతం లభించనుంది. బూస్టప్ లాంటి ఈ ప్రాజెక్టు పనులు టార్గెట్ టైమ్‌లో పూర్తయితే, ఇక్కడి ప్రజలు ఖుషీ ఖుషీ!

సైబరాబాద్‌లో చికెన్ వేస్ట్ మాఫియా గుట్టురట్టు!
Current Affairs· 24 Aug 2026

సైబరాబాద్‌లో చికెన్ వేస్ట్ మాఫియా గుట్టురట్టు!

TG: హైదరాబాద్ నుంచి ఏపీకు చికెన్ వేస్టును అక్రమంగా తీసుకెళ్తున్న మాఫియాపై సైబరాబాద్‌ పోలీసులు, వెటర్నరీ అధికారులు అధీనంలోకి తీసుకున్నారు. అత్తాపూర్, మియాపూర్, అమీన్‌పూర్, కూకట్‌పల్లి, జీడిమెట్ల, చింతల్ ప్రాంతాల్లో చేసిన తనిఖీల్లో దాదాపు 100 టన్నుల చికెన్ వ్యర్థాలను రికవరీ చేసుకున్నారు. ఈ వ్యర్థాలను రాత్రివేళల్లో ఆంధ్రప్రదేశ్‌లోని చేపల చెరువుల యజమానులకు ఆమూతున్నట్లు అధికారులు గుర్తించారు. చికెన్ వ్యర్థాలతో పెంచిన చేపల వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు.

డ్రైనేజీ పనులు స్లో.. కలెక్టర్ మాటకు లెక్కలేదా?
Local· 24 Aug 2026

డ్రైనేజీ పనులు స్లో.. కలెక్టర్ మాటకు లెక్కలేదా?

సూర్యాపేటలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల వల్ల రోడ్లు ఇప్పుడు ట్రెంచ్‌లా మారాయి. గుంతలు తవ్వి పైపులు వేశారు కానీ, మళ్లీ రోడ్లను ఎత్తి పూడ్చలేదు – ఇది ఓ సీరియస్ ఇష్యూ. బాలాజీనగర్, శ్రీరాంనగర్, విద్యానగర్ – ఇక్కడి ప్రజలు వాహనాలు నడిపించలేని పరిస్థితి. ఇది ఇప్పుడొచ్చిన సమస్య కాదు – కలెక్టర్ ఇప్పటికే పనులు త్వరగా పూర్తి చేయాలని ఆర్డర్లు ఇచ్చినా, ప్రాజెక్ట్ ఇంకా పెండింగ్‌లోనే! వర్షాకాలం మొదలైంది – గుంతల్లో నీరు నిల్వ ఉంటే, ఆ ప్రమాదం ఎవరికి తెలుసు? పాదచారులు, వాహన డ్రైవర్లకు కష్టం కదా!

దింసాకు గిన్నిస్ వచ్చింది.. క్రెడిట్ ఎవరికి?
AP· 24 Aug 2026

దింసాకు గిన్నిస్ వచ్చింది.. క్రెడిట్ ఎవరికి?

భోగాపురం విమానాశ్రయం ఓపెనింగ్ కోసం 13,000 మంది ఆదివాసీలతో దింసా నృత్యం చేయించి ప్రభుత్వం గిన్నిస్ రికార్డ్ కొట్టేసింది. కిల్లర్ ఫీట్ అనుకుంటారా? కానీ ఈ నృత్యకారుల పరిస్థితి చూడండి. ASR జిల్లా 11 మండలాల్లో వేలాది మంది ఉంటారు. ప్రభుత్వ ఈవెంట్స్ కు వాళ్లని వాడేస్తారు, కానీ వాళ్లకి గుర్తింపు కార్డ్ లేదు, వాయిద్యాలు లేవు, డ్రెస్ లేదు, పెన్షన్ లేదు! రికార్డు కొట్టేటప్పుడు గుర్తొచ్చి, ఇక 'అవసరమైతే కాల్ చేస్తాం' అనేస్తే, ఈ రికార్డుకు అసలు అర్థమేంటి? ఆదివాసీ సంస్కృతి ఇలా 'షో' కి పరిమితమవ్వొద్దు!

అర్జీలు తీసుకుని.. స్పాట్‌లోనే ఆర్డర్లు!
Local· 24 Aug 2026

అర్జీలు తీసుకుని.. స్పాట్‌లోనే ఆర్డర్లు!

గుంటూరు కలెక్టరేట్ శంకరన్ హాల్లో సోమవారం నాడు జిల్లా కలెక్టర్ సీ.ఎం.సాయి కాంత్ వర్మ నేరుగా ప్రజల అర్జీలు స్వీకరిస్తూ, స్పాట్‌లోనే అధికారులకు ఆర్డర్లు జారీ చేశారు. "వెంటనే పరిష్కరించండి" అని సంబంధిత శాఖల వారిని పిలిపించి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ్, డీఆర్వో ఖాజావలి, డీపీవో సాయికుమార్ తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.ఇలాంటి స్పాట్‌సొల్యూషన్స్ రెగ్యులర్గ అమలైతే.. ప్రజా పరిపాలన ఇంకా స్మూత్ అవుతుందనేది నెటిజన్ల అభిప్రాయం!

రూ.10 వేల కోట్ల విండ్.. 4 వేల జాబ్స్!
Local· 24 Aug 2026

రూ.10 వేల కోట్ల విండ్.. 4 వేల జాబ్స్!

ఏపీలో విండ్ ఎనర్జీది కొత్త చాప్టర్! అనంతపురం రాయదుర్గంలో సుజ్లాన్ రూ.10,000 కోట్ల పెట్టుబడితో 1,325 మెగావాట్ల విండ్ ప్రాజెక్ట్ ప్రారంభించనుంది. దీంతో ప్రత్యక్ష, పరోక్షంగా 4,000 మందికి ఉపాధి లభించనుంది – ఇది ఏపీ ఎకనమీకి ఊతం! మరోవైపు, కణేకల్లు హులికెరలో S-144 అత్యాధునిక బ్లేడ్ ఉత్పత్తి లైన్ను మంత్రి నారా లోకేష్ మంగళవారం ప్రారంభిస్తారు. ప్రస్తుతం 1,700 MW సామర్థ్యం ఉన్న సుజ్లాన్, 2030 నాటికి 5K MW లక్ష్యం పెట్టుకుంది. ప్రభుత్వంతో భారీ రాయితీలు పొందిన సుజ్లాన్ తక్కువ ధరకే కరెంటు ఇస్తుందని ఆశిద్దాం.