Latest

విజయవాడలో GenZ Protest
AP: విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర రేపు(4వ తేదీ), ఎల్లుండి (5వ తేదీ) GenZ Protest జరగనుంది. Duchenne muscular dystrophy(DMD), Spinal muscular atrophy(SMA) అనే వ్యాధులు చిన్నారులను ఇబ్బంది పెడతాయి. వీటికి చికిత్స అందించాలంటే రూ.కోట్ల ఖరీదైన ఇంజెక్షన్స్ అందించాలి. ఇలాంటి పిల్లలు రాష్ట్రంలో వెయ్యి మంది దాకా ఉన్నారు. వీళ్లని ప్రభుత్వమే ఆదుకోగలదని Social Thinker, Insta Influencer గంజి ప్రశాంత్ అన్నారు. అలాంటి పిల్లల కోసం Silent Protest చేస్తున్నామని, దీనికి రావాలని వీడియో ద్వారా పిలుపునిచ్చారు.

తెలంగాణకు మరో గర్వకారణం.. ‘గొల్లల గుడి’కి గుర్తింపు!
TG: ములుగు జిల్లా పాలంపేటలో ఉన్న ‘గొల్లల గుడి’కి కేంద్ర ప్రభుత్వం కీలక గుర్తింపు ఇచ్చింది. ఈ హిస్టారిక్ ప్లేస్‌ను నేషనల్ హెరిటేజ్ సైట్‌గా గుర్తిస్తూ ఆఫిషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ పరిధిలోని ASI ఆగస్ట్ 31న ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ‘గెజిట్ ఆఫ్ ఇండియా’లోనూ దీనిని పబ్లిష్ చేసింది. దీంతో గొల్లల గుడి సంరక్షణ, పరిరక్షణకు మరింత ఇంపార్టెన్స్ పెరగనుంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ‘కాకతీయ రుద్రేశ్వర’ (రామప్ప) ఆలయానికి సౌత్‌వెస్ట్ సైడ్‌లో ఈ ‘గొల్లల గుడి’ ఉంటుంది.

అంగన్‌వాడీ సెంటర్‌లో Food Poison
TG: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం అంగన్‌వాడీ సెంటర్‌లో Food Poison జరిగింది. పప్పుకూరలో విషపూరిత గన్నేరు ఆకులు కలిశాయి. వాటిని తిన్న చిన్నారులు, గర్భిణులకు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. తల్లిదండ్రులు వాళ్లను మొదట సత్తుపల్లి ఆసుపత్రికి తీసుకెళ్లగా, ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు చిన్నారులు, ఇద్దరు గర్భిణుల పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.

రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్ చేశారు: కొండా సురేఖ!
తనను కేబినెట్ నుంచి తీసేయాలని CM రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్‌ను బ్లాక్‌మెయిల్ చేశారని మంత్రి కొండా సురేఖ ప్రెస్‌మీట్‌లో సంచలన ఆరోపణలు చేశారు. ఎలాంటి ఎక్స్‌ప్లనేషన్ తీసుకోకుండానే తనను బర్తరఫ్ చేయడానికి గవర్నర్‌కు లెటర్ పంపారని మండిపడ్డారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు తనను తొలగించే థాట్ లేదని, CM రేవంత్‌రెడ్డి, ఆయన బ్రదర్స్ కక్షగట్టి ఈ కుట్ర చేశారని అన్నారు. తనతో పాటు మాజీ ఓఎస్డీ సుమంత్‌పై కూడా కావాలనే నిందలు వేశారని సురేఖ కామెంట్స్ చేశారు.

హైదరాబాద్‌లో మహిళల కోసం 'Pink Bike'
TG: హైదరాబాద్‌లో మహిళలకు ప్రత్యేకంగా రాపిడో ‘Pink Bike’ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సర్వీసులో మహిళా ప్రయాణికులకు మహిళా కెప్టెన్లే రైడ్ అందిస్తారు. విద్యార్థులు, ఎంప్లాయిస్ సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యం. అంతేకాదు, మహిళలు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్‌తో కెప్టెన్లుగా పనిచేసి ఆదాయం పొందే అవకాశం ఉంది. మహిళలకు సురక్షితమైన ప్రయాణంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి.

స్టాలిన్‌కు కోర్టులో షాక్.. పిటిషన్ కొట్టివేత!
తమిళనాడు మాజీ సీఎం, DMK అధినేత MK స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కొళత్తూర్ ఎన్నికల కౌంటింగ్‌పై కంప్లైంట్‌తో ఆయన వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఎలక్షన్‌లో స్టాలిన్‌కు 74,202 ఓట్లు రాగా, TVK క్యాండిడేట్ VS బాబు 82,997 ఓట్లతో గెలిచారు. EVMల బర్న్ట్ మెమరీ, మైక్రోకంట్రోలర్‌తో పాటు 100% VVPATలను చెక్ చేయాలని స్టాలిన్ కోరారు. ఈ పిటిషన్ హియరింగ్‌కు అర్హం కాదని కోర్టు తెలిపింది. చీఫ్ జస్టిస్ SA ధర్మాధికారి, జస్టిస్ జీ అరుల్ మురుగన్‌లతో కూడిన కోర్టు బెంచ్ ఈ కామెంట్ చేసింది.

సొరంగంలో కార్మికులు ఇంకా బతికే అవకాశం ఉంది: నేపాల్ అధికారి
నేపాల్‌లో ఇటీవల వచ్చిన భారీ వరదల కారణంగా రసువాగఢి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో చిక్కుకున్న 46 మంది కార్మికులు ఇంకా బతికుండే అవకాశం ఉందని నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థ అధికారి అమ్షు కిరణ్ షాహి అభిప్రాయపడ్డారు. సొరంగంలో గదిని పోలిన నిర్మాణంలో ఆహారం, నీరు నిల్వ ఉండటం వల్ల వారి బతికే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నేపాల్‌తోపాటు భారత్, చైనా, కొరియా, ఆస్ట్రేలియా నిపుణుల సహకారంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

IMEI మార్చితే భారీ జరిమానా, జైలు
టెలికాం గుర్తింపులు, ముఖ్యంగా IMEI నంబర్‌ను ట్యాంపరింగ్ చేయడం నేరమని కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ హెచ్చరించింది. IMEI మార్చిన మొబైల్ వాడినా, ఇలాంటి డివైజ్‌లను తయారు చేసినా 3 ఏళ్ల వరకు జైలు, రూ.50 లక్షల వరకు జరిమానా పడొచ్చు. ఫేక్ డాక్యుమెంట్లతో SIM తీసుకోవడం, మన పేరుతో తీసుకున్న SIMను ఇతరులకు దుర్వినియోగానికి ఇవ్వడం కూడా నేరమే. మొబైల్ యాప్స్ లేదా వెబ్‌సైట్ల ద్వారా CLI, IMEI వంటి టెలికాం ఐడీలను మార్చడాన్నీ DoT నిషేధించింది.

USA Visa: అమెరికాలో ఇండియన్స్‌కు భారీ షాక్
భారీ డిమాండ్ కారణంగా సెప్టెంబర్ 30 నాటికి ఇండియన్స్ కోసం ఉంచిన EB-1 వీసా నంబర్లు పూర్తిగా అయిపోయే అవకాశం ఉందని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది. అదే జరిగితే సైంటిస్టులు, ప్రొఫెసర్లు, ఎగ్జిక్యూటివ్‌ల కోసం కేటాయించిన ఈ ఫస్ట్-ప్రిఫరెన్స్ కేటగిరీ తాత్కాలికంగా నిలిచిపోనుంది. ఇప్పటికే EB-2 పూర్తిగా నిలిచిపోగా, EB-3లో 12 ఏళ్లకు పైగా భారీ బ్యాక్‌లాగ్ కొనసాగుతోంది. భారతీయ నిపుణులకు గ్రీన్ కార్డ్ కల మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Placement రావాలంటే.. Planning ఉండాల్సిందే!
డిగ్రీ పూర్తయితే ఉద్యోగం వచ్చేస్తుందనుకోవడం ఒకప్పటి మాట. ఇప్పుడు అలాంటి situation లేదు. మంచి ప్లేస్‌మెంట్ కోసం కాలేజీ రోజుల్లోనే ప్లాన్ చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఏ రంగంలో Job చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకుని, అవసరమైన టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్, ఆప్టిట్యూడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ నైపుణ్యాలను పెంచుకోవాలంటున్నారు. రెజ్యూమ్ తయారీ, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలంటున్నారు. రోజూ కొంత టైం ప్రాక్టీస్ చేస్తే confidence పెరుగుతుందని సలహా ఇస్తున్నారు.

నల్సార్ స్టూడెంట్స్‌కి సుప్రీం కోర్ట్ రిలీఫ్!
నల్సార్ యూనివర్సిటీ 2026 బ్యాచ్ లా స్టూడెంట్స్‌ను అడ్వకేట్లుగా ఎన్‌రోల్ చేసుకోవద్దంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (<a href="https://www.theclearcutnews.com/n/FBR2qFr">BCI)</a> ఇచ్చిన ఆర్డర్స్‌పై సుప్రీం కోర్ట్ ఫైర్ అయింది. లా స్టూడెంట్స్‌పై యాక్షన్ తీసుకునే లీగల్ రైట్ BCIకి లేదని క్లారిటీ ఇచ్చింది. CJI జస్టిస్ సూర్యకాంత్‌ను కాన్వోకేషన్‌కు గెస్ట్‌గా పిలవవద్దని కొందరు స్టూడెంట్స్ లెటర్ రాయడంతో BCI ఈ బ్యాన్ విధించింది. దీనిపై సుప్రీం కోర్ట్ సీరియస్ అవ్వడంతో స్టూడెంట్స్‌కి బిగ్ రిలీఫ్ లభించింది.

నేపాల్ వరదలు: ‘క్లైమేట్ పరిహారం’ డిమాండ్
భారత్ సహా ఇతర దేశాలు నేపాల్‌కు తక్షణ సహాయాన్ని అందిస్తుండగా, నేపాల్ మాత్రం ఈ విపత్తును వాతావరణ మార్పుల(Climate Change) కారణంగా జరిగిన ‘Loss and Damage’గా చూస్తోంది. ప్రపంచంలో ప్రధాన Greenhouse Gas ఉద్గార దేశాలైన చైనా, అమెరికా, భారత్ తమ ఉద్గారాలకు బాధ్యత వహించాలని అంటోంది. నేపాల్‌కు జరిగిన నష్టానికి పరిహారం అందించాలని కోరుతోంది. అంతర్జాతీయ Fund for Responding to Loss and Damage నుంచి కూడా ఆర్థిక సహాయం పొందేందుకు ప్రయత్నిస్తోంది.

AI స్కిల్స్ ఉంటేనే భారీ జీతాలు.. రెండేళ్లలో 23% Growth
ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్‌లో AI skills ఉన్నవారికి డిమాండ్ భారీగా పెరుగుతోంది. AI రంగంలోని ఎంప్లాయిస్ జీతాలు గత రెండేళ్లలో 23 శాతం వరకు పెరిగినట్లు తాజా ఉద్యోగ పోర్టల్ పౌండిత్ రిపోర్ట్ చెబుతుంది. సెమీకండక్టర్ రంగంలోనూ వేతనాలు 17 శాతం పెరిగినట్లు చెప్పింది. సాధారణ IT ఉద్యోగాల్లో జీతాల పెరుగుదల అంతగా కనిపించడం లేదని పేర్కొంది. AI, డేటా, ఇతర కొత్త టెక్నాలజీలపై skills పెంచుకుంటే జాబ్ అవకాశాలతోపాటు మంచి salary పొందే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు.

పూరీ జగన్నాథుడి అకౌంట్లో ఎన్ని కోట్లున్నాయో తెలుసా?
పూరీ జగన్నాథ స్వామి పేరిట వివిధ బ్యాంకుల్లో ₹1,911.80 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు ఆలయ పరిపాలన విభాగం (SJTA) వెల్లడించింది. ఇందులో ₹1,811.10 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మరో ₹100.71 కోట్లు సేవింగ్స్, కరెంట్, ఫ్లెక్సీ ఖాతాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా స్వామి పేరిట 60,821 ఎకరాల భూమి ఉన్నట్లు తెలిపింది. మరోవైపు 48 ఏళ్ల తర్వాత రత్నభండార్‌లోని విలువైన ఆభరణాల లెక్కింపు జరుగుతోంది.

30 ఏళ్ల తర్వాత పట్టాలెక్కిన Japan Economy
దశాబ్దాల పాటు Deflation, తక్కువ వేతనాలు, దాదాపు జీరో వడ్డీ రేట్లతో స్తబ్దుగా ఉన్న జపాన్ ఎకానమీ కీలక మలుపు తిరిగింది. యెన్ విలువ పడిపోవడం, సాలరీలు పెరగడంతో Inflation పెరుగుతోంది. దీంతో Bank of Job తమ పాత Ultra-loose పాలసీకి గుడ్‌బై చెప్పి రేట్లు పెంచింది. 1996 తర్వాత తొలిసారిగా 10-Year Government Bond Yield 3 శాతందాటింది. దీంతో యెన్‌తో నడిచే గ్లోబల్ Carry Trade చిక్కుల్లో పడటంతోపాటు, జపనీస్ ఇన్వెస్టర్లు సొంత దేశానికే మొగ్గు చూపితే భారత్ లాంటి Emerging Marketsకి నిధుల ప్రవాహం తగ్గే ప్రమాదముంది.

ఎప్పుడు కూలుతుందో తెలియదు.. కాంగ్రెస్‌పై రాజాసింగ్ కామెంట్స్
TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై MLA రాజాసింగ్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియక నేతలు ఇష్టమొచ్చినట్లు దోచుకుంటున్నారని విమర్శించారు. మంత్రులు, నేతలు, అధికారులు అనే తేడా లేకుండా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి CM అయ్యాక కూడా అవినీతి ఆగలేదన్నారు. నేతల మధ్య డబ్బుల వాటాల వ్యవహారం దిల్లీ పెద్దలకు కూడా తెలుసని చెప్పారు. ఈ ఇష్యూనే మంత్రి కొండా సురేఖ రాజీనామా వరకు వెళ్లిందని రాజాసింగ్ అన్నారు.

వేరే యాప్స్ ఎందుకు బాస్? వాట్సాప్‌లోనే అన్ని బిల్స్ క్లోజ్!
బిల్లులు కట్టడానికి ఇక పది యాప్‌లు వాడే అవసరం లేదు. Whatsapp కొత్త అప్‌డేట్‌తో గేమ్ మార్చేసింది. భారత్ కనెక్ట్ (BBPS)తో లింక్ అయ్యి కరెంట్, గ్యాస్, క్రెడిట్ కార్డ్, ఫాస్ట్‌ట్యాగ్ లాంటి 22 వేల పైచిలుకు బిల్లర్లను డైరెక్ట్‌గా చాట్ ప్లాట్‌ఫామ్‌పైకి తెచ్చింది. వాట్సాప్ ఓపెన్ చేసి పైన కనిపించే ‘₹’ సింబల్ నొక్కి, బిల్లర్ సెలెక్ట్ చేసి UPI లేదా కార్డులతో సెకన్లలో పేమెంట్ చేసేయొచ్చు. పాత హిస్టరీ, అప్‌కమింగ్ డ్యూస్ కూడా ఇక్కడే క్లియర్‌గా ట్రాక్ అయిపోతాయి.

తల్లి కులంతోనూ రిజర్వేషన్ వర్తిస్తుందన్న మద్రాస్ హైకోర్టు
కుల ధ్రువీకరణ అనేది కేవలం తండ్రి కులాన్ని అనుసరించే ప్రక్రియగా మాత్రమే ఉండకూడదని, తల్లి సామాజిక నేపథ్యం ఆధారంగా కూడా పిల్లలకు రిజర్వేషన్లు వస్తాయని మద్రాస్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. పుదుచ్చేరిలో స్థానిక మహిళలను వివాహం చేసుకున్న వలసదారుల పిల్లల కుల ధ్రువీకరణకు సంబంధించిన 28 పిటిషన్లపై కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. తల్లి SC, MBC, OBC వర్గాలకు చెందినదైతే, అది విస్మరించడం వివక్షకు దారితీస్తుందని చెప్పింది. ఇది దేశవ్యాప్త తీర్పు కాదని, పుదుచ్చేరి స్థానిక పరిస్థితులకు లోబడే వర్తిస్తుందని వివరించింది.

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
బడ్జెట్ సెగ్మెంట్‌లో <a href="https://www.mi.com/in/product/redmi-17-5g/?buyDisabled=1/?utm_source=G_Paid&utm_medium=GDN&utm_campaign=G_Google_Br_SEM_Redmi_DM-B_Redmi17_Static_BrandKW_PreHeattoSale_CPC_Mstore_20260828&gad_source=1&gad_campaignid=24191099501&gbraid=0AAAAADgqOSayINhSIxKknGoBnDOmGBM_x&gclid=Cj0KCQjwteTUBhD4ARIsAEYjs3rmvSU7dMbgSHkawC_f1TG0-o9wq2Hb7owrlx33CVU7aYw0-IknHpEaAqbgEALw_wcB#">Redmi 17 5Gను Xiaomi</a> ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. 6GB+128GB వేరియంట్ ధర రూ.39,999 కాగా, ఆఫర్లతో ఎఫెక్టివ్ ధర రూ.23,999 నుంచి ఉంటుంది. 6.9-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Snapdragon 4 Gen 5 చిప్‌సెట్, 7,900mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ హైలైట్స్. 50MP డ్యూయల్ AI రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5G సపోర్ట్, Android 16 ఆధారిత HyperOS, IP64 రేటింగ్ ఉన్నాయి. సెప్టెంబర్ 10 నుంచి Amazon, Xiaomi ఆన్‌లైన్ స్టోర్‌లో సేల్ స్టార్ట్ అవుతుంది.

స్త్రీల గర్భం, స్వేచ్ఛపై సామాజిక వ్యాఖ్యానం
ఫెమినిస్ట్ స్టడీ సర్కిల్ ప్రపంచ స్త్రీవాద సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించింది. ఇటాలియన్ రచయిత్రి ఒరియనా ఫాలసి రాసిన ‘Letter to a Child Never Born’ పుస్తకాన్ని ఓల్గా తెలుగులో అనువాదం చేశారు. తల్లి తన కడుపులో బిడ్డ ఉన్నట్టు గుర్తించినప్పటి నుంచి, అండం గర్భంలో పెరిగి రూపం మారే ప్రక్రియను ఇందులో వివరంగా చెప్పారు. ఇది కేవలం శరీరం గురించి రాసిన రచనే కాదు, సామాజిక వ్యాఖ్యానం కూడా. పితృస్వామ్యం మన ఆచారాలు, భాష, సంస్కృతులను ఎలా తయారు చేసిందో ఈ పుస్తకం చెబుతుంది. పుస్తకం ధర రూ.100. కొనే <a href="https://www.telugubooks.in/products/puttani-biddaku-thalli-uttharam?srsltid=AfmBOorDrAEUy8FkbTr9Tubb4BId_N3ZPRpD-RxM8kBlKq7YQfh7Ni_b">లింక్</a>.

ఆర్మీ గన్స్ ఎక్కడికి వెళ్లాయి? జవాన్ల ఫోన్లు సీజ్!
సోమవారం సికింద్రాబాద్ బోల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆర్మీ గన్స్, తూటాలు దొంగతనం కేసు పోలీసులు ఛాలెంజింగ్గా తీసుకున్నారు. దొంగలు తాళాలు బ్రేక్ చేసి, గన్స్‌తో పాటు వాటికి సెట్ అయ్యే బుల్లెట్లను మాత్రమే తీసుకెళ్లడంతో లోపలి వ్యక్తుల హ్యాండ్ ఉందనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. ఆర్మీ సిబ్బందిపై 'హనీట్రాప్' ఏమైనా జరిగిందా అనే అనుమానంతో వారి ఫోన్స్, సోషల్ మీడియా అకౌంట్స్‌ను చెక్ చేస్తున్నారు. కంట్రీ సెక్యూరిటీకి సంబంధించిన ఈ హైప్రొఫైల్ కేసును మిలిటరీ, పోలీసులు ఫాస్ట్‌గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి.