Latest

గచ్చిబౌలిలో కూలిన బిల్డింగ్.. స్పాట్‌కు చేరుకున్న MLA
TG· 22 Aug 2026

గచ్చిబౌలిలో కూలిన బిల్డింగ్.. స్పాట్‌కు చేరుకున్న MLA

TG: ఈరోజు హైదరాబాద్ గచ్చిబౌలిలో విషాద ఘటన జరిగింది. అంజయ్యనగర్‌లో కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న ఏడంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఘటనతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపించారు. విషయం తెలుసుకున్న శేరిలింగంపల్లి MLA అరెకపూడి గాంధీ స్పాట్‌కు చేరుకున్నారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్‌కు పాల్పడిన వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ప్రమాదానికి సంబంధిత అధికారులు, ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని అన్నారు.

విదేశాల్లో నెలకు రూ.2 లక్షల సాలరీతో జాబ్స్
Jobs· 22 Aug 2026

విదేశాల్లో నెలకు రూ.2 లక్షల సాలరీతో జాబ్స్

తెలంగాణ యూత్‌కి ఫారెన్‌లో బ్లూ కాలర్ జాబ్స్ ఇప్పించేందుకు గవర్నమెంట్ 'టామ్‌కామ్' ద్వారా ప్లాన్ చేసింది. కనీస విద్యార్హత ఉండి, అక్కడి లోకల్ లాంగ్వేజ్ వస్తే చాలు.. నెలకు రూ.2 లక్షల వరకు శాలరీ సంపాదించవచ్చు. ప్రతీ ఇయర్ 5 వేల మందికి, 2047 కల్లా 2 లక్షల మందికి విదేశాల్లో జాబ్స్ ఇప్పించడమే టార్గెట్. గవర్నమెంట్ ఫైనాన్షియల్ హెల్ప్ కూడా ఇస్తుంది. జర్మనీ, జపాన్, యూఏఈల్లో హెల్త్‌కేర్, లాజిస్టిక్స్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్‌లో భారీగా వేకెన్సీస్ ఉన్నాయి.

దారకొండ ఆసుపత్రిలో టైమ్‌కి రాని డాక్టర్లు
Local· 22 Aug 2026

దారకొండ ఆసుపత్రిలో టైమ్‌కి రాని డాక్టర్లు

AP : అల్లూరి సీతారామరాజు జిల్లాలో జీకే వీధి మండలం దారకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది టైమ్‌కి రాకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జ్వరం, చెకప్‌ల కోసం పొద్దున్నే వస్తే గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తోందని ప్రజలు చెబుతున్నారు. టైమ్‌కి వైద్యం అందక అత్యవసర పరిస్థితి ఉంటే పక్క ఊళ్లకు వెళ్లాల్సి వస్తోంది. అధికారులు వెంటనే స్పందించి లేట్‌గా వచ్చే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అమెరికా 3 లక్షలు.. భారత్ 13 లక్షలు! ఎందుకు?!
International· 22 Aug 2026

అమెరికా 3 లక్షలు.. భారత్ 13 లక్షలు! ఎందుకు?!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రాకెట్ లాంచ్‌లు భారత్‌లోనే జరుగుతున్నాయని కేంబ్రిడ్జ్, ఇటలీ ఎకనామిస్టుల రీసెంట్ స్టడీ వెల్లడించింది. మన దేశంలో కిలో పేలోడ్‌ను స్పేస్‌లోకి పంపేందుకు $13,302 (రూ.12.7 లక్షలు) ఖర్చవుతుండగా, అమెరికాలో అది $3,225 (రూ.3.1 లక్షలు) మాత్రమే. మన కాస్ట్ US కంటే 4 రెట్లు, యూరోపియన్ యూనియన్ ($9,897) కంటే కూడా ఎక్కువ. ఇప్పటివరకు బడ్జెట్ మిషన్లకు కేరాఫ్ అయిన ఇస్రోకి ఇది షాకింగ్ అప్‌డేట్.

GO 97 రద్దు చేయాలంటూ పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన
Local· 22 Aug 2026

GO 97 రద్దు చేయాలంటూ పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన

TG : మంచిర్యాల జిల్లా నస్పూర్ లోని సింగరేణి పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులు GO 97ను రద్దు చేయాలంటూ రోడ్డుపై కూర్చొని నిరసన తెలియజేశారు. ఈ పోరాటానికి PDSU, AISB విద్యార్థి సంఘాల నాయకులు మద్దతుగా నిలిచారు. ఈ జీవో వల్ల పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయ్యాక పైచదువులైన ఇంజనీరింగ్ చదివే అవకాశాలు దెబ్బతింటాయని, అందుకే ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు కోరారు.

మంచిర్యాల ఆటో డ్రైవర్ల బంద్
Local· 22 Aug 2026

మంచిర్యాల ఆటో డ్రైవర్ల బంద్

TG : మంచిర్యాల జిల్లాలో ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఆటో యూనియన్ JAC నాయకులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 24న ఆటోల బంద్ నిర్వహిస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ బంద్‌కు అందరూ సహకరించాలని కోరుతూ శనివారం జన్నారం తహసీల్దార్ బక్కన్నను కలసి వినతిపత్రం ఇచ్చారు. సమస్యలు త్వరగా తేల్చకపోతే పోరాటం తప్పదని చెప్పారు.

జీవో 97పై విద్యార్థుల ఫైర్.. సూర్యాపేటలో నిరసన
Local· 22 Aug 2026

జీవో 97పై విద్యార్థుల ఫైర్.. సూర్యాపేటలో నిరసన

పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ సూర్యాపేటలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సూర్యాపేట పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు జీవో 97ను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం వల్ల తమ మూడు సంవత్సరాల డిప్లొమా విద్య, తదుపరి ఇంజినీరింగ్ చదువులు, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

కుక్క భయంతో బావిలో పడిన బాలిక.. చివరికి ఇలా!
National· 22 Aug 2026

కుక్క భయంతో బావిలో పడిన బాలిక.. చివరికి ఇలా!

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఫరూఖాబాద్ జిల్లా కైమ్‌గంజ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న బాలికను ఓ కుక్క వెంబడించింది. భయంతో బాలిక బావి వైపు వెళ్లింది. 50 అడుగుల లోతైన బావిలో పడిపోయింది. స్థానికులు సమాచారంతో పోలీసులు, రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకున్నారు. అధికారులు ఆక్సిజన్ మాస్క్‌తో బావిలోకి దిగి బాలికను సేఫ్‌గా బయటకు తీసుకొచ్చారు. తరువాత హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి బాగానే ఉందని అధికారులు తెలిపారు.

సీఎస్‌ఐ ఆస్తుల రక్షణకు పోరుబాట
Local· 22 Aug 2026

సీఎస్‌ఐ ఆస్తుల రక్షణకు పోరుబాట

AP: సీఎస్‌ఐ బిషప్‌ పరిపాలనకు బదులుగా సినాడ్‌ ఆధ్వర్యంలో పాలన కొనసాగించాలని పాస్టర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. సీఎస్‌ఐ, లండన్‌ మిషన్‌కు చెందిన విలువైన భూములు, స్థిరాస్తులను లీజుల పేరుతో అనధికారికంగా విక్రయిస్తున్నారంటూ అసోసియేషన్‌ ఆరోపణలు చేసింది. 146 ఏళ్ల చరిత్ర కలిగిన లండన్‌ మిషన్‌ స్కూల్‌ పరిసరాల్లోని ఆస్తులతో పాటు అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలోని ఆరోగ్యవరం మిషన్‌ ఆస్తుల పరిరక్షణపై ఆందోళన వ్యక్తం చేసింది. కోట్ల రూపాయల విలువైన మిషన్‌ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ఉందని పేర్కొంది.

వేధింపులు ఎదురైతే భయపడొద్దు: షీటీమ్ భరోసా
Local· 22 Aug 2026

వేధింపులు ఎదురైతే భయపడొద్దు: షీటీమ్ భరోసా

TG: విద్యార్థినుల భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో షీ టీమ్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. రామగుండం సీపీ ఆదేశాల మేరకు పెద్దపల్లి షీ టీమ్ ఆధ్వర్యంలో మార్కండేయ కాలనీలోని మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాల విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు. షీ టీమ్ ఇన్‌చార్జి ఎస్‌ఐ లావణ్య గుడ్ టచ్, బ్యాడ్ టచ్, అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండటం, పోక్సో చట్టం, సోషల్ మీడియా ప్రభావంపై వివరించారు. మహిళల భద్రత, ఆన్‌లైన్ మోసాలు, డ్రగ్స్‌ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు.

PSCMSను అందుబాటులోకి తెచ్చిన విద్యాశాఖ
Local· 22 Aug 2026

PSCMSను అందుబాటులోకి తెచ్చిన విద్యాశాఖ

TG: ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు, అడ్మిషన్లు, విద్యార్థుల భద్రత, వసతుల సమస్యలపై వచ్చే ఫిర్యాదుల నమోదు, పర్యవేక్షణ కోసం తెలంగాణ పాఠశాల విద్యాశాఖ PSCMS(ప్రైవేట్ స్కూల్స్ కంప్లైంట్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) ఆన్‌లైన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఈ చర్యను CCV(COUNCIL FOR CITIZENS VOICE) స్వాగతించింది. ఫిర్యాదులను నిర్ణీత గడువులో విచారించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

పరకాలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Local· 22 Aug 2026

పరకాలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

TG: పేద కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం పరకాలలో జరిగింది. హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. పరకాల పట్టణంతో పాటు పరకాల, నడికుడా, ఆత్మకూర్, దామెర మండలాల పరిధిలోని అర్హులైన పేద కుటుంబాలకు ఈ కార్డులను అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ముళ్లపొదల్లో పసికందు..కాపాడిన గొర్రెలకాపర్లు
Local· 22 Aug 2026

ముళ్లపొదల్లో పసికందు..కాపాడిన గొర్రెలకాపర్లు

AP: అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు దగ్గర్లో ఉన్న నగరవనం ఎదుట ముళ్లపొదల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఆడశిశువును పడేసి వెళ్లిపోయారు. అటుగా వెళ్తున్న గొర్రెల కాపర్లు చిన్నారి ఏడుపు విని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. శిశువు ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత శిశు సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని ICDS సూపర్వైజర్ ఝాన్సీ తెలిపారు.

NQAS గుర్తింపునకు వైద్య సిబ్బంది శ్రమించాలి: DPO
Local· 22 Aug 2026

NQAS గుర్తింపునకు వైద్య సిబ్బంది శ్రమించాలి: DPO

TG: గర్గుల్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌కు జాతీయ నాణ్యతా ప్రమాణాల గుర్తింపు (NQAS) సాధించేలా వైద్య సిబ్బంది సమష్టిగా కృషి చేయాలని జాతీయ ఆరోగ్య మిషన్ జిల్లా ప్రోగ్రామ్ అధికారి పద్మజ సూచించారు. శనివారం కామారెడ్డి మండలం గర్గుల్‌లోని పల్లె దవాఖానను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు అందిస్తున్న చికిత్స ప్రమాణాలు, నిరంతర పర్యవేక్షణ, వైద్య సహాయక సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉన్న అన్ని రకాల వైద్య సేవలను నిరంతరం అందించాలని సూచించారు.

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.250 కోట్ల పరిహారం
Local· 22 Aug 2026

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.250 కోట్ల పరిహారం

AP: వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు కోల్పోయి త్యాగాలు చేసిన నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం మరో రూ.250 కోట్ల పరిహారం అందించింది. ఉండవల్లి నివాసంలో CM చంద్రబాబు నిర్వాసిత కుటుంబాలకు రూ.250 కోట్లచెక్కు ను అందజేశారు. ఇప్పటివరకు వెలిగొండ నిర్వాసితులకు ప్రభుత్వం అందించిన మొత్తం పరిహారం రూ.768 కోట్లకు చేరింది. కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ముత్తుమల అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.

అమీన్పూర్‌లో  అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Local· 22 Aug 2026

అమీన్పూర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

TG: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్‌ డివిజన్‌లో మౌలికవసతుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తూ రూ.8.19 కోట్ల పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రాజేంద్రరెడ్డి కాలనీ, సాయిఅంబిక కాలనీ, పీఎన్‌ఆర్ కాలనీ, నరేంద్రనగర్, సాయిరామ్ ఎంక్లేవ్, శంకర్ గ్రీన్ హోమ్స్, బృందావన్ టీచర్స్ కాలనీ, నవ్య నందనవనం, నర్రేగూడెం, రాజీవ్ గృహకల్ప కాలనీల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో సుమారు రూ.8.19 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అంతర్గత మురుగు నీటి కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

రాజా బహదూర్ సేవలు అజరామరం: ఎమ్మెల్యే
Local· 22 Aug 2026

రాజా బహదూర్ సేవలు అజరామరం: ఎమ్మెల్యే

TG: విద్యారంగాన్ని బాగు చేసి, నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి అందించిన సేవలు అజరామరమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్‌నగర్ పట్టణంలో రెడ్డి సేవాసమితి ఆధ్వర్యంలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి జయంతి వేడుకలను నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. రాజా బహదూర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందే మోహన్, రెడ్డి సేవా సమితి అధ్యక్షుడు మదన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు
Local· 22 Aug 2026

కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు

TG: కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 42 పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులు 15, సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు 22, సీఏఎస్‌ (స్పెషలిస్ట్‌) పోస్టులు 5 ఖాళీలు ఉన్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ బి. వాల్యా తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 27న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగే వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు.

SVBC చైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారం
Local· 22 Aug 2026

SVBC చైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారం

AP: తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో SVBC(Sri Venkateshwara Bhakthi Channel) చైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు వచ్చారు. నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణతోపాటు వారి కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ వర్మ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఎస్వీబీసీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

రామగుండంలో యూరియా ఉత్పత్తికి అంతరాయం
Local· 22 Aug 2026

రామగుండంలో యూరియా ఉత్పత్తికి అంతరాయం

TG: కరీంనగర్ జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని RFCL యూరియా పరిశ్రమలో రిఫార్మర్ సిస్టం ఎల్బోలో భారీ శబ్దంతో పగిలి పోయినట్టు తెలుస్తుంది. దీంతో అమోనియా లీక్ అయ్యి పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. యూరియా ఉత్పత్తికి వారం రోజులపాటు అంతరాయం ఏర్పడనుంది. తరచూ కర్మగారంలో యూరియా లీక్ అవడంతో తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు అంటున్నారు.

ఆదివాసీల అద్భుతం..వెదురు కొమ్ములు కూర!
Infotainment· 22 Aug 2026

ఆదివాసీల అద్భుతం..వెదురు కొమ్ములు కూర!

ఆదివాసీల జీవన విధానంలో అడవి అంటే కేవలం చెట్లు, కొండలు మాత్రమే కాదు. వారి ఆహారం, ఆరోగ్యం, సంస్కృతి, జీవనాధారం కూడా. వర్షాకాలం ప్రారంభమైతే అడవుల్లో ప్రకృతి అందాలతోపాటు అనేక రకాల సహజ ఆహార పదార్థాలు అందుబాటులోకి వస్తాయి. కొన్ని ప్రాంతాల్లో కోరేడిగా పిలిచే వెదురు కొమ్ములు వర్షాకాలంలోనే ఎక్కువగా లభిస్తాయి. అడవిలోకి వెళ్లే ఆదివాసీ ప్రజలు తాజా వెదురు కొమ్ములను సేకరించి ఇళ్లకు తీసుకువస్తారు. అనంతరం తమ పూర్వీకుల నుంచి వచ్చిన సంప్రదాయ పద్ధతుల్లో వాటిని శుభ్రం చేసి వంట చేసుకుంటారు.