Latest
దారితప్పిన ఏనుగు.. రాత్రంతా బీభత్సం
ఓ ఏనుగు తన మంద నుంచి వేరుపడింది. దారి తప్పింది. పలమనేరు రూరల్ మండలంలోని ఇందిరానగర్ పంట పొలాల్లోకి వెళ్లింది. అర్థరాత్రి తరువాత గుడియాత్తం రోడ్డుపైకి ఎక్కి, భయంకరంగా అరుస్తూ అక్కడున్న ట్రాకర్స్‌పైకి దూసుకెళ్లింది. గ్రామస్తులు, రైతులంతా ఆ ఏనుగును టపాసులు, బాణాలు, ఔట్లు పేల్చుతూ ఏనుగును పొలాల మీదుగా, రోడ్డు పక్కనే ఉన్న అడవి వైపు మళ్లించారు. గతంలో ఏర్పాటు చేసిన హ్యాంగింగ్ సోలార్ ఫెన్సింగ్‌ను విద్యుత్ సరఫరా ఉన్నప్పటికీ ఏనుగు కాళ్లతో తొక్కి ధ్వంసం చేసింది.

పిచ్చికుక్కల భయం.. 15 మందికి తీవ్ర గాయాలు!
AP : నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో పిచ్చికుక్కలు విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలపై విరుచుకుపడుతున్నాయి. 15 మందిపై దాడి చేసి కాళ్లు, చేతులు, చెవులను తీవ్రంగా గాయపరిచాయి. బాధితులు ప్రస్తుతం వింజమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో వీధికుక్కల సంఖ్య బాగా పెరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నలుగురు ఎస్‌ఐల బాధ్యతల స్వీకరణ
రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తంగాళ్లపల్లి ఎస్‌ఐ అశోక్, ఇల్లంతకుంట ఎస్‌ఐ ఉపేంద్ర చారి, వేములవాడ రూరల్ ఎస్‌ఐ ప్రశాంత్ రెడ్డి, కొనరావుపేట ఎస్‌ఐ రామ్మోహన్ జిల్లా ఎస్పీ మహేష్ బి. గితేంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ వారికి శుభాకాంక్షలు తెలిపి, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్‌పై దృష్టి సారించి, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు.
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లింగయ్యపల్లె గ్రామపంచాయితీ కార్యదర్శి వరలక్ష్మి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ వ్యక్తి ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు.. పంచాయతీ కార్యదర్శిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతామన్నారు. ఈ ఘటనతో జన్నారం మండలంలో కలకలం రేగింది
చంద్రబాబు పర్యటన కోసం చిరు వ్యాపారులపై బుల్డోజర్
తమ హంగూ ఆర్భాటాల కోసం చిన్నోళ్లపై బుల్డోజర్లను నడిపే సంస్ర్కుతి టిడిపికి కూడా పాకింది. చంద్రబాబు పర్యటన కోసం వస్తున్నడని, చిరు వ్యాపారుల షాపులపై టిడిపి నేతలు బుల్డోజర్లు నడిపించారు. షాపులను కూల్చేశారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం ఏ కోడూరులో జరిగింది. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొనడానికి సిఎం చంద్రబాబు రేపు హెలికాప్టర్లో వస్తున్నారు. హెలీ ప్యాడుకు ఎలాంటి ఆటంకం లేకపోయినా సమీపంలో ఉన్న షాపులన్నింటినీ బుల్డోజర్లతో కూలగొట్టారు.

టీచర్ ఉద్యోగాల అమ్మకం.. జగన్ సంచలన ఆరోపణలు!
AP : Sports కోటా పేరుతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయ పోస్టులను అమ్ముకున్నారని YCP అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. తమకు కావలసిన వారికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికే ప్రత్యేక జీవోలు జారీ చేశామని చంద్రబాబు, లోకేష్ అసెంబ్లీలో ఒప్పుకున్నారని ఆయన తెలిపారు. పీవీ సింధు పేరు చెప్పి దీన్ని సమర్థించుకుంటున్నారని, కానీ ఉద్యోగాలు అమ్ముకోవడానికే జీవో నెం 4, 47 ఇచ్చారని విమర్శించారు. తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ జీవో నెం 23, 56 జారీ చేశారని జగన్ అన్నారు.

పడిపోనున్న రూపాయి వ్యాల్యూ?
వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల ఇండియా ఆయిల్, గ్యాస్ ఇంపోర్ట్ బిల్లు భారీగా పెరిగింది. పెట్రోలియం మినిస్ట్రీ డేటా ప్రకారం ఏప్రిల్-జులై మధ్య నెట్ ఇంపోర్ట్ వ్యాల్యూ ఏకంగా 43.4% పెరిగి $57.8 బిలియన్లకు చేరింది. గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ రేట్లు పెరగడమే దీనికి మెయిన్ రీజన్. దిగుమతి పరిమాణంలో పెద్దగా మార్పు లేకపోయినా, హై ప్రైసెస్ వల్ల బిలియన్ల కొద్దీ మనీ ఎక్కువ స్పెండ్ చేయాల్సి వచ్చింది. దీనివల్ల ఫ్యూచర్‌లో ఇండియాలో ఇన్ఫ్లేషన్ పెరిగి, ఇండియన్ రూపీ వ్యాల్యూ పడిపోయే ఛాన్స్ ఉంది.

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని తల్లాకొత్తపేట, రామ్నూర్, కప్పట్రావుపేట గ్రామాల్లో శుక్రవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచులు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్డులు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు

విద్యాసంస్థల్లో ఫైర్ సేఫ్టీ ఏది? తనిఖీలు చేపట్టరా? - AIPSU
నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో కనీస ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు లేవని, ఇట్లయితే విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదమని AIPSU నిర్మల్ జిల్లా కార్యదర్శి గడపాలి పరమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. భవనాల్లో అత్యవసర నిష్క్రమణ మార్గాలు, పనిచేసే ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు లేవన్నారు. DEO, అగ్నిమాపక అధికారులు వెంటనే సంయుక్త తనిఖీలు చేపట్టి, NOC లేని సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. తక్షణమే స్పందించకున్నా, పట్టించుకోకపోయినా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

వినుకొండలో ప్రజా దర్బార్
AP : పల్నాడు జిల్లా వినుకొండలోని Chief Whip కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఇందులో Chief Whip జీవీ.ఆంజనేయులు పాల్గొని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. రోడ్లు, నీళ్లు వంటి మౌలిక వసతుల సమస్యలపై చాలా మంది ఆయనకు చెప్పుకున్నారు. ప్రజల ఇబ్బందులు విన్న చీఫ్ విప్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల కష్టాలను తెలుసుకుని పరిష్కరించడమే ఈ ప్రజాదర్బార్ ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.

సమస్యల పరిష్కారానికి మంత్రి భరోసా
TG: గ్రామాల్లో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, అక్కడికక్కడే అధికారులతో సమీక్షిస్తూ పరిష్కార మార్గాలు చూపడమే లక్ష్యంగా ‘పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వీర్లగడ్డ తండా, మల్లారం, రసూల్‌పల్లి గ్రామాల్లో మంత్రి పర్యటించి ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలు, గ్రామాభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

జొన్నలరాశి గుట్టలోనే మండలాఫీసులు.. మంత్రికి వినతి
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రానికి నిర్మించనున్న ప్రభుత్వ కార్యాలయాలను స్థానిక జొన్నలరాశి గుట్ట వద్ద ఉన్న ప్రభుత్వ స్థలంలోనే నిర్మించాలని సర్పంచ్ మారం సునీత కోరారు. ఈ మేరకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, భవిష్యత్తులో నిర్మించనున్న ఇతర ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఇదే స్థలంలో నిర్మించాలని కోరారు.

లండన్‌లో ఆగిన రేవంత్..కేంద్ర అనుమతి నిరాకరణ
TG: తెలంగాణ CM రేవంత్‌రెడ్డి చేపట్టిన పది రోజుల ‘తెలంగాణ రైజింగ్’ విదేశీ పర్యటనలో ఊహించని ట్విస్ట్ ఏర్పడింది. బ్రిటన్‌లో ఉన్న ఆయన అమెరికా వెళ్లేందుకు కేంద్రం పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరించింది. దీంతో సీఎం టూర్ మధ్యలోనే ముగించాల్సి వచ్చింది. లండన్‌లో ఉన్న తెలంగాణ ప్రతినిధి బృందానికి కేంద్ర విదేశాంగ శాఖ నుంచి ఈ సమాచారం అందింది. అమెరికా పర్యటనకు ‘క్లియరెన్స్ ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్ ఈజ్ డినైడ్’ అంటూ క్లారిటీ ఇచ్చింది.

మాకు పోలీసుల భద్రత కావాలి... గద్వాలలో టీచర్ల భారీ ర్యాలీ
ప్రిన్సిపల్ రూపా రెడ్డి హత్యపై రాష్ర్టమంతా భారీ నిరసనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన చేపట్టి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. విద్యా సంస్థలకు ప్రత్యేక రక్షణ చట్టం, పాఠశాలల వద్ద డ్రగ్స్ నియంత్రణ, అత్యవసర హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి ఉపాధ్యాయులకు తక్షణ పోలీసు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

గబ్బిలాలపేటలో స్కూల్ కోసం 24న ‘చలో కలెక్టరేట్’
TG: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌లోని గబ్బిలాలపేట బస్తీలో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్(ఆరుట్ల మోడల్)ను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ పాఠశాల సాధన కమిటీ ఆగస్టు 24 ఉదయం 9 గంటలకు ‘చలో కలెక్టరేట్’ కార్యక్రమం నిర్వహించనుంది. కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్, డాక్టర్ ఎం.వి.రెడ్డి, ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్సీ ఎ.నర్సిరెడ్డి, జర్నలిస్టు తులసి చందు తదితరులు హాజరుకానున్నారు.

‘ఇరుముడి’ రివ్యూ
రవితేజ, ప్రియా భవానీ శంకర్, పాప నక్షత్ర లీడ్ రోల్స్‌లో డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన మూవీ ‘ఇరుముడి’. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక గ్రామంలో కూతురిని ప్రాణంగా చూసుకునే తండ్రి త్రినాథ్ (రవితేజ), స్కూల్ పిల్లలకు పొంచి ఉన్న ఒక ప్రమాదం నుంచి వారిని ఎలా కాపాడాడనేదే కథ. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్, పిల్లలు ధైర్యంగా మాట్లాడేలా పేరెంట్స్ సపోర్ట్ చేయాలనే మెసేజ్‌తో సినిమా ఎమోషనల్‌గా సాగుతుంది. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ లేకపోవడం కొన్ని మైనస్లే అయినా, రవితేజ యాక్టింగ్, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి.

ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో విషాదం జరిగింది. కొండపై నుంచి జారిపడి తండ్రి, కొడుకు మరణించగా, తల్లి కూడా అదే కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మొదట కొడుకు ఆత్మహత్య చేసుకునేందుకు కొండ అంచుకు వెళ్లాడు. కిందికి రావాలని తల్లిదండ్రులు, గ్రామస్థులు ఎంతగానో బతిమాలారు. వినకపోవడంతో రక్షించడానికి తండ్రి కొండపైకి ఎక్కాడు. ఆ ప్రయత్నంలో ఇద్దరూ జారిపడి మృతి చెందారు. వాళ్ల మరణాన్ని కళ్లెదుటే చూసిన తల్లి అదే కొండపై నుంచి దూకి ప్రాణాలు విడిచారు.
డీసీపీ కార్యాలయం బయట రాహుల్, ప్రియాంక ధర్నా
ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లోని డీసీపీ కార్యాలయం బయట కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ధర్నాకు దిగారు. పెల్లెట్ గన్ ఘటనపై ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేయాలని గాయపడ్డ విద్యార్థి సాహిల్ లోచబ్‌తో కలిసి రాహుల్ డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ దగ్గర జరిగిన విద్యార్థుల నిరసనలో సాహిల్‌కు పెల్లెట్ గన్‌తో గాయాలు అయ్యాయని తెలిపారు. అతని కంటిచూపు ప్రమాదంలో ఉందని వివరించారు. పైనుంచి ఆదేశాలున్నాయని అంటూ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి నో అంటున్నారని రాహుల్ ఆరోపించారు.

రూపా రెడ్డి హత్యకు నిరసనగా ఉపాధ్యాయుల ర్యాలీ
TG : నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్యను ఖండిస్తూ కల్వకుర్తిలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. మహబూబ్‌నగర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించి ఆమె ఫోటోకి నివాళులర్పించారు. ఉపాధ్యాయులపై దాడులు ఆగాలంటే టీచర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని, మత్తు పదార్థాలను అరికట్టాలని ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో JAC నాయకుడు రాజేందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

బామ్మ పాత్రలకు కేరాఫ్ అడ్రస్
షావుకారు జానకి తెలుగులో హీరోయిన్ పాత్రలతోపాటు వైవిధ్యమైన మరెన్నో పాత్రలు పోషించారు. 2000 నుంచి 2020 దాకా తెలుగులో అమ్మమ్మ, నానమ్మ పాత్రలకు ఆమె కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ‘దేవి’, ‘మేడమ్’, ‘శుభాకాంక్షలు’, ‘బావగారు బాగున్నారా’, ‘రావోయి చందమామ’..ఇలా అనేక సినిమాల్లో బామ్మ పాత్రలు వేశారు. తెలుగులో ఆమె నటించిన చివరి సినిమా 2023లో విడుదలైన 'అన్నీ మంచి శకునములే'. ఈ సినిమాకు నందినీరెడ్డి డైరెక్టర్.
రేవంత్ రెడ్డి Vs పాలిటెక్నిక్ స్టూడెంట్స్!
TG: తెలంగాణలో GO 97ను రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థులు నిరసనలు ఉధృతం చేశారు. పాలిటెక్నిక్ కాలేజీలను ITIలతో కలిపి Skill University కిందకు తెస్తే 3 ఏళ్ల డిప్లొమా కోర్సు వాల్యూ తగ్గిపోతుందని, ECET ద్వారా బీటెక్ లోకి లేటరల్ ఎంట్రీ ఛాన్స్ పోతుందని స్టూడెంట్స్ ఆందోళన చెందుతున్నారు. జీవో రద్దు చేయకపోతే రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ మినిస్టర్ పదవికి రిజైన్ చేసే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.