సమస్యల పరిష్కారానికి మంత్రి భరోసా

TG: గ్రామాల్లో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, అక్కడికక్కడే అధికారులతో సమీక్షిస్తూ పరిష్కార మార్గాలు చూపడమే లక్ష్యంగా ‘పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వీర్లగడ్డ తండా, మల్లారం, రసూల్‌పల్లి గ్రామాల్లో మంత్రి పర్యటించి ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలు, గ్రామాభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.



