Latest
ఒక్క స్టూడెంట్ కోసం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
AP: ఒక్క స్టూడెంట్ కోసం పిఠాపురం మున్సిపాలిటీలోని భాస్కర స్పెషల్ మున్సిపాలిటీ పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు చేశారు. అక్కడ ఒకే ఒక బాలుడు చదువుతున్నాడు. అతని కోసం టీచర్ నాగేశ్వరరావు వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమానికి 30 మంది అతిథులు, ఇతర పిల్లలు హాజరయ్యారు. నిజంగా ఇలాంటి టీచర్‌కు హ్యాట్యాఫ్ చెప్పాల్సిందే అని అందరూ అంటున్నారు.

బావిలో మోటారు రిపేర్..విషవాయువు పీల్చి నలుగురు మృతి
బిహార్‌లోని గయా జిల్లాలో బావిలో మోటారు రిపేర్ చేస్తూ విషవాయువు పీల్చి నలుగురు మరణించారు. చామరి మాంఝీ, అతని కుమారుడు దిల్‌చంద్ మాంఝీ, వికాస్ చౌదరి, విజయ్ చౌదరి రిపేర్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని అధికారులకు ఆదేశించారు.

ఫ్లెక్సీ కడుతుండగా షాకింగ్ విషాదం
AP: తిరుపతి జిల్లా పుత్తూరు శ్రీద్రౌపదీదేవి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా బ్యానర్ కడుతూ ఇద్దరు డిగ్రీ విద్యార్థులు కరెంట్ షాక్‌కు గురై మృతి చెందారు. పుత్తూరుకు చెందిన ప్రాణ స్నేహితులు గోకుల్(19), ఎ.విఘ్నేష్(19) బ్యానర్ ఏర్పాటు చేసేందుకు రెండంతస్తుల భవనంపైకి ఎక్కారు. బ్యానర్ కడుతున్న సమయంలో సమీపంలోని 11 కేవీ విద్యుత్ తీగలకు ఫ్రేమ్ తగలడంతో విఘ్నేష్‌కు కరెంట్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన గోకుల్ కూడా షాక్‌కు గురై కిందపడిపోయి ప్రాణాలు కోల్పోయాడు.
తిరంగా యాత్రకి దేవేంద్రనాథ్ మహతోకి నో పర్మిషన్?
జార్ఖండ్ విద్యార్థుల హక్కుల కోసం దేవేంద్రనాథ్ మహతో గత 15 రోజులుగా హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. రాంచీలో స్టూడెంట్స్ నిర్వహిస్తున్న తిరంగా యాత్రలో పాల్గొనేందుకు ఆయన ప్రయత్నించగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హాస్పిటల్ నుంచి బయటకు రాకుండా 50 మందికి పైగా పోలీస్ ఆఫీసర్లు ఆయనను అడ్డుకున్నారు. ఆయనను బలవంతంగా లోపలికి తీసుకెళ్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చాక్‌పీస్‌పై జాతీయ జెండా.. టీచర్ టాలెంట్!
TG: ఇండిపెండెన్స్ డే సందర్బంగా కరీంనగర్ జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన డ్రాయింగ్ టీచర్ రజనీకాంత్ తన ప్రతిభను చాటారు. కేవలం 2.6 సె.మీ. ఎత్తు, ఒక సెంటీమీటర్ వెడల్పు ఉన్న చాక్‌పీస్‌పై జాతీయ జెండాను మూడు గంటలు కస్టపడి డిజైన్ చేశారు. అలాగే మైక్రో సైజులో ‘Happy Independence Day’, ‘I Love India’ అక్షరాలతో పాటు నాలుగు జాతీయ పతాకాలను చాక్‌పీస్ ముక్కలతో తయారు చేసి దేశభక్తిని చాటుకున్నారు.

స్నాప్‌చాట్‌లో పరిచయం.. ఖరీదైన కార్లతో గాలం
TG: ఖరీదైన కార్లు, లగ్జరీ దుస్తులతో సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టి మహిళలను ఆకర్షించి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డికి చెందిన సాగర్ చౌదరి అలియాస్ సాయిసునీల్, శివాంగుల భరత్‌కుమార్ స్నాప్‌చాట్ ద్వారా మహిళలకు పరిచయమై వారిని నమ్మించి బంగారు ఆభరణాలను చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు 20మంది మహిళలను మోసం చేసి 40తులాల బంగారం అపహరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆభరణాలను నగల దుకాణాల్లో విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు గుర్తించారు.

థియేటర్లలో మళ్లీ 'శంకర్‌దాదా' హంగామా!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోయే బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ 'శంకర్ దాదా MBBS' రీ-రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సందర్భంగా మేకర్స్ రీ-రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. చిరంజీవి కామెడీ, దేవిశ్రీ ప్రసాద్ మాస్ పాటలు, 'ATM'గా శ్రీకాంత్ చేసిన అల్లరితో ఈ ట్రైలర్ ప్రేక్షకులను మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్లింది. ఈ సినిమాను చిరంజీవి పుట్టినరోజు (ఆగస్ట్ 22) సందర్భంగా 4K క్వాలిటీతో థియేటర్లలో భారీగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

గ్యాస్ E-KYC మొబైల్ నుంచే పూర్తి చేయండి!
గ్యాస్ ఈ-కేవైసీని మొబైల్ నుంచే ఈజీగా పూర్తి చేసుకోవచ్చు. ముందుగా మీ LPG గ్యాస్ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ యాప్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తరువాత మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ చేసి, ఈ-కేవైసీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆధార్ డీటెయిల్స్‌ను ఎంటర్ చేసిన తర్వాత <a href="https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.facerd&hl=en_IN">Aadhaar FaceRD</a> యాప్ ద్వారా ఫేస్ ఆథెంటికేషన్ పూర్తి చేయాలి. వెరిఫికేషన్ సక్సెస్ ఐతే మీ గ్యాస్ ఈ-కేవైసీ పూర్తవుతుంది. ఆన్‌లైన్‌లో చేయడం కుదరకపోతే దగ్గర్లోని గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి ఆధార్ బయోమెట్రిక్ ద్వారా ఈ-కేవైసీ చేయించుకోవచ్చు.

మూగబోయిన ఊరిలో.. మువ్వన్నెల జెండా చేసిన చప్పుడు!
జమ్మూకశ్మీర్‌లో 'సైలెంట్ విలేజ్' గా పిలిచే ధడ్‌కై అనే గ్రామంలో రేష్మా బీబీ, పర్వీన్ కౌసర్, సైరా ఖతూన్ అనే ముగ్గురు దివ్యాంగ అక్కాచెల్లెళ్లు ఉన్నారు. దేశభక్తితో తమ ఊరిలో ప్రతి ఇంటిపై జెండా ఎగరాలని వారు అనుకున్నారు. 'జెండాలు కుట్టేందుకు వస్త్రం తెకపోతే అన్నం తినం' అని తండ్రిని అడిగి వస్త్రం తెప్పించుకున్నారు. ఐదు రోజుల పాటు కష్టపడి 150కి పైగా త్రివర్ణ పతాకాలను స్వయంగా కుట్టి, ఊరంతా పంచారు. దాంతో ఆ నిశ్శబ్ద గ్రామం ఇప్పుడు మన జాతీయ జెండాలతో కళకళలాడుతోంది.
11 నెలల పాపను నదిలోకి విసిరిన తండ్రి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో దారుణ ఘటన జరిగింది. సికంద్రా దగ్గర్లోని రింకు అనే వ్యక్తి తన 11 నెలల పాపను యమునా నదిలోకి విసిరినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆగస్టు 17న పాప బర్త్ డే సందర్భంగా భార్య లక్ష్మితో కలిసి బట్టలు కొనడానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అక్బరీ బ్రిడ్జ్ వద్ద పాపతో సెల్ఫీ తీసుకుంటానని చెప్పి నదిలోకి విసిరినట్లు తెలుస్తోంది. భార్యను కూడా నదిలోకి తోసేందుకు ప్రయత్నించాడు. స్థానికులు అడ్డుకోగా, పాప కోసం వెతుకుతున్నారు.

కళ్యాణ లక్ష్మి ఎలా వచ్చింది?
పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన 'కళ్యాణ లక్ష్మి' పథకంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సంతోషాన్ని పంచుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మంత్రులు, అధికారులతో చర్చించినప్పుడు తన కొడుకు కేటీఆర్ సూచించిన 'కళ్యాణ లక్ష్మి' అనే పేరు అందరికీ నచ్చి ఖరారు చేశామని ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఎంతో ఊరటనిచ్చిందని, ఆడపిల్లల పెళ్లిళ్లు సంతోషంగా జరిగేందుకు ఎంతో ఉపయోగపడిందని ఆ వీడియోలో చెప్పారు.

నాయకుల అరెస్ట్.. నల్గొండలో హైటెన్షన్
TG: స్వాతంత్ర్య దినోత్సవం రోజున నల్గొండలో CPM నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్లు అందజేసే కార్యక్రమానికి హాజరుకానున్న నేపథ్యంలో, ఆయన పర్యటనను అడ్డుకునే అవకాశం ఉందన్న కారణంతో CPM నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీ కార్యాలయానికి స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, జిల్లా నాయకులు ఎండీ సలీం, తదితర నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

మతం మత్తులో కొట్టుకుపోతున్నాం: KTR
TG: స్వాతంత్ర్యం వచ్చి 80ఏళ్లు గడిచినా దేశంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. దేశంలో ఇంకా నీళ్లు, రోడ్లు, కరెంటు లేని గ్రామాలు ఉన్నాయని, నాణ్యమైన విద్య అందక యువత విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. పాకిస్థాన్‌తో పోల్చుకుని గొప్పగా చెప్పుకోవడం కాకుండా భారత్‌లో ఏం సాధించాలో ఆలోచించాలన్నారు. మతం, ఎవరి దేవుడు గొప్ప అనే చర్చలకే పరిమితం కావద్దన్నారు.

Gen-Z తర్వాత Gen-Alpha.. కొత్త పోరాటం: కేజ్రీవాల్
ఈ ఆగస్ట్ 15 మరింత స్పెషల్ అని AAP నేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. Gen-Z తర్వాత ఇప్పుడు Gen-Alpha రెస్పాన్సిబిలిటీస్ తీసుకుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పిల్లలు తమ స్కూల్లో బేసిక్ ఫెసిలిటీస్ కోసం పోరాడుతున్నారని తెలిపారు. డెస్కులు, తాగునీరు, టాయిలెట్స్, మంచి ఎడ్యుకేషన్ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. పిల్లలు తమ రైట్స్ కోసం పోరాడటం నేర్చుకున్నారని, అదే నిజమైన స్వేచ్ఛకు అర్థమని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

దేశం కోసం ప్రతిఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలి
TG: కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం పోలీస్ వాహనంలో గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సంక్షేమం, రైతుల అభివృద్ధి, మహిళలు, విద్యార్థుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మంత్రి వివరించారు. రాష్ట్ర, దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

పూజారి బాగోతం బట్టబయలు
TG: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని ఓ ఆలయంలో మైనర్ బాలికపై లైంగిక దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆలయ ప్రాంగణంలో బాలికతో ఓ వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని స్థానికులు గుర్తించారు. ఆలయానికి బయట నుంచి తాళం వేసి ఉండగా, లోపల బాలికతో అనుచితంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. అతడు ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న సాయన్నగా గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కల్తీ బెల్లం కనిపెట్టడం ఎలా?
బెల్లం మెరిసేలా, బరువు పెంచడానికి బేకింగ్ సోడా వంటి కల్తీలు కలుపుతున్నారు. బెల్లం మంచిదో కాదో తెలుసుకోవడానికి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ (FSSAI) ఒక పరీక్ష చెప్పింది. ఒక గాజు గ్లాసు నీటిలో కొద్దిగా బెల్లం ముక్కలు వేసి, అందులో 'హైడ్రోక్లోరిక్ యాసిడ్' కొన్ని చుక్కలు కలపాలి. ఈ యాసిడ్ ప్రమాదకరమైనది కాబట్టి చేతులకు గ్లౌజులు వేసుకుని, పిల్లలకు దూరంగా జాగ్రత్తగా వాడాలి. బెల్లంలో కల్తీ ఉంటే ఆ నీళ్లు నురగలు వచ్చి రంగు మారతాయి. అసలైన బెల్లం అయితే ఏ మార్పూ ఉండదు. ఈ పరీక్షతో కల్తీని సులభంగా కనిపెట్టవచ్చు.

స్పీచ్ ఇస్తూ.. స్టేజ్‌పైనే కళ్లు తిరిగి పడిపోయిన మంత్రి
AP: తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈరోజు జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన తరువాత స్పీచ్ ఇస్తుండగా కళ్లు తిరిగి ఒక్కసారిగా పక్కకు వాలిపోయారు. వెంటనే సెక్యూరిటీ గార్డ్స్ ఆయనను పట్టుకున్నారు. డాక్టర్స్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్‌మెంట్ చేసారు. బీపీ తగ్గడంతో అస్వస్థతకు గురైనట్లు డాక్టర్స్ తెలిపారు. ప్రస్తుతం మంత్రి హెల్త్ కండిషన్ నిలకడగా ఉందని వెల్లడించారు.

జైలు నుంచి బయటకొచ్చి మళ్లీ అదే పని
AP: అన్నమయ్య జిల్లాలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్‌జిల్లా దొంగలను రాయచోటి అర్బన్<br> పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గాలివీడు మండలం తూముకుంటకు చెందిన మావిళ్ల వీరారెడ్డి అలియాస్ వీరారెడ్డి నాయుడు (45), కోటకొండ ఆంజనేయులు అలియాస్ గుండు (40) అన్నమయ్య, కడప, అనంతపురం జిల్లాల్లో బైక్ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిపై ఇప్పటికే మూడు జిల్లాల్లో 31 ద్విచక్ర వాహనాల చోరీ కేసులు ఉన్నట్లు DSP కృష్ణమోహన్ తెలిపారు.

నోటికి రుచి.. ఒంటికి బలం💪
మన ఆరోగ్యం బాగుండటానికి, శక్తి పెరగడానికి రోజూ మంచి ఫుడ్ తినాలి. అందులో ముఖ్యంగా గ్రీన్ వెజిటేబుల సలాడ్, టమాటా సూప్, యాపిల్, పియర్ (బేరి) పండ్లు రోజూ తింటూ ఉండాలి. వీటితో పాటు జీడిపప్పు, బాదం, వాల్‌నట్స్, పప్పులు (నట్స్), మనం రోజూ తినే రోటీ, అన్నం, కూర (సబ్జీ) తింటే సరిపోతుంది. అలాగే దాహానికి నిమ్మకాయ నీళ్లు తాగితే బాడీకి చాలా మంచిదని డాక్టర్లు అంటున్నారు.

ఇక MPDOవో ఆఫీస్‌లోనే ప్రజావాణి
తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి ఖమ్మం జిల్లా సింగరేణి మండల MPDO కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు MPDO బానోత్ పద్మ తెలిపారు. మండల ప్రజలు తమ సమస్యలను ప్రజావాణిలో అధికారుల దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు కార్యక్రమానికి హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజావాణికి సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.