Latest

మన జాతీయ జెండా రంగుల్లో బట్టలు, నగలు!
మన జాతీయ జెండా రంగులను గుర్తుచేసేలా కొత్త రకాల ఫ్యాషన్ బట్టలు, నగలు మార్కెట్లోకి వచ్చాయి. జెండా రంగుల్లో ఉన్న కాటన్ కోటు (రూ. 37,990), తెల్లటి పట్టు చీర (రూ. 2,12,800), ఎరుపు రంగు పట్టు డ్రెస్ (రూ. 4.24 లక్షలు), చేతితో రంగులు వేసిన షర్ట్-ట్రౌజర్ జత (రూ. 62,900), ఎరుపు సిల్క్ గౌను (రూ. 36,800), కాటన్ చొక్కా (రూ. 9,900) వంటి బట్టలు ఉన్నాయి. వీటితో పాటు ఆకుపచ్చ రత్నాల కమ్మలు (రూ. 13,000), డిజైనర్ చేతి గడియారం (రూ. 3.80 లక్షలు), చేతితో కుట్టిన సంచి (రూ. 9,999) కూడా అందుబాటులో ఉన్నాయి.

ఆ రూట్లో ప్రయాణమా? ముందే బయలుదేరండి.. ట్రాఫిక్ అలర్ట్!
TG: హైదరాబాద్‌లోని మియాపూర్ 'X' రోడ్, ఆల్విన్ 'X' రోడ్ మధ్య కన్‌స్ట్రక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి. ఆగస్ట్ 14 నుంచి 180 రోజుల పాటు కన్‌స్ట్రక్షన్ పనులు కంటిన్యూ అవుతాయి. దీంతో ఆ రూట్లో మార్నింగ్, ఈవెనింగ్ పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ పెరిగే ఛాన్స్ ఉందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు వీలైనంత వరకు ఆల్టర్నేట్ రూట్స్‌ను చూసుకోవాలని, ఆఫీసులకు వెళ్లే వారు ముందుగానే బయలుదేరాలని సూచించారు.

గోల్కొండ ఫోర్ట్‌లో గ్రాండ్‌గా 'ఇండిపెండెన్స్ డే' వేడుకలు
TG: హైదరాబాద్‌లోని గోల్కొండ ఫోర్ట్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. గోల్కొండ కోటపై తొలిసారిగా ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించారు. దీంతో కోట ప్రాంగణం దేశభక్తి నినాదాలతో మార్మోగింది. తరువాత సీఎం రాష్ట్ర అభివృద్ధిపై స్పీచ్ ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

దొంగిలించిన చీరే దొంగలను పట్టించింది
TG: రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్‌లోని వినాయకనగర్‌లో యాదయ్య ఇంట్లో 2023లో రూ.2.50 లక్షల నగదు, 9తులాల బంగారం, చీరలు చోరీ అయ్యాయి. కేసు నమోదైనా నిందితు ఆచూకీ లభించలేదు. ఇటీవల యాదయ్య భార్య ఓ ఫంక్షన్‌కు వెళ్లగా, ఇంటి వెనుక నివసించే స్వప్న అనే మహిళ కట్టుకున్న చీరను గుర్తించారు. అది తన ఇంట్లో చోరీకి గురైన చీరగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు స్వప్న, ఆమె భర్త రాములును అదుపులోకి తీసుకుని విచారిస్తే, మూడేళ్ల క్రితం మేమే దొంగతనం చేశాం అని ఒప్పుకున్నారు. ఆ దంపతుల్ని అరెస్ట్ చేశారు.

Independence Day వేడుకల్లో త్రిష 🇮🇳
తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన Independence Day సెలబ్రేషన్స్‌లో హీరోయిన్ త్రిష సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. వీక్షకుల గ్యాలరీలో ముందు వరుసలో సీఎం విజయ్ పేరెంట్స్ పక్కనే ఆమె కూర్చున్నారు. అక్కడి అధికారులను నవ్వుతూ పలకరించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

అమరావతిలో ఘనంగా 'ఇండిపెండెన్స్ డే' సెలెబ్రేషన్స్
AP: రాజధాని అమరావతిలో తొలిసారిగా 'Independence Day' సెలెబ్రేషన్స్‌ను ప్రభుత్వం ఘనంగా జరిపింది. రాయపూడి పరేడ్ గ్రౌండ్‌లో ‘స్వర్ణాంధ్ర-2047’ థీమ్‌తో సెలెబ్రేషన్స్ జరిగాయి. CM చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. తరువాత పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించారు. APSP, CRPF, కర్ణాటక పోలీసు దళాలు, NCC క్యాడెట్లు మార్చ్‌పాస్ట్ నిర్వహించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, కొందరు అధికారులు ఈ సెలెబ్రేషన్స్‌లో పార్టిసిపేట్ చేశారు.

‘పంజా’ మళ్లీ థియేటర్లలో!
పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా ‘పంజా’ సినిమా మరోసారి థియేటర్లలోకి రాబోతోంది. సెప్టెంబర్ 2న 4K క్వాలిటీలో ఈ సినిమాను రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద భారీ సెలబ్రేషన్స్‌కు సిద్ధమవుతున్నారు.

చెన్నారెడ్డి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. నలుగురు అరెస్ట్
AP: పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో జరిగిన నవులూరి చెన్నారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, నేరానికి ఉపయోగించిన స్కార్పియోతోపాటు మూడు గొడ్డళ్లను స్వాధీనం చేసుకున్నారు. రాజకీయ ఆధిపత్యం విషయంలో ఉన్న విభేదాల నేపథ్యంలో చెన్నారెడ్డిని ప్లాన్ ప్రకారం కారుతో ఢీకొట్టి, కళ్లలో కారం చల్లి గొడ్డళ్లతో దాడిచేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులు వాహనంలో పరారవుతుండగా దాచేపల్లి–మాచర్ల క్రాస్‌రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోం: మల్లారెడ్డి
TG: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం బొమ్మరాశిపేట రైతుల భూముల విషయంలో BRS నేతలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామానికి చెందిన 1,049 ఎకరాల భూములను 22ఏ జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ రైతులు నిర్వహించిన మహాధర్నాలో మేడ్చల్ MLA మల్లారెడ్డి, BRS నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని, ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ఒక్క గుంట భూమిని కూడా పోనివ్వబోమని హెచ్చరించారు. దశాబ్దాలుగా రైతులు సాగుచేస్తున్న భూములను 22ఏలో ఎలా చేర్చారని ప్రశ్నించారు.

రోజుకు 100 గ్రాముల ప్రొటీన్ ఎలా పొందాలి?
మన శరీరం బలంగా ఉండటానికి, శక్తి రావడానికి రోజుకు 100 గ్రాముల ప్రొటీన్ అవసరం. అయితే అది మనం రోజూ తినే ఆహారంలోనే ఉంటుంది. రెండు గుడ్లు తింటే 12 గ్రాములు, 100 గ్రాముల చికెన్ లో 30 గ్రాములు, ఒక కప్పు పప్పు తింటే 15 గ్రాముల ప్రొటీన్ వస్తుంది. అలాగే కప్పు పెరుగులో 10 గ్రాములు, 100 గ్రాముల పనీర్‌లో 20 గ్రాములు, కొన్ని నట్స్ తింటే 10 గ్రాములు, ఒక గ్లాస్ ప్రొటీన్ షేక్ ద్వారా 20 గ్రాముల శక్తి అందుతుంది. ఇవి సరిగ్గా తింటే కండరాలు బలంగా మారతాయి, అలసట లేకుండా రోజంతా ఆక్టివ్ గా ఉంటారని డాక్టర్లు చెబుతున్నారు.

ఇండిపెండెన్స్ డే రోజు మోదీను Gift కోరిన సోనమ్ వాంగ్‌చుక్!
ఇండిపెండెన్స్ డేకు PM నరేంద్ర మోదీ నుంచి దేశానికి ఒక స్పెషల్ గిఫ్ట్‌ను ఆశిస్తున్నానని యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు. 2014లో ప్రధాని ఇచ్చిన హామీలో భాగంగా పార్లమెంట్‌ను నేరరహితంగా మార్చే దిశగా కీలక నిర్ణయం తీసుకోవాలని కోరారు. డెమోక్రసీని మరింత క్లీన్ అప్ చేసే ఈ అంశానికి ఆపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీతో పాటు అన్ని పొలిటికల్ పార్టీలు సపోర్ట్ ఇవ్వాలని ఆకాంక్షించారు. సెల్ఫ్‌లెస్‌గా పనిచేసే వ్యక్తుల పేర్లను సూచించాలని, వారి నుంచి నేర్చుకునే అవకాశం కల్పించాలని కోరారు.

క్లాస్‌రూమ్ లేదు.. రేకుల షెడ్‌లో విద్యాభ్యాసం
TG: వనపర్తి జిల్లా పెబ్బేరులోని చెంచువాడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రీప్రైమరీ నుంచి ఐదోతరగతి వరకు 136 మంది విద్యార్థులు ఉండగా, కేవలం రెండు తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. స్థానికులు, దాతల సహకారంతో రేకుల షెడ్లు ఏర్పాటుచేసి తరగతులు నిర్వహిస్తున్నారు. మూడు, నాలుగు, ఐదు తరగతుల విద్యార్థులకు బ్లాక్‌బోర్డులు లేకుండానే పాఠాలు బోధిస్తున్నారు. ఎండ, వర్షాల సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. వర్షం కురిస్తే తరగతులు నిర్వహించలేకపోతున్నారు.

FIRST DAY కలెక్షన్లు!
హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కలిసి తీసిన 'విశ్వనాథ్ & సన్స్' సినిమా థియేటర్లలో బాగా ఆడుతోంది. మొదటి రోజే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి రూ. 3.66 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. అన్ని భాషల్లో కలిపి తొలిరోజే రూ.10.03 కోట్లు వసూలు అయింది. సినిమా స్టోరీ నచ్చడంతో జనం థియేటర్లకు బాగా వెళ్తున్నారు.

చీపురుపల్లిలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్
AP: విజయనగరం జిల్లా చీపురుపల్లి మండల ప్రాంత ప్రజలకు అత్యవసర సమయాల్లో రక్తం అందుబాటులో ఉండేలా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. MLA కిమిడి కళా వెంకటరావు, MP కలిశెట్టి అప్పలనాయుడు కలిసి కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రమాదాలు, అత్యవసర శస్త్రచికిత్సలు, ప్రసవ సమయాల్లో రక్తం అవసరమైన వారికి ఈ కేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నాయకులు తెలిపారు. అత్యవసర సమయంలో రక్తం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు తగ్గనున్నాయని పేర్కొన్నారు.

OTT లోకి 'చెన్నై లవ్ స్టోరీ'
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ఆడియన్స్ ను అలరించేందుకు ఓటీటీలోకి రావడానికి సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ఓటీటీ సంస్థ 'సోనీ లివ్' దక్కించుకుంది. ఆగస్టు 21 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు
ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ద్వీపంలో ఈరోజు ఉదయం భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రత నమోదైనట్లు US జియోలాజికల్ సర్వే తెలిపింది. దాదాపు గంటన్నరలో ఐదుసార్లు ఎర్త్‌క్వేక్ ట్రెమర్స్ వచ్చాయి. దీంతో ఈస్ట్ నుసా తెంగారా ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఎండే నగరానికి 68 కి.మీ దూరంలో 10 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తీర, నదీ దగ్గర ప్రాంతాల ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని అధికారులు సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టంపై ఇంకా వివరాలు ప్రకటించలేదు.

రాష్ట్రంలో రైతు బీమా పథకానికి బ్రేక్
TG: రాష్ట్రంలో ఎనిమిదేళ్లుగా అమలవుతున్న రైతు బీమా పథకం నిలిచిపోయింది. ప్రతి ఆగస్ట్ 14న రైతుల తరఫున ప్రభుత్వం చెల్లించే ప్రీమియాన్ని ఈసారి నిలిపివేసింది. దీంతో 2026-27 సంవత్సరానికి ఇన్సూరెన్స్ రెన్యూవల్ జరగలేదు. ఈ స్కీమ్ కింద 18-59 ఏళ్ల పట్టాదారు రైతులు సహజంగా లేదా యాక్సిడెంటల్‌గా చనిపోతే వారి ఫ్యామిలీకు రూ.5 లక్షలు అందేవి. రాష్ట్రంలో 42.16 లక్షల మంది రైతులు బెనిఫిషరీస్‌గా ఉన్నారు. రైతులతోపాటు అన్ని కుటుంబాలకు లైఫ్ ఇన్సూరెన్స్ అమలు చేసే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పేదల ఇళ్లకు డబ్బులు ఎందుకు? : తలసాని
TG: పేదలకు ప్రభుత్వం ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత BRS ప్రభుత్వం పేదల ఆత్మగౌరవం కోసం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించిందని గుర్తుచేశారు. GHMC పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టి, 69 వేల ఇళ్లను లబ్ధిదారులకు అందజేశామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఇళ్ల కోసం డబ్బులు వసూలు చేయడం సరికాదని విమర్శించారు. లబ్ధిదారుల నుంచి రూ.10 వేలు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.

BCలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: శ్రీనివాస్
TG: కాంగ్రెస్ ప్రభుత్వం BCలకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మంచిర్యాల నుంచి హాజీపూర్ వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా BC డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలపై స్పష్టమైన చర్యలు కనిపించడంలేదని విమర్శించారు. స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లు, BC సబ్‌ప్లాన్, కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు, రుణాలు, బీసీ భవనాల నిర్మాణం, తదితర హామీలను వెంటనే అమలు చేయాలన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేళ గిరిజనుల నిరసన..
AP: స్వాతంత్య్ర దినోత్సవ వేళ అనకాపల్లి జిల్లా గిరిజనులు నిరసన ర్యాలీ చేపట్టారు. రావికమతం, వి.మాడుగుల మండలాల పరిధిలోని సమలమ్మ కొండపై ఉంటున్న 22 గిరిజన కుటుంబాలు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు నేషనల్ ఫ్లాగ్స్‌తో గుర్రాలపై మూడు కి.మీ. ర్యాలీ చేశారు. ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీస్‌తో పాటు కనీస వసతులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. “ఏ సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నాం.. మమ్మల్ని కనీసం మనుషులుగా గుర్తించండి” అంటూ నినాదాలు చేశారు.

పురుష ఫ్యాకల్టీని తొలగించాలి: జిలుకర రవికుమార్
తెలంగాణలోని బాలికల రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో మహిళా ఫ్యాకల్టీని మాత్రమే నియమించాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ (TPRP) రాష్ట్ర అధ్యక్షుడు జిలుకర రవికుమార్ ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఉషారాణికి వినతిపత్రాన్ని అందజేసి మాట్లాడారు. జనగామ జిల్లా కొడకండ్ల బాలికల రెసిడెన్షియల్ కళాశాలలో పురుష ఫ్యాకల్టీ కారణంగా విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, విద్యార్థినుల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరారు.