Latest

ఆలూరు ఎమ్మెల్యే తమ్ముడు అరెస్ట్
Politics· 8 Aug 2026

ఆలూరు ఎమ్మెల్యే తమ్ముడు అరెస్ట్

AP: ఆలూరు MLA విరూపాక్షి తమ్ముడు శ్రీరాములు అరెస్టయ్యారు. గుంతకల్లులోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఆయనను పోలీసులు నిన్న రాత్రి అరెస్టు చేశారు. ఆగస్టు 1న చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో TDP కార్యకర్త శేఖర్‌పై MLA విరూపాక్షి, ఆయన తమ్ముడు శ్రీరాములు, YSRCP కార్యకర్తలు దాడి చేశారంటూ ఆయన భార్య కంప్లైంట్ చేశారు. ఈ ఘటనలో శ్రీరాములుపై మర్డర్ అటెంప్ట్ కేసు బుక్ అయ్యింది. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు కర్నూలు సబ్‌జైలుకు తీసుకెళ్లారు.

నెయ్యి  తినొచ్చా !
Health· 8 Aug 2026

నెయ్యి తినొచ్చా !

నెయ్యి తినడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండె జబ్బులు రావు, అది పరిమితికి మించి తింటే మాత్రం ప్రమాదకరమే అని డాక్టర్ 'రెఫాయ్ షౌకత్ అలీ' (Cardiologist) చెబుతున్నారు. నెయ్యిని రోజూ తగిన మోతాదులోనే తీసుకుంటే బరువు పెరగరని, శరీరానికి కావలసిన మంచీ జరుగుతుందని అంటున్నారు. రుచిగా ఉందని చెప్పి అతిగా తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్, కొవ్వు బాగా పెరుగుపోతాయి. అలా పేరుకుపోయిన కొవ్వే తర్వాత గుండె సమస్యలకు దారితీస్తుందని తెలిపారు.

అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
TG· 8 Aug 2026

అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

TG: హైదరాబాద్ గచ్చిబౌలి ORR వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇంద్రారెడ్డి నగర్ నుంచి నానక్‌రామ్‌గూడ వైపు వెళ్తున్న తవేరా కారు అదుపుతప్పి నియోపోలీస్ బ్రిడ్జి పిల్లర్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారులో ఉన్న ఇద్దరు టైల్స్ కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను రాజస్థాన్‌కు చెందిన కనైయాలాల్ (25), దేరామ్ (24)గా పోలీసులు గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీవారి దర్శనం తర్వాత తీరని విషాదం
AP· 8 Aug 2026

శ్రీవారి దర్శనం తర్వాత తీరని విషాదం

AP: తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతికి వస్తున్న కర్ణాటకకు చెందిన భక్తుల కారు 22వ మలుపు వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని 15అడుగుల లోతులోకి బోల్తా పడింది. ప్రమాదంలో సతీష్ కుమార్(72) తీవ్రంగా గాయపడి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరోఇద్దరు చిన్నారులు సహా కుటుంబసభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితులు బెంగళూరులోని బన్నేరుఘట్ట రోడ్, గోట్టిగెరికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు తెలిపారు.

హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులకు మినిమమ్‌ ఫీజు ఖరారు
Education· 8 Aug 2026

హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులకు మినిమమ్‌ ఫీజు ఖరారు

AP: రాష్ట్రంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కోర్సులకు గవర్నమెంట్ మినిమమ్ ఫీజులను నిర్ణయించింది. ఉన్నత విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్‌ ఈరోజు ఆర్డర్స్ ఇచ్చారు. డిగ్రీలో B.Scకు రూ.17,500, B.Comకు రూ.14 వేలు, BAకు రూ.13 వేలు, BBA/BBM, BCAలకు రూ.21 వేలు, BHMకు రూ.35 వేలు ఫైనల్ చేశారు. LLB, LLMకు రూ.15-22 వేలు, B-Pharmacy, Pharmacy-D కోర్సులకు రూ.45 వేలుగా నిర్ణయించారు.

కొలెస్ట్రాల్‌ తగ్గించుకోవాలా?
Health· 8 Aug 2026

కొలెస్ట్రాల్‌ తగ్గించుకోవాలా?

శరీరంలో పెరిగే చెడు కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసుకోవాలంటే సరైన డైట్ ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. రోజూ ఆపిల్స్ తింటే కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని డాక్టర్లు అంటున్నారు. వాల్ నట్స్ తీసుకోవడం వల్ల ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయని, అన్నింటికన్నా బెస్ట్‌గా 'ఇసబ్‌గోల్' ఇందులో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెను హెల్దీగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఓ కొత్త రోజు..
Motivational· 8 Aug 2026

ఓ కొత్త రోజు..

ఓటమి ఎదురైనప్పుడు చాలామంది అడుగు వెనక్కి వేస్తారు. కానీ, అలలు ఎంత వెనక్కి తగ్గితే అంత ఎత్తుకు లేస్తాయి. మన జీవితం కూడా అంతే. ప్రతీ రోజూ మనకి లభించే ఒక కొత్త అవకాశం. నిన్నటి తప్పుల గురించి ఆలోచిస్తూ ఈ రోజును వృథా చేసుకోవడం కంటే, ఈ నిమిషం నుంచి మన ప్రయాణాన్ని మళ్లీ సరికొత్తగా ప్రారంభించడమే అసలైన గెలుపు. నీ శ్రమ, నీ నమ్మకం ముందు ఏ కష్టమైనా తలవంచాల్సిందే. సాకులు చెప్పడం ఆపి ప్రయత్నించడం మొదలుపెట్టు. విజయం వైపు వేసే ప్రతి చిన్న అడుగు నిన్ను గమ్యానికి చేరుస్తుంది.

ఆంధ్రా గోవాకు కొత్త రూపు
AP· 8 Aug 2026

ఆంధ్రా గోవాకు కొత్త రూపు

AP: సూర్యలంక బీచ్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేలా అభివృద్ధి చేస్తామని CM చంద్రబాబు తెలిపారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తూర్పు తీర ఆంధ్రా గోవాగా పేరున్న ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే స్వదేశీ దర్శన్ పథకం కింద రూ.97.52 కోట్లతో పనులు జరుగుతున్నాయని చెప్పారు. బీచ్‌ నుంచి చీరాల వరకు 18 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని బీచ్‌ కారిడార్‌గా అభివృద్ధి చేసి, ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.

చికెన్ తినకుండానే 150 గ్రాముల ప్రోటీన్!
Health· 8 Aug 2026

చికెన్ తినకుండానే 150 గ్రాముల ప్రోటీన్!

జిమ్, ఫిట్‌నెస్ చేసే వాళ్లకు ప్రోటీన్ చాలా అవసరం, చికెన్ తినకుండా, ప్రోటీన్ పౌడర్లు వాడకుండానే రోజుకి 150 గ్రాముల ప్రోటీన్ నాచురల్‌గా పొందవచ్చని డాక్టర్లు అంటున్నారు. మన డైలీ ఫుడ్‌లోనే 150 గ్రాముల పనీర్, 70 గ్రాముల సోయా చంక్స్, ఒక కప్పు శనగలు, కాస్త రాజ్మా, పెసలు, మసూర్ పప్పు యాడ్ చేసుకోవాలి. దాంతో పాటు 4 గుడ్లు, 4 ఎగ్ వైట్స్, కొద్దిగా ఓట్స్, 350 ml పాలు తీసుకుంటే బాడీకి కావాల్సిన ఫుల్ ప్రోటీన్ నాచురల్‌గానే లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

హ్యామ్ రోడ్ల పనుల్లో వేగం పెంచాలి: కోమటిరెడ్డి
TG· 8 Aug 2026

హ్యామ్ రోడ్ల పనుల్లో వేగం పెంచాలి: కోమటిరెడ్డి

తెలంగాణలో హ్యామ్‌ రోడ్ల నిర్మాణ పనులను 2028 ఆగస్టు నాటికి పూర్తి చేయడమే లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అనుమతుల పేరుతో కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురిచేయొద్దని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి నిర్వహించిన సమీక్షలో పలు అంశాలపై చర్చించారు. రూ.5 కోట్ల పనికి రూ.54 కోట్ల జరిమానా విధించడం సరికాదని మంత్రి పేర్కొన్నారు. అభివృద్ధి పనులు చేపట్టే చిన్న కాంట్రాక్టర్లపై అధికారులు దౌర్జన్యంగా వ్యవహరించకూడదన్నారు.

వెలిగొండ ప్రాజెక్టుకు ముహూర్తం ఫిక్స్
AP· 8 Aug 2026

వెలిగొండ ప్రాజెక్టుకు ముహూర్తం ఫిక్స్

AP: వెలిగొండ ప్రాజెక్టును ఈ నెలాఖరులో ప్రారంభించనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రాజెక్టు పురోగతిపై ఆయన అధికారులతో సమీక్షించారు. కృష్ణా జలాలను విడుదల చేసి నల్లమలసాగర్ జలాశయాన్ని నింపనున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనులను వేగవంతం చేశామన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 99శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను నెలాఖరులోపు పూర్తి చేస్తామన్నారు. టన్నెళ్లలో CC లైనింగ్, TBM మిషన్ తొలగింపు పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

రన్నింగ్ vs సైక్లింగ్
Health· 8 Aug 2026

రన్నింగ్ vs సైక్లింగ్

'రన్నింగ్, సైక్లింగ్ రెండూ హెల్త్‌కి మంచి వ్యాయామాలే, మీ వయస్సు, బరువు, ఫిట్‌నెస్ గోల్స్‌ని బట్టి ఏది బెస్ట్ అనేది డిసైడ్ చేసుకోవాలని' డాక్టర్లు చెప్తున్నారు. సేమ్ టైమ్ వర్కవుట్ చేసినా, సైక్లింగ్ కంటే రన్నింగ్‌లోనే ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. ఎందుకంటే పరుగెత్తేటప్పుడు శరీరంలోని అన్ని మజిల్స్ యాక్టివ్‌గా పనిచేసి, 70 కిలోల బరువున్న వ్యక్తి అర్ధగంట సేపు రన్నింగ్ చేస్తే సుమారు 300 నుంచి 400 కేలరీలు కరుగుతాయి. అదే టైమ్‌లో సైక్లింగ్ చేస్తే కాస్త తక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయని అంటున్నారు.

తెలంగాణ ఇక్కత్‌ చీరకు జాతీయస్థాయి గుర్తింపు
TG· 8 Aug 2026

తెలంగాణ ఇక్కత్‌ చీరకు జాతీయస్థాయి గుర్తింపు

TG: యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన చేనేత కళాకారుడు గంజి వెంకటేశ్‌కు ప్రతిష్టాత్మక జాతీయ చేనేత పురస్కారం వరించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ‘సంత్ కబీర్ హస్తకళా’ పురస్కారాన్ని అందుకున్నారు. తెలంగాణ నుంచి జాతీయ స్థాయిలో ఈ పురస్కారానికి ఎంపికైన ఏకైక కళాకారుడిగా వెంకటేశ్ నిలిచారు. సహజ సిద్ధమైన రంగులను ఉపయోగించి సుమారు 15 నెలలపాటు శ్రమించి రూపొందించిన ఇక్కత్ పట్టుచీర జాతీయ పోటీలో విజేతగా నిలిచింది.

AI టెక్నాలజీతో పన్ను వసూళ్లు: CM రేవంత్‌రెడ్డి
TG· 8 Aug 2026

AI టెక్నాలజీతో పన్ను వసూళ్లు: CM రేవంత్‌రెడ్డి

తెలంగాణలో GST ఆదాయాన్ని పెంచేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI)ను వినియోగించాలని CM రేవంత్‌రెడ్డి సూచించారు. పన్ను వసూళ్లలో టెక్నాలజీ వినియోగం వ్యాపారులను వేధించేందుకు కాదని, రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచడంతోపాటు సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యమని స్పష్టంచేశారు. HYDలోని ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్‌ సుబ్రమణియన్‌, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో GST, ఎక్సైజ్‌ శాఖల్లో సంస్కరణలపై చర్చించారు. జీఎస్టీ అధికారులకు AI ఆధారిత సమాచారంతో పనిని సులభతరం చేసే వ్యవస్థను తీసుకురానున్నట్లు తెలిపారు.

బీసీల రుణం తీర్చుకుంటాం: చంద్రబాబు
AP· 8 Aug 2026

బీసీల రుణం తీర్చుకుంటాం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో బీసీల సంక్షేమం, సంరక్షణకు త్వరలో ప్రత్యేక చట్టం తీసుకురానున్నట్లు CM చంద్రబాబు ప్రకటించారు. బీసీలు 45 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా నిలిచారని, కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని అన్నారు. వారి రుణం తీర్చుకుంటామని తెలిపారు. బాపట్ల జిల్లా చీరాల సమీపంలోని కొత్తపేటలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ‘నేతన్నల సేవలో’ పథకాన్ని CM ప్రారంభించారు. రాష్ట్రంలోని 71,536 అర్హులైన చేనేత కుటుంబాలకు రూ.25 వేల చొప్పున మొత్తం రూ.179 కోట్లను విడుదల చేశారు.

14 ఇయర్స్ బాలుడి దారుణం.. ఫైరింగ్ తర్వాత సూసైడ్!
World· 7 Aug 2026

14 ఇయర్స్ బాలుడి దారుణం.. ఫైరింగ్ తర్వాత సూసైడ్!

షాకింగ్ న్యూస్ థాయిలాండ్‌లోని ఒక స్కూల్‌లో 14 ఏళ్ల స్టూడెంట్ జరిపిన కాల్పుల్లో టీచర్లు, స్టాఫ్‌తో కలిపి ఏడుగురు చనిపోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ అటాక్‌కు ముందే ఆ బాలుడు ఇంట్లో ఉన్న తన తాతయ్య, నానమ్మలను గన్‌తో కాల్చి చంపాడు. ఆ తర్వాత స్కూల్‌కి వచ్చి క్లాస్‌రూమ్‌లో అందరిపైనా విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. చివరకు ఆ బాలుడు కూడా షూట్ చేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. స్కూల్ వల్ల వచ్చిన స్ట్రెస్ వల్లే అతడు ఇలా చేసినట్లు పోలీసులు చెప్తున్నారు.

‘100% ప్యూర్’ లేబులింగ్‌పై FSSAI బ్యాన్‌కు బ్రేక్!
Legal· 7 Aug 2026

‘100% ప్యూర్’ లేబులింగ్‌పై FSSAI బ్యాన్‌కు బ్రేక్!

హనీ, నెయ్యి, ఆయిల్స్ ప్యాకెట్లపై '100% ప్యూర్' అని లేబుల్ వేయకూడదంటూ FSSAI ఇచ్చిన ఆర్డర్‌పై డ్యాబర్‌కు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా, కంపెనీ వివరణ తీసుకోకుండా FSSAI ఈ నిషేధం విధించడాన్ని కోర్టు తప్పుపట్టింది. దశాబ్దాలుగా మార్కెట్లో అమ్ముతున్న ప్రొడక్ట్స్‌పై హఠాత్తుగా ఆర్డర్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు, FSSAI ఆదేశాలపై తాత్కాలికంగా స్టే విధించి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇంత పొడవు జుట్టు ఎప్పుడైనా చూశారా?
World· 7 Aug 2026

ఇంత పొడవు జుట్టు ఎప్పుడైనా చూశారా?

రేణు ధరియాల్ అనే మహిళ ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు ఉన్న మహిళగా 'గిన్నీస్ వరల్డ్ రికార్డ్' సాధించారు. ఆమె జుట్టు పొడవు ఏకంగా 8 feet 10 inches ఉండడం విశేషం. ఇంత పొడవాటి జుట్టును కేర్ తీసుకుంటూ మెయింటెన్ చేసినందుకు ఆమెకు ఈ వరల్డ్ రికార్డ్ లభించింది.

స్కాన్ చేస్తే నేత కార్మికుడి డిటైల్స్!
Technology· 7 Aug 2026

స్కాన్ చేస్తే నేత కార్మికుడి డిటైల్స్!

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో చేనేత ప్రొడక్ట్స్ కోసం కొత్తగా క్యూఆర్ కోడ్ (QR Code) సిస్టమ్‌ను స్టార్ట్ చేశారు. కస్టమర్లు ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి, తాము కొంటున్న బట్టలు ఒరిజినల్ హ్యాండ్‌లూమా కాదా అనేది ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఆ ప్రొడక్ట్‌ను నేసిన చేనేత కళాకారుడి గురించి కూడా తెలుసుకోవచ్చు. చేనేత బట్టల క్వాలిటీని, వాళ్ల కష్టాన్ని అందరికీ తెలియజేయడానికి ఈ కొత్త సిస్టమ్‌ని తీసుకువచ్చారు.

Augustకి ఆ పేరు ఎలా వచ్చింది..?
Education· 7 Aug 2026

Augustకి ఆ పేరు ఎలా వచ్చింది..?

జనవరి, ఫిబ్రవరి సంగతి పక్కన పెడితే “ఆగస్టు” అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? 🤔పురాతన రోమన్ క్యాలెండర్‌లో ఈ నెలను మొదట “సెక్స్టిలిస్” అని పిలిచేవారు. తర్వాత రోమన్ చక్రవర్తి అగస్టస్ సీజర్ గౌరవార్థం క్రీ.పూ. 8లో ఈ నెలకు “అగస్టస్” అని పేరు మార్చారు. కాలక్రమంలో అదే ఆగస్టుగా మారింది. అంటే మనం ప్రతిసారి ఆగస్టు అని చెప్పేటప్పుడు.. దాదాపు 2,000 ఏళ్ల క్రితం జీవించిన రోమన్ చక్రవర్తి పేరునే ఉపయోగిస్తున్నామన్నమాట! ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జూలై పేరు కూడా రోమన్ లీడర్ జూలియస్ సీజర్ పేరు నుంచే వచ్చింది!

నేషనల్ హ్యాండ్‌లూమ్ డే- మంచు లక్ష్మి పోస్ట్!
News· 7 Aug 2026

నేషనల్ హ్యాండ్‌లూమ్ డే- మంచు లక్ష్మి పోస్ట్!

నేషనల్ హ్యాండ్‌లూమ్ డే సందర్భంగా నటి <a href="https://x.com/LakshmiManchu/status/2085686705315619115?s=20">మంచు లక్ష్మి</a> సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. భారతీయులకు చేనేత దుస్తులు కేవలం బట్టలు మాత్రమే కాదని, అవి రోజువారీ జీవితంలో, సంస్కృతిలో ఒక భాగమని ఆమె చెప్పారు. చేనేత వస్త్రాలను కలెక్ట్ చేయడం తనకు చాలా ఇష్టమని, ప్రతీ వస్త్రం వెనుక ఒక గొప్ప కళ, సాంప్రదాయం, నేసిన వాళ్ల కథలు ఉంటాయని అన్నారు. చేనేత కళాకారులను, మన సంస్కృతిని గర్వంగా సెలబ్రేట్ చేసుకుందాం అంటూ అందరికీ నేషనల్ హ్యాండ్‌లూమ్ డే విషెస్ చెప్పారు.