Latest

స్కాన్ చేస్తే నేత కార్మికుడి డిటైల్స్!
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో చేనేత ప్రొడక్ట్స్ కోసం కొత్తగా క్యూఆర్ కోడ్ (QR Code) సిస్టమ్‌ను స్టార్ట్ చేశారు. కస్టమర్లు ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి, తాము కొంటున్న బట్టలు ఒరిజినల్ హ్యాండ్‌లూమా కాదా అనేది ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఆ ప్రొడక్ట్‌ను నేసిన చేనేత కళాకారుడి గురించి కూడా తెలుసుకోవచ్చు. చేనేత బట్టల క్వాలిటీని, వాళ్ల కష్టాన్ని అందరికీ తెలియజేయడానికి ఈ కొత్త సిస్టమ్‌ని తీసుకువచ్చారు.

Augustకి ఆ పేరు ఎలా వచ్చింది..?
జనవరి, ఫిబ్రవరి సంగతి పక్కన పెడితే “ఆగస్టు” అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? 🤔పురాతన రోమన్ క్యాలెండర్‌లో ఈ నెలను మొదట “సెక్స్టిలిస్” అని పిలిచేవారు. తర్వాత రోమన్ చక్రవర్తి అగస్టస్ సీజర్ గౌరవార్థం క్రీ.పూ. 8లో ఈ నెలకు “అగస్టస్” అని పేరు మార్చారు. కాలక్రమంలో అదే ఆగస్టుగా మారింది. అంటే మనం ప్రతిసారి ఆగస్టు అని చెప్పేటప్పుడు.. దాదాపు 2,000 ఏళ్ల క్రితం జీవించిన రోమన్ చక్రవర్తి పేరునే ఉపయోగిస్తున్నామన్నమాట! ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జూలై పేరు కూడా రోమన్ లీడర్ జూలియస్ సీజర్ పేరు నుంచే వచ్చింది!

నేషనల్ హ్యాండ్‌లూమ్ డే- మంచు లక్ష్మి పోస్ట్!
నేషనల్ హ్యాండ్‌లూమ్ డే సందర్భంగా నటి <a href="https://x.com/LakshmiManchu/status/2085686705315619115?s=20">మంచు లక్ష్మి</a> సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. భారతీయులకు చేనేత దుస్తులు కేవలం బట్టలు మాత్రమే కాదని, అవి రోజువారీ జీవితంలో, సంస్కృతిలో ఒక భాగమని ఆమె చెప్పారు. చేనేత వస్త్రాలను కలెక్ట్ చేయడం తనకు చాలా ఇష్టమని, ప్రతీ వస్త్రం వెనుక ఒక గొప్ప కళ, సాంప్రదాయం, నేసిన వాళ్ల కథలు ఉంటాయని అన్నారు. చేనేత కళాకారులను, మన సంస్కృతిని గర్వంగా సెలబ్రేట్ చేసుకుందాం అంటూ అందరికీ నేషనల్ హ్యాండ్‌లూమ్ డే విషెస్ చెప్పారు.
ఎక్స్‌ప్రెస్‌వేపై ఆక్సిడెంట్.. గాల్లో ఎగిరిన టెంపో వెహికల్!
ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ఆక్సిడెంట్ జరిగింది. మిస్సింగ్ లింక్ దగ్గర స్పీడ్‌గా వచ్చిన కారు టెంపోను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఆక్సిడెంట్‌లో ఒకరు చనిపోగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఢీకొన్న వేగానికి టెంపో గాల్లోకి ఎగిరి బోల్తా పడగా, కారు నుజ్జునుజ్జయింది. ఆక్సిడెంట్ విజువల్స్ సీసీటీవీలో రికార్డయ్యాయి. రెస్క్యూ టీమ్ గాయపడిన వారిని దగ్గర్లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రమాదం కారణంగా ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగలేదని పోలీసులు తెలిపారు.

టైర్లలో కోట్ల విలువైన బంగారం!
ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో గోల్డ్ స్మగ్లింగ్‌ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. జెద్దా నుంచి వచ్చిన ఒక ప్యాసింజర్ ఎలక్ట్రిక్ స్కూటర్ టైర్ల లోపల సీక్రెట్‌గా దాచిన 869.5 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతని మూవ్‌మెంట్స్‌పై డౌట్ వచ్చి చెక్ చేయగా ఈ షాకింగ్ స్మగ్లింగ్ ప్లాన్ బయటపడింది. ఆ గోల్డ్‌ను సీజ్ చేసిన అధికారులు, ఆ ప్యాసింజర్‌ను కస్టడీలోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు.

సికింద్రాబాద్‌లో మ్యూజికల్ ఈవెంట్.. ఫ్రీ ఎంట్రీ!
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌లో ‘మిలే సుర్ మేరా తుమ్హారా’ పేరుతో ఒక మ్యూజికల్ నైట్ జరగనుంది. మన దేశ ఐక్యతను, స్వేచ్ఛను చాటిచెప్పేలా ఆగస్టు 15 శనివారం సాయంత్రం 6 గంటలకు చౌరహా ఆడిటోరియంలో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సుపర్ణ, శ్రీకర్, సంగీత సిస్టర్స్, శరణ్య బృందాలతో పాటు పలువురు ఆర్టిస్ట్‌లు ఈ ఈవెంట్‌లో పాటలు పాడనున్నారు. ఈ ప్రోగ్రామ్‌కి ఎంట్రీ ఉచితం. ఆసక్తి ఉన్నవారు ప్రొఫైల్ బయొలోని లింక్ ద్వారా ముందే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. <a href="https://events.communitie.in/events/mile-sur-mera-tumhara">link here </a>

“మీరు Batmanనా?”.. రాహుల్ గాంధీ ఫన్నీ రిప్లై వైరల్!
రాహుల్ గాంధీని “మీరు Batmanనా?” అని అడిగితే.. ఆయన ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు వైరల్! Gen Zతో నిర్వహించిన ఇన్‌స్టాగ్రామ్ AMA (Ask Me Anything) సెషన్‌లో ఓ యూజర్ ఈ ఫన్నీ ప్రశ్న అడిగారు. దానికి రాహుల్ “మమ్మల్ని ఇద్దరినీ కలిసి ఎవరూ చూడలేదు.” అంటూ రిప్లై ఇచ్చారు. అంటే “నన్ను, Batmanని ఒకేసారి ఎవరూ చూడలేదు కదా” అనే పాపులర్ జోక్‌ను తనపై వేసుకున్నారు. బ్యాట్‌మ్యాన్ తన అసలు గుర్తింపును రహస్యంగా ఉంచే క్యారెక్టర్. అందుకే “అయితే నేనే బ్యాట్‌మ్యాన్ అయ్యుండొచ్చేమో” అనే అర్థం వచ్చేలా ఆయన ఈ సరదా జోక్ చేశారు.

లీడర్‌గా మారిన స్టూడెంట్!
ప్రశ్నపత్రాల లీకేజీలు, విద్యా వ్యవస్థలో అవినీతిపై ఐసా జాతీయ అధ్యక్షురాలు <a href="https://www.theclearcutnews.com/n/o4t6Bsq">నేహా బోరా</a> చేసిన పోరాటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసుల లాఠీ దెబ్బలు, అరెస్టులు ఎదురైనా "మా శరీరాలపై ఉన్న గాయాలే చరిత్రకు సాక్ష్యాలు" అంటూ ఆమె ధైర్యంగా నిలబడ్డారు. టీవీ డిబేట్లలో మీడియా దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ, జైలులో ఉన్న చివరి విద్యార్థి విడుదలయ్యే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. నవతరానికి స్ఫూర్తిగా నిలుస్తూ పాలకుల సింహాసనాలను కదిలించి, నవతరంలో ఒక పవర్‌ఫుల్ లీడర్‌గా నిలిచారు.

వేల మంది ముందరే ఇంక్ దాడి!
ఝార్ఖండ్ రాజధాని రాంచీలో విద్యార్థుల నిరసన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోటీ పరీక్షల అక్రమాలపై అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న AISA జాతీయ అధ్యక్షురాలు నేహా బోరాపై ఒక వ్యక్తి నల్ల సిరా (Black Ink) చల్లాడు. సుమారు వేయి మందికి పైగా విద్యార్థులతో కలిసి ర్యాలీగా వెళ్తుండగా ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇలాంటి దాడులకు భయపడేది లేదని నేహా స్పష్టం చేయగా, ఇంక్ చల్లిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రోడ్డు పైనే వ్యవసాయం!
మంత్రి సీతక్క నియోజకవర్గంలోని ములుగు జిల్లా, మంగపేట మండలం కొత్తమల్లూరులో రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడంతా బురదగా మారి నడవడమే కష్టంగా మారింది. రోడ్ల అధ్వాన పరిస్థితిపై విసిగిపోయిన ఊరి జనాలు డిఫరెంట్‌గా నిరసన తెలిపారు. ఆ బురద రోడ్డుపైనే వరి నాట్లు వేస్తూ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు ప్రాబ్లమ్‌ని వెంటనే సాల్వ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇండియా చైనాతో మళ్లీ దగ్గరవుతోందా..? 👀
భారత్–చైనా మధ్య సంబంధాలు మెరుగవుతున్నాయి.. కానీ బోర్డర్ విషయంలో ఇంకా జాగ్రత్త తప్పదా? న్యూఢిల్లీలో రెండు దేశాల అధికారులు 36వ రౌండ్ సరిహద్దు చర్చలు నిర్వహించారు. సరిహద్దులో శాంతి, స్థిరత్వం కొనసాగితేనే రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత ముందుకు వెళ్తాయని భారత్ స్పష్టం చేసింది. ఈ సమావేశంలో బౌండరీ సమస్యలు, బోర్డర్ మేనేజ్‌మెంట్, రెండు దేశాల మధ్య కోఆర్డినేషన్ వంటి అంశాలపై చర్చించారు. భారత్–చైనా సంబంధాలు మళ్లీ మెరుగవుతున్న సమయంలో బోర్డర్‌లో పరిస్థితిని ప్రశాంతంగా ఉంచడమే ఇప్పుడు కీలకంగా మారింది.

వీధిలో Gen Z వాయిస్ కానీ చట్టసభల్లో?
దేశ జనాభాలో Gen Z వాటా 26% ఉన్నా, చట్టసభల్లో కేవలం 26 మందే (6 MPs, 20 MLAs) ఉన్నారు. కనీస పోటీ వయసు 25 ఏళ్లు కావడం ఓ కారణమైతే, గెలిచిన వారిలో మెజారిటీ పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారే. అయితే సింగర్ మైథిలీ ఠాకూర్ సహా 12 మంది ఎలాంటి పొలిటికల్ హిస్టరీ లేకుండా అసెంబ్లీలో అడుగుపెట్టారు. కాంగ్రెస్ నుండి 7, BJP నుండి 5 మంది Gen Z లీడర్స్ ఉన్నారు. 2029 ఎలక్షన్స్ నాటికి బిగ్గెస్ట్ ఓటింగ్ పవర్ కాబోతున్న ఈ యంగ్ జనరేషన్‌కి ప్రాతినిధ్యం పెరగాలి.

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ విడుదల
వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రిలీజైంది. ఇందులో సూర్య క్లాసీ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నారు. వెంకీ స్టైల్ మేకింగ్ సూపర్‌గా ఉందని వ్యూవర్స్ అంటున్నారు. అల్లరి పిల్లగా మమితా బైజు డైలాగ్స్ అలరిస్తున్నాయి. రాధిక ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈనెల 14న సినిమా విడుదలవుతుంది.

ఇన్వెస్టర్లకు షాక్!
క్రూడ్ ఆయిల్ రేట్లు పెరగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయాయి. సెన్సెక్స్ 455 పాయింట్లు నష్టపోయి 78,499 వద్ద, నిఫ్టీ 65 పాయింట్లు తగ్గి 24,570 వద్ద క్లోజ్ అయ్యాయి. డాలర్‌తో రూపాయి విలువ 95.20గా ఉంది. బజాజ్ ఫైనాన్స్, ICICI బ్యాంక్ షేర్లు నష్టపోగా.. TCS, SBI షేర్లు లాభపడ్డాయి. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర 83 డాలర్లు, బంగారం ఔన్స్ ధర 4300 డాలర్ల పైన ట్రేడవుతోంది.

GHMC ఎన్నికల్లో పొత్తు ఉండదు: రాంచందర్‌రావు
TG: GHMC ఎన్నికల్లో తమ పార్టీకి ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు అన్నారు. ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడుతూ పార్టీ నేతల మధ్య గొడవలున్నాయనే వార్తలు వస్తున్నాయని, అవన్నీ ఉట్టి అపోహలే అని చెప్పారు. ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి చేరేందుకు కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు. అందరి కృషితో GHMC ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామన్నారు.

హత్య చేసి..శవంతో సెల్ఫీలు దిగారు
మందు తాగొద్దని, పనికి వెళ్లమని హెచ్చరించినందుకు కోయంబత్తూరు జిల్లా సిక్కలంపాళయంలో ఎస్.అశ్విన్(22) అనే కూలీని ఇద్దరు యువకులు హత్య చేశారు. 21 ఏళ్ల మథేష్, మరొక 16 ఏళ్ల యువకుడు కత్తి, కొడవలి, సుత్తితో దాడి చేసి చంపారు. హత్యను వీడియో తీసి, శవంతో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నాయి.

ప్రైవేట్ స్కూళ్లకు సర్కార్ వార్నింగ్!
తెలంగాణ ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీకి చెక్ పెడుతూ విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ నిర్ణయం తీసుకున్నారు. 2026–27 అకడమిక్ ఇయర్ ఫీజు వివరాలను స్కూల్ నోటీస్ బోర్డు, వెబ్‌సైట్, schooledu.telangana.gov.in పోర్టల్‌లో డిస్‌ప్లే చేయాలని ఆదేశించారు. G.O.Ms.No.1 రూల్ 16, 18 ప్రకారం గవర్నింగ్ బాడీ సైన్ చేసిన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయడం తప్పనిసరి. రూల్ 11 ప్రకారం నిబంధనలు వైయోలేట్ చేసే స్కూళ్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చి కఠిన చర్యలు తీసుకుంటారు. దీని అమలును DEO, RJDలు పర్యవేక్షిస్తారు.

భారత్‌లో తొలి మహిళా ‘టాప్ గన్’
భారత వైమానిక దళంలో స్క్వాడ్రన్ లీడర్ భావన కంత్ చరిత్ర సృష్టించారు. కఠినమైన ఫైటర్ కాంబాట్ లీడర్(FCL) కోర్సు క్లియర్ చేసి, ‘టాప్ గన్’ టైటిల్ సాధించిన తొలి భారతీయ మహిళా పైలట్‌గా నిలిచారు. IAF పైలట్లలో కేవలం 1% మంది మాత్రమే దీనికి ఎంపికవుతారు. 2016లో అవని చతుర్వేది, మోహనా సింగ్‌లతో కలిసి భావన మొదటి మహిళా ఫైటర్ పైలట్లుగా మారారు. గ్వాలియర్‌లోని టాక్టిక్స్ అండ్ ఎయిర్ కాంబాట్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో ఎలైట్ కోర్సు పూర్తి చేశారు.
ఫ్లైట్‌లో లాస్ట్ మినిట్‌లో ఎంత పని చేశాడో చూడండి!
కౌలాలంపూర్ నుంచి కొచ్చి వస్తున్న బాటిక్ ఎయిర్ ఫ్లైట్‌లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఫ్లైట్ ల్యాండ్ అయ్యే కొన్ని మినిట్స్ ముందు కేరళకు చెందిన జంషీర్(34) సడెన్‌గా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. అడ్డుకున్న కేబిన్ క్రూని, ప్యాసింజర్స్‌ని బెదిరించాడు. వెంటనే అందరూ కలిసి అతన్ని పట్టుకోవడంతో పెద్ద యాక్సిడెంట్ మిస్ అయింది. ఫ్లైట్ సేఫ్‌గా ల్యాండ్ అయ్యాక CISF టీమ్ అతన్ని అరెస్ట్ చేసి పోలీసులకి అప్పగించారు. అసలు ఎందుకిలా చేశాడో ఇంకా క్లారిటీ లేదని పోలీసులు చెప్పారు.

స్కూటర్ టైర్లలో గోల్డ్.. ఎయిర్ పోర్టులో పట్టివేత!
దిల్లీ IGI ఎయిర్ పోర్టులో కస్టమ్స్ ఆఫీసర్స్ భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి ముంబయి మీదుగా దిల్లీకి వచ్చిన ఓ ప్యాసెంజర్‌ను డౌట్‌తో చెక్ చేశారు. అతడి చెక్‌డ్ బ్యాగేజ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిశీలించగా టైర్లలోని సాలిడ్ కోర్‌లో దాచిన 24 క్యారెట్ల బంగారం బయటపడింది. మొత్తం 19 ముక్కలుగా ఉన్న 869.5 గ్రా. గోల్డ్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇల్లీగల్‌గా బంగారం తీసుకొచ్చినట్లు కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విడాకుల కేసు వెనక్కి తీసుకున్న సీఎం విజయ్ భార్య
తమిళ హీరో, సీఎం జోసెఫ్ విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో వేసిన విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. 26 ఏళ్ల తమ వివాహ బంధాన్ని రద్దు చేయాలని కోరుతూ ఫిబ్రవరిలో ఆమె ఈ పిటిషన్ వేశారు. ఈ విషయం అటు రాజకీయవర్గాల్లో, ఇటు సినీరంగంలో భారీ చర్చకు దారితీసింది. వ్యక్తిగత కారణాలతో ఆమె విడాకులు కోరినా, త్రిష-విజయ్‌ల సంబంధమే దీనికి కారణమనే చర్చ నడిచింది. అనంతరం విజయ్ సీఎం అయ్యారు. ప్రస్తుతం ఆమె కేసు వెనక్కి తీసుకోవడంతో ఈ వివాదం ముగిసినట్టు తెలుస్తోంది.