Latest

దోచుకున్న డబ్బుని తిరిగిచ్చేసిన దొంగలు.. లెటర్ వైరల్!
AP: కాకినాడ జిల్లా కరపలో వింత ఘటన జరిగింది. జులై 18న ఓ ఇంట్లో చోరీ చేసిన దొంగలు, 2 వీక్స్ తర్వాత గోల్డ్, డబ్బును అదే ఇంట్లో తిరిగి వదిలేసి వెళ్లారు. దొంగతనం చేయడం తప్పేనని ఒప్పుకుంటూ అపాలజీ లెటర్ కూడా రాసి వెళ్లారు. చోరీ చేసిన డబ్బులో రూ.22 వేలును యూజ్ చేశామని, ఆ డబ్బు మాత్రం తిరిగి ఇవ్వలేమని Sorry చెప్తూ.. లెటర్‌లో రాశారు. ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఫంక్షన్ నుండి వస్తే శవమై కనిపించింది!
అస్సాంలోని హైలాఖాండీ జిల్లాలో 15 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. ఫంక్షన్‌కు వెళ్లి కజిన్‌తో గొడవపడి ఒంటరిగా ఇంటికి తిరిగొచ్చిన బాలిక, కుటుంబ సభ్యులు వచ్చేసరికి తల, ముఖం గుర్తుపట్టలేనంతగా విదంగా శవమై కనిపించింది. ప్రైవేట్ భాగాల్లోకి రాడ్ తో నెట్టి, లైంగిక దాడికి ఒడిగట్టినట్లు కుటుంబీకులు ఆరోపించారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానికులు నేషనల్ హైవేపై ధర్నా చేపట్టగా, ప్రస్తుతం ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Yen కోసం US–Japan కలిసి రంగంలోకి!
కరెన్సీ పడిపోతుంటే చూస్తూ కూర్చుంటారా..? అమెరికా–జపాన్ కలిసి రంగంలోకి దిగేశాయి! జపాన్ యెన్ విలువను స్టేబుల్ చేయడానికి రెండు దేశాలు కలిసి అరుదైన స్టెప్ తీసుకున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీంతో యెన్ విలువ ఒక్కసారిగా మూడు నెలల హైకి చేరింది. అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న సంకేతాలు కూడా వచ్చాయి. వార్స్, ఆయిల్ ధరలు, మార్కెట్స్‌తో ఇప్పటికే టెన్షన్ ఉండగా.. ఇప్పుడు కరెన్సీ కూడా గ్లోబల్ పవర్ గేమ్‌లో కొత్త హాట్ టాపిక్‌గా మారింది.

బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి!
ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఇంట త్వరలోనే పెళ్లి సందడి స్టార్ట్ కాబోతుంది. తన కూతురి మ్యారేజ్ కోసం ఆయన ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా సీనియర్ యాక్టర్ శ్రీకాంత్ ఫ్యామిలీని బండ్ల గణేష్ పర్సనల్‌గా కలిసి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి ఇన్వైట్ చేశారు. శ్రీకాంత్ ఇంటికి వెళ్లిన ప్రొడ్యూసర్, వాళ్ల ఫ్యామిలీతో కాసేపు సరదాగా టైమ్ స్పెండ్ చేశారు.

S.జానకి కోసం డల్లాస్‌లో స్పెషల్ ప్రోగ్రామ్!
అమెరికాలోని డల్లాస్‌లో లెజెండరీ సింగర్ S. జానకి కోసం ఒక స్పెషల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ చేశారు. DGIT, కళావాహిని కలిసి ఆర్గానైజ్ చేసిన ఈ ఈవెంట్‌లో అక్కడ ఉండే తెలుగు సింగర్స్ జానకమ్మ పాడిన ఫేమస్ సాంగ్స్ పాడి అందరినీ ఇంప్రెస్ చేశారు. 15 లాంగ్వేజెస్ లో 50 వేలకి పైగా పాటలు పాడి రికార్డ్ క్రియేట్ చేసిన ఆమె గ్రేట్‌నెస్ గురించి గుర్తుచేసుకున్నారు. ఫ్యూచర్ జనరేషన్‌కి తెలుగు మ్యూజిక్, కల్చర్‌ని పరిచయం చేయడానికే ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేశామని ఆర్గానైజర్స్ చెప్పారు.
Job పోయింది.. అయినా Happy అంటున్నారేంటి?
జాబ్ పోతే టెన్షన్ పడాలి కదా... ఇక్కడ మాత్రం “హ్యాపీ!” అంటున్నారేంటి? మిలీనియల్స్ జాబ్స్ వదిలేయడం లేదా లేఆఫ్ అయిన తర్వాత కూడా హ్యాపీగా ఉన్నారంటూ ఓ వీడియో వైరల్ అయి సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ మొదలైంది. కార్పొరేట్ బర్నౌట్, వర్క్ ప్రెజర్, తక్కువ పే, వర్క్–లైఫ్ బ్యాలెన్స్ అంటూ చాలామంది తమ ఎక్స్‌పీరియన్స్‌లను షేర్ చేస్తున్నారు. మంచి శాలరీ ఒక్కటే లైఫ్ కాదని.. మెంటల్ పీస్ కూడా జాబ్ ప్యాకేజ్‌లో ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

పులి దాడిలో మహిళ మృతి
మధ్యప్రదేశ్ రాష్ట్రం బాలాఘాట్ జిల్లాలో పులి దాడిలో ఓ మహిళ మృతిచెందింది. నిన్న తెల్లవారుజామున కన్హా నేషనల్ పార్క్ సర్కిల్‌లోని పర్రాపూర్ బైగటోలా గ్రామంలో ఈ ఘటన జరిగింది. సుగ్నీ బాయి ధుర్వే (30)పై పులి దాడి చేయడంతో ఆమె తలకు పెద్ద గాయాలయ్యాయి. వెంటనే హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఘటనపై పోలీసులు కేస్ ఫైల్ చేసుకొని, ఫారెస్ట్ ఆఫీసర్స్‌తో కలిసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు.

‘న్యూటన్స్ థర్డ్ లా’ బాక్సాఫీస్ కలెక్షన్లు
సుమంత్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘న్యూటన్స్ థర్డ్ లా’. మైండ్-బ్లోయింగ్ క్లైమాక్స్, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లే, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటూ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. రాజేష్ కర్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.5.03 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

పెండింగ్‌లో 3.9 లక్షల డ్రగ్స్ కేసులు
నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టెన్సెస్(NDPS) చట్టం కింద దేశంలో 3.96 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ కేసుల కోసం 65 ప్రత్యేక కోర్టులు మాత్రమే పని చేస్తున్నాయని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) తెలిపింది. కేసుల్ని తగ్గించేందుకు అన్ని రాష్ట్రాలు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. 22 రాష్ట్రాలు ఇంకా ప్రత్యేక NDPS కోర్టులు ఏర్పాటు చేయలేదని, వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పింది.

మరో 2 గంటల్లో పిడుగులతో భారీ వర్షం
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం పరిధిలోని కోటబొమ్మాళి, నరసన్నపేట ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయి. అనకాపల్లి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం ప్రారంభమైంది. పిడుగుల ముప్పు ఉన్నందున ప్రజలను అప్రమత్తంగా ఉండామని, చెట్ల కింద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని APSDMA హెచ్చరించింది.
గోల్గప్పా(పానీ పూరీ) కాస్తా ‘టోల్గప్పా’ అయిపోయింది!
ఇండియాకి వచ్చింది... గోల్గప్పా తిన్నది... పేరు మాత్రం కొత్తగా పెట్టేసింది! 😂 ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ గోల్గప్పాను(పానీ పూరీ) మొదటిసారి ట్రై చేసిన ఓ జర్మన్ మహిళ దాన్ని పొరపాటున “టోల్గప్పా” అని పిలిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె గోల్గప్పా తిన్న తర్వాత ఇచ్చిన రియాక్షన్, పేరు పలికిన స్టైల్ నెటిజన్లకు తెగ నచ్చేసింది. అంతే.. కామెంట్ సెక్షన్ మొత్తం జోక్స్, ఫన్నీ రియాక్షన్స్‌తో నిండిపోయింది. ఒక్క చిన్న మిస్టేక్‌తో గోల్గప్పాకు ఇంటర్నేషనల్ రీబ్రాండింగ్ చేసేసింది!

అల్యూమినియం ఫాయిల్ వాడుతున్నారా?
ప్రతి వంటింట్లోనూ అల్యూమినియం ఫాయిల్ వాడకం విపరీతంగా పెరిగింది. టిఫిన్లు ప్యాక్ చేయడానికే కాకుండా గ్రిల్లింగ్, వంటకాల తయారీకి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అల్యూమినియం ఫాయిల్‌లో ఆహారాన్ని ఎక్కువసేపు ఉంచినా లేదా అందులోనే వండినా, ఆ లోహం ఆహారంలోకి చేరే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ముఖ్యంగా పుల్లని, మసాలా కలిపిన పదార్థాల విషయంలో ఈ ప్రమాదం మరీ ఎక్కువ. అల్యూమినియం పాత్రలతో పోలిస్తే, ఫాయిల్‌లో ఆహారాన్ని చుట్టి ఉంచడమే ఆరోగ్యానికి అత్యంత హానికరమని నిపుణులు చెబుతున్నారు.

బాంబ్ ఫార్ములా రాస్తూ దొరికిన మెడికల్ స్టూడెంట్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలో రాజ్‌శ్రీ దశరథ్ మెడికల్ కాలేజీలో ఫస్టియర్ పారామెడికల్ స్టూడెంట్ బాంబ్ ఫార్ములాను రాస్తున్నట్లు ఆరోపణలొచ్చాయి. నైట్ డ్యూటీ టైమ్‌లో దీన్ని గుర్తించిన కాలేజ్ మేనేజ్‌మెంట్ పోలీసులకు సమాచారమిచ్చింది. దీంతో ఆ స్టూడెంట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్ చేస్తున్నారు. ఘటనపై మరింత ఇన్ఫర్మేషన్ కోసం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

పుష్ప స్టైల్‌లో గంజాయి స్మగ్లింగ్
AP: నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నపుబట్టి వద్ద గంజాయి స్మగ్లర్ల గుట్టు ప్రమాదంతో బయటపడింది. విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్తున్న బొలెరో మాక్స్ వాహనం రోడ్డు అంచు దాటి గుంతలో బోల్తా పడగా, అందులోని వ్యక్తులు పరారయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని పరిశీలించగా, ప్రత్యేకంగా తయారు చేసిన రహస్య అరల్లో గంజాయి పెట్టెలు కనిపించాయి. తహసీల్దార్ సమక్షంలో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 213 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పరారైన స్మగ్లర్ల కోసం గాలిస్తున్నారు.
RTI కి పవర్‌ఫుల్ కౌంటర్- అభిజీత్ దిప్కే
తన విద్యార్హతలపై ఓ BJP కార్యకర్త RTI ఫైల్ చేయడంపై CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే స్పందించారు. బోస్టన్ యూనివర్సిటీలో తాను చదివిన చదువుకు సంబంధించిన స్కాలర్‌షిప్, ఎడ్యుకేషన్ లోన్ లెటర్స్ చూపించేందుకు సిద్ధంగా ఉన్నానని వీడియోలో తెలిపారు. "నా డాక్యుమెంట్స్ చూపించడానికి నేను రెడీ, మరి మీ BJP లీడర్స్ తన ఒరిజినల్ డిగ్రీ చూపిస్తారా?" అని ప్రశ్నించారు. ఒక సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తి విదేశాల్లో చదువుకుంటే ఎందుకు ఓర్వలేకపోతున్నారంటూ ఆయన ఘాటుగా స్పందించారు

చిట్టీలు వేసి.. కోట్లతో ఉడాయించిన దంపతులు
TG: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో చిట్టీల పేరుతో సుమారు రూ.2 కోట్లు వసూలు చేసి దంపతులు పరారైన ఘటన కలకలం రేపింది. BSR కాలనీలో నివసిస్తున్న శిరీష, సాంబశివరావు, స్థానికుల నుంచి చిట్టీల పేరుతో భారీగా డబ్బు సేకరించారు. గడువు ముగిసినా డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు వారిని సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. దీంతో మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారైన దంపతుల కోసం గాలింపు చర్యలు చేపట్టి, ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ రోజు బంగారం ధరలు ఎంత పెరిగాయంటే?
సోమవారం బంగారం ధరలు కాస్త పెరిగాయి. 24, 22, మరియు 18 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌పై ₹10 చొప్పున రేట్లు పెరిగాయి. ఈ రోజు 1PMకి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹1,44,220, 22 క్యారెట్ల ధర ₹1,32,200, అలాగే 18 క్యారెట్ల గోల్డ్ రేటు ₹1,08,160 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ ట్రెండ్స్ బట్టి ఈ ప్రైసెస్ చేంజ్ అయ్యే చాన్స్ ఉంటుంది కాబట్టి కొనేముందు లేటెస్ట్ ప్రైస్ చెక్ చేసుకోవడం మంచిది.

ఇచ్చాపురాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి
AP: వర్షాభావంతో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఖరీఫ్ సాగు తీవ్ర సంక్షోభంలో పడిందని YSR CP సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఇచ్చాపురం మండలం టీ. బరంపురం గ్రామంలో ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. వర్షాలు లేక మొలకెత్తిన వరి ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. సాగునీటి కొరతతో దమ్ములు చేసి నాట్లు వేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇచ్చాపురాన్ని కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించి, అత్యవసర సాగునీటి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వ్యూ్స్ కోసం నన్ను మీమ్ చేశారు: శ్రద్ధా సింగ్
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన ప్రొటెస్ట్‌లో RAF సిబ్బందితో కనిపించిన 23 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ శ్రద్ధా సింగ్ వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత ఆమెపై భారీగా ట్రోలింగ్, మీమ్స్ వచ్చాయి. అయితే తాను ఎవరినీ తిట్టలేదని, ఎగతాళి చేయలేదని ఆమె చెబుతోంది. వ్యూ్స్ కోసం తన వీడియోను తప్పుగా చూపిస్తూ మీమ్స్ చేశారని అంటోంది. ఒక్క వీడియోతో వైరల్ అయ్యింది... కానీ వచ్చిన ఫేమ్ కంటే ట్రోల్సే ఎక్కువయ్యాయి!
కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గంలో ఒక నిరుద్యోగి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంపై మాట్లాడుతూ, జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న మేనిఫెస్టో హామీని నమ్మి నిరుద్యోగులు కాంగ్రెస్‌ను గెలిపించారు. కేసీఆర్ హయాంలో ఒకేసారి 48 వేల ఉద్యోగాలు ఇస్తే, ఇప్పుడు కేవలం 7 వేల ఉద్యోగాలే ఇస్తున్నారంటూ ప్రశ్నించిన వారిని సీఎం 'ఎండ్రిన్ తాగి చావండి' అని అనడం దారుణమన్నారు.

నోటిఫికేషన్ మార్చాలంటూ నిరుద్యోగులు మెరుపు ధర్నా
TG: హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ చౌరస్తాలో నిరుద్యోగులు మెరుపు ధర్నా చేశారు. 7,437 పోస్టులు కాకుండా 19 వేల పోలీస్ జాబ్స్‌కు కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ లేట్ అవ్వడంతో వేలాది మంది ఓవర్‌ఏజ్ అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ పోస్టులకు మ్యాక్సిమమ్ ఏజ్ 36 ఏళ్లకు, ఎస్సై పోస్టులకు 38 ఏళ్లకు పెంచాలని కోరారు. అప్లికేషన్ ఫీజ్ తగ్గించాలని, డిమాండ్లు నెరవేరేదాకా ప్రొటెస్ట్ ఆగదని వార్నింగ్ ఇచ్చారు.