Latest

బాలికపై మేనమామ, సోదరుల లైంగిక దాడి
Crime· 25 Jul 2026

బాలికపై మేనమామ, సోదరుల లైంగిక దాడి

TG: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో ఉన్న మేనమామ, వరసకు సోదరులయ్యే ఇద్దరు వ్యక్తులు మహారాష్ట్రకు చెందిన బాలిక(13)పై అత్యాచారం చేశారు. బాలిక తల్లిదండ్రులు మరణించడంతో అమ్మమ్మ వద్ద ఉంటూ హాస్టల్‌లో చదువుకుంటుంది. సెలవుల్లో ఇంటికి వచ్చిన ఆమె ఒంటరిగా ఉండటం చూసి లైంగిక దాడి చేశారు. పోలీసులు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

నీట్ ఆందోళనల్లో దేశ వ్యతిరేక శక్తులు: బండి సంజయ్
Politics· 25 Jul 2026

నీట్ ఆందోళనల్లో దేశ వ్యతిరేక శక్తులు: బండి సంజయ్

TG: దిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనల ముసుగులో దేశ వ్యతిరేక శక్తులున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. పరిస్థితులను నీట్ సమస్యకు సంబంధం లేని ఆర్టికల్ 370, కాశ్మీర్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు సంబంధించిన నినాదాలు వినిపించడం ఆందోళనకరమన్నారు. శాంతియుత నిరసనలను హింసాత్మకంగా మార్చే కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. అమాయక విద్యార్థులను అడ్డుపెట్టుకుని విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాల పట్ల ప్రజలు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

ఫస్ట్ Gen Z రూలర్ ఈమె
World· 25 Jul 2026

ఫస్ట్ Gen Z రూలర్ ఈమె

150 ఏళ్ల తర్వాత స్పెయిన్‌ మళ్లీ క్వీన్ పాలనలోకి వెళ్లబోతోంది. 2005 అక్టోబర్లో పుట్టిన 2౦ ఏళ్ల GenZ అమ్మాయి స్పెయిన్ దేశానికి త్వరలో కాబోయే క్వీన్. ఆమె పేరు ప్రిన్సెస్ లియోనోర్. ఫిలిప్ VI కూతురు. క్వీన్ ఇసాబెల్లా II తర్వాత ఆ దేశానికి క్వీన్ (ఉమెన్ రూలర్) అవుతున్నారు. లియోనోర్ రాయల్ రూల్స్ ప్రకారం మూడేళ్ల మిలిటరీ ట్రైనింగ్‌ను సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేశారు. సోలోగా మిలిటరీ విమానాన్ని నడిపారు. ఆరుకి పైగా భాషల్ని అనర్గళంగా మాట్లాడగలరు. త్వరలో సైన్యానికి తొలి ఉమెన్ సుప్రీం బాధ్యతలు తీసుకుంటారు.

గన్‌తో బెదిరించి.. ATMను ఎత్తుకెళ్లిన ముఠా
Crime· 25 Jul 2026

గన్‌తో బెదిరించి.. ATMను ఎత్తుకెళ్లిన ముఠా

AP: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో అర్ధరాత్రి దొంగలు SBI ATMను ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని ఏటీఎంను బొలెరో వాహనంలో తీసుకెళ్లిన దుండగులు, అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులను తుపాకీతో బెదిరించి పరారయ్యారు. దాంట్లో రూ.10 నుంచి రూ.13 లక్షల వరకు నగదు ఉన్నట్లు సమాచారం. అనంతరం మిషన్‌ను మరో కంటైనర్‌లోకి మార్చినట్లు పోలీసులు గుర్తించారు. స్థానికులు సెల్‌ఫోన్లలో చిత్రీకరించిన వీడియోలు, CC ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.

పేపర్ లీక్ కేసులో సంచలనం.. గుప్తా అరెస్ట్
Crime· 25 Jul 2026

పేపర్ లీక్ కేసులో సంచలనం.. గుప్తా అరెస్ట్

మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బిరేంద్ర కుమార్ గుప్తాను బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను పుణె విమానాశ్రయానికి తీసుకువచ్చి భివాండి పోలీసులకు అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. టెట్ పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలపై ఈ కేసు నమోదు కాగా, గుప్తా పాత్రపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టనున్నారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

టైఫాయిడ్ బారిన పడిన CJP చీఫ్
India· 25 Jul 2026

టైఫాయిడ్ బారిన పడిన CJP చీఫ్

నీట్ పేపర్ లీక్, విద్యా వ్యవస్థలో అక్రమాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్ నిర్ధారణ అయింది. తీవ్రమైన జ్వరం, ఒళ్లునొప్పులతో బాధపడుతున్న ఆయనకు వైద్య పరీక్షల్లో టైఫాయిడ్ ఉన్నట్లు తేలింది. అనారోగ్యం కారణంగా కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నప్పటికీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఆరోగ్య పరిస్థితి మధ్య కూడా ఉద్యమాన్ని కొనసాగించనున్నట్లు ప్రకటించారు.

పేదరికాన్ని జయించి స్పేస్ మిషన్‌లో చోటు
AP· 25 Jul 2026

పేదరికాన్ని జయించి స్పేస్ మిషన్‌లో చోటు

AP: తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని కందుల జెస్సీ పేదరికాన్ని జయించి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు పొందింది. సైన్స్‌పై ఆసక్తితో పాఠశాలలోని అటల్ టింకరింగ్ ల్యాబ్‌లో పలు వినూత్న ప్రాజెక్టులు రూపొందించిన ఆమె, 'శక్తిశాట్-ఇంటర్నేషనల్ స్పేస్ మిషన్' కోసం జరిగిన ఎంపికల్లో 108 దేశాల నుంచి నమోదైన 12 వేల మందిలో భారత్ తరఫున ఎంపికైన 21 మందిలో చోటు దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థినిగా ఆమె నిలిచింది.

పోలీసుల చర్యలపై సుప్రీంకోర్టు సీరియస్
India· 25 Jul 2026

పోలీసుల చర్యలపై సుప్రీంకోర్టు సీరియస్

నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళనల సందర్భంగా పోలీసుల బలప్రయోగంపై సుప్రీంకోర్టు స్పందించింది. పోలీసుల అణచివేత చర్యలను సవాల్ చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లను జూలై 27న విచారించేందుకు అంగీకరించింది. CJI జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. విద్యార్థులపై విచక్షణారహితంగా బలప్రయోగం జరుగుతోందని, న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని కోరారు. దీనిపై విచారణకు స్వీకరిస్తూ సోమవారం విచారణ చేపడతామని తెలిపారు.

దేశాన్ని కుదిపేస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలు
Crime· 25 Jul 2026

దేశాన్ని కుదిపేస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలు

NCRB నివేదిక ప్రకారం 2014 నుంచి 2024 వరకు దేశవ్యాప్తంగా 1,23,918 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు 80 శాతం పెరిగి, 2014లో 8,068 నుంచి 2024లో 14,488కు చేరాయి. కుటుంబ సమస్యలు ప్రధాన కారణంగా నిలవగా, పరీక్షల్లో వైఫల్యం కారణంగా 25 వేలకుపైగా మంది ప్రాణాలు తీసుకున్నట్లు నివేదిక వెల్లడించింది. విద్యా సంస్థల్లో పెరుగుతున్న అకాడమిక్ ఒత్తిడి కూడా కీలక కారణంగా పేర్కొంది. మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదవగా, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తదుపరి స్థానాల్లో ఉన్నాయి.

రాజీనామాపై తేలని చర్చలు.. ఉత్కంఠ
India· 25 Jul 2026

రాజీనామాపై తేలని చర్చలు.. ఉత్కంఠ

నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, CJP మధ్య జరిగిన చర్చలు ఎలాంటి నిర్ణయం లేకుండానే ముగిశాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఇరువర్గాలు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ప్రభుత్వం మరో 24 గంటల సమయం కోరింది. లీకేజీల నియంత్రణకు కొత్త బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పరీక్షల నిర్వహణ సంస్థలో పలువురు సిబ్బందిని తొలగించగా, ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దీంతో ఇవాళ ఉత్కంఠ నెలకుంది.

హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు వార్నింగ్
TG· 25 Jul 2026

హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు వార్నింగ్

TG: హైడ్రా కమిషనర్ AV.రంగనాథ్ వ్యవహారశైలిపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో సమర్పించిన అఫిడవిట్‌లో పశ్చాత్తాపం కనిపించలేదని తెలిపింది. హైడ్రాకు అసాధారణ అధికారాలు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తూ, రాష్ట్రంలోని అన్ని శాఖలు హైడ్రాకు మోకరిల్లాయా అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. హైడ్రా ఎక్కడికి వెళ్లినా భారీ పోలీసు బలగాలు, వనరులు ఎలా సమకూరుతున్నాయో ప్రభుత్వం వివరించాలని సూచించింది. పూర్తి అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత తదుపరి చర్యలపై ఈ నెల 27న విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

పని దొరికే చోటే ఇల్లు
TG· 25 Jul 2026

పని దొరికే చోటే ఇల్లు

TG: నిరుపేదలకు కేటాయించే ఇందిరమ్మ ఇళ్లు జనావాసాలకు దూరంగా కాకుండా, ఉపాధి అవకాశాలకు దగ్గరగా ఉండేలా నిర్మించాలని CM రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. CURE (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) పరిధిలోని ఇందిరమ్మ ఇళ్లపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ORR పరిధిలో ప్రభుత్వ నిరుపయోగ స్థలాలను గుర్తించి అక్కడే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. తొలి దశలో 17 నియోజకవర్గాల్లో 7,680 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు.

వివేకా హత్య కేసులో సునీతకు  ఎదురు దెబ్బ
AP· 25 Jul 2026

వివేకా హత్య కేసులో సునీతకు ఎదురు దెబ్బ

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీతకు గట్టి ఎదురు దెబ్బ తగిలింద. సీబీఐ చార్జి షీటును తిరస్కరించాలని సునీత వేసిన పిటిషన్ ను నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టేసింది. కేసు దర్యాప్తు సమగ్రంగా లేదని మరికొందరిని విచారించాలని సునీత వాదించారు. అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు పూర్తి చేశామని సీబీఐ కోర్టుకు తెలిపింది.

వీడియో రిలీజ్ చేయడం కాదు,  పార్లమెంట్‌లో మాట్లాడాలి
Politics· 25 Jul 2026

వీడియో రిలీజ్ చేయడం కాదు, పార్లమెంట్‌లో మాట్లాడాలి

ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులను బెదిరించడం సరికాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఇందుకు ప్రభుత్వం జవాబుదారీగా నిలవాల్సి ఉంటుందని అన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీలపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు కేవలం కంటితుడుపు చర్యేనని, దానితో సమస్య పరిష్కారం కాదన్నారు. ఇది ఏకపక్ష మన్‌కీబాత్‌ కాదని, ప్రధాని పార్లమెంటులో మాట్లాడాలన్నారు. వెంటనే మోదీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించడం అమానుషమని ఫైరయ్యారు.

నీట్ లీకేజీలపై చర్యలు-NTA లో 47 మంది పై వేటు !
News· 25 Jul 2026

నీట్ లీకేజీలపై చర్యలు-NTA లో 47 మంది పై వేటు !

నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీ నిరసనలపై రెస్పాండ్ అయిన కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లోని 47 మంది అధికారులను తొలగించింది. నెల రోజుల్లో NTA వ్యవస్థను రిఫామ్ చేసేందుకు యాక్షన్ మొదలు పెట్టింది. ఔట్‌సోర్సింగ్ విధానాల్లో మార్పులతో పాటు, లీకేజీలను అరికట్టేందుకు నిందితులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, ₹10 కోట్ల వరకు ఫైన్ విధించే కఠినమైన చట్ట సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

CJP ప్రొటెస్ట్స్‌కి దిగొచ్చిన కేంద్రం.. విద్యాశాఖలో చేంజ్!
Politics· 25 Jul 2026

CJP ప్రొటెస్ట్స్‌కి దిగొచ్చిన కేంద్రం.. విద్యాశాఖలో చేంజ్!

NEET పేపర్ లీక్ గొడవపై కాకరోచ్ జనతా పార్టీ (CJP) వరుస ప్రొటెస్ట్స్ చేయడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో ఆఫీసర్లను మారుస్తూ బిగ్ డెసిషన్ తీసుకుంది. ఎగ్జామ్స్ పక్కాగా జరగాలని, బాధ్యులపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్స్ రావడంతో.. హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ వినీత్ జోషిని పంచాయతీ రాజ్ శాఖకి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆయన ప్లేస్‌లో నరేష్ పాల్ గంగ్వార్‌ను కొత్త సెక్రటరీగా నియమిస్తూ కేబినెట్ కమిటీ ఓకే చెప్పేసింది

GOOGLE Vs  AI
Infotainment· 25 Jul 2026

GOOGLE Vs AI

ఒకప్పుడు చిన్న సందేహం వచ్చినా గూగుల్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏఐ సెర్చ్ టూల్స్ దాన్ని మార్చేస్తున్నాయి. వందల లింకులతో టైం వేస్ట్ కాకుండా ఏఐ డైరెక్ట్ సమాధానం ఇస్తుంది. కొత్త వాటిని వెతకడానికి, కష్టమైన విషయాలను అర్థం చేసుకోవడానికి, కోడింగ్ తప్పులు దిద్దడానికి ఏఐ సహాయపడుతుంది. అధికారిక రీసెర్చ్ పేపర్లు, స్థానిక సమాచారం, షాపింగ్, ధరల పోలిక, మూవీ రివ్యూల కోసం గూగుల్ సెర్చ్ నమ్మదగినదిగా ఉన్నా, ఐడియాలు వెంటనే రావాలంటే ఏఐని వాడాల్సిందే.

పిల్లలు భారం కాదు.. భవిష్యత్తుకు ఆస్తి
AP· 25 Jul 2026

పిల్లలు భారం కాదు.. భవిష్యత్తుకు ఆస్తి

AP: పిల్లలు భారం కాదని, భవిష్యత్తుకు వారే అసలైన ఆస్తి అని CM చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘తల్లికి వందనం’ పథకాన్ని డబ్బు కోసం కాదు, మనసుతో అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలకు త్వరలో ఉచితంగా సోలార్ ప్యానెల్స్ అందిస్తామని ప్రకటించారు. హైస్కూల్ నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బోధిస్తామని, మూడు నెలలల్లోపు ప్రతి ఇంటికీ ఫోన్‌, వైఫై ఉండాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

వేగంగా నిద్రపోవడానికి మిలిటరీ మెథడ్
Health· 25 Jul 2026

వేగంగా నిద్రపోవడానికి మిలిటరీ మెథడ్

రాత్రిపూట నిద్రపట్టక ఇబ్బంది పడేవారికి 'మిలిటరీ స్లీప్ మెథడ్'. ఈ పద్ధతి ద్వారా కేవలం రెండు నిమిషాల్లోనే ప్రశాంతంగా నిద్రపోవచ్చు. దీనికోసం కళ్లు మూసుకుని ముఖం, దవడలు, భుజాలు, చేతుల కండరాలను పూర్తిగా సడలించాలి. నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటూ ఛాతీని, కాళ్లను ప్రశాంతంగా వదిలెయ్యాలి. మనస్సులోని ఆలోచనలను పక్కనపెట్టి, ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాలను పది సెకన్ల పాటు ఊహించుకోవాలి. మొదట్లో ఈ పద్ధతి సరైన ఫలితం ఇవ్వకపోవొచ్చు. రిజల్ట్ కోసం కనీసం ఆరు వారాలపాటు ప్రాక్టీస్ కావాలి.

డిగ్రీ పూర్తి చేసిన వారికి పీఎన్‌బీలో ఉద్యోగాలు
Jobs· 25 Jul 2026

డిగ్రీ పూర్తి చేసిన వారికి పీఎన్‌బీలో ఉద్యోగాలు

డిగ్రీ పూర్తి చేసిన వారికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ మంచి అవకాశం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న పీఎన్‌బీ బ్రాంచీల్లో 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌ అప్లికేషన్ చేసుకోవాలని బ్యాంక్ సూచించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పోస్టులు ఉన్నాయి. ఆఫీసియల్ లింక్: https://pnb.bank.in/Recruitments.aspx

మోదీని కాపాడుతున్న రేవంత్: బీఆర్ఎస్
News· 25 Jul 2026

మోదీని కాపాడుతున్న రేవంత్: బీఆర్ఎస్

TG: నీట్ పేపర్ లీకేజీపై బీఆర్‌ఎస్‌వీ నిర్వహించిన నిరసనకు వెళ్తున్న కేటీఆర్‌ను అడ్డుకోవడానికి రేవంత్ రెడ్డి అనుచరులు ప్రయత్నించారని బీఆర్‌ఎస్ ఆరోపించింది. పాత కేసుల్లో అరెస్టు చేస్తారనే భయంతో రేవంత్ అనుక్షణం ప్రధాని మోదీకి మోకరిల్లుతున్నారని, కేటీఆర్ పోరాటాన్ని దొడ్డిదారిలో ఆపడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించింది. విద్యార్థులను అరెస్టు చేస్తూ, నీట్ అక్రమాలపై మోదీని ఒక్క మాట అనకుండా రేవంత్ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని మండిపడింది.