Latest

ఓటీటీ బింజ్-వాచింగ్ (Binge-watching) ముప్పు
ఓటీటీల్లో వరుసగా వెబ్ సిరీస్‌లను గంటల తరబడి చూసే బింజ్-వాచింగ్ (Binge-watching) మానసిక అనారోగ్యానికి దారి తీస్తోంది. ఎక్కువగా Binge-watching చేసేవారిలో నిద్ర సమస్యలు, ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్, ఒంటరితనం కనిపిస్తున్నట్లు స్టడీలు చెబుతున్నాయి. స్క్రీన్ టైమింగ్‌లో ఎక్కువగా గడిపే యూత్ వాళ్ల రోజువారీ జీవితం, సోషల్ రిలేషన్స్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఓటీటీ చూడటానికి లిమిటేషన్స్, నిద్రకు ముందు ఎక్కువసేపు స్క్రీన్ చూడకపోవడం మంచిదని నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు.

టాటా కంపెనీపై కెన్యా ప్రెసిడెంట్ సీరియస్
కెన్యాలోని టాటా కెమికల్స్ మగాదీపై ప్రెసిడెంట్ విలియమ్ రూటో ఫైర్ అయ్యారు. దేశం నుంచి కంపెనీ వెళ్లిపోవాలని ఆదేశించారు. 100 ఏళ్లుగా కెన్యాలో ఆపరేషన్స్ సాగిస్తున్నా లోకల్ ప్రజలకు, ఎకానమీకి సరైన బెనిఫిట్ కలగలేదని ఆరోపించారు. సోడా యాష్‌ను ఎక్స్పోర్ట్ చేయడం తప్ప స్థానికంగా గ్లాస్, కెమికల్ ప్లాంట్లు ఏర్పాటు చేయలేదని సీరియస్ అయ్యారు. టాటా స్థానంలో రెండు కొత్త కంపెనీలను తీసుకొచ్చి స్థానికులకు జాబ్స్ కల్పిస్తామని చెప్పారు. అయితే స్థానిక రూల్స్‌ను ఫాలో అవుతూనే ఆపరేషన్స్ చేశామని టాటా కెమికల్స్ చెబుతోంది.

మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం అందజేత
TG: సంచార, విముక్తి జాతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ రేణుక నారాయణ నేతృత్వంలో సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ తిపిరిశెట్టి, రాష్ట్ర కమిటీ ప్రతినిధులు మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర విముక్తి జాతుల దినోత్సవం–2026 నిర్వహణ, సంక్షేమ అంశాలపై చర్చించారు. బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ, MBC కార్పొరేషన్ CEOతో చర్చించి త్వరలో తుదినిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.

రోహిత్ శర్మ భవిష్యత్తుపై BCCI రివ్యూ
రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి BCCI రివ్యూ మీటింగ్‌లో చర్చ జరిగింది. అయితే రోహిత్ రిటైర్మెంట్‌పై ఇప్పటివరకు ఎలాంటి అఫిషియన్ డెసిషన్ తీసుకోలేదు. BCCI సెక్రటరీ దేవజిత్ సైకియా కూడా రోహిత్ ఫామ్‌లో ఉన్నాడని చెప్పారు. ప్రస్తుతానికి రోహిత్ వన్డే క్రికెట్‌లో కొనసాగాలని ప్లాన్ చేస్తున్నాడు. ఆయన పనితీరు, ఫిట్‌నెస్‌పై 2027 వరల్డ్ కప్‌కి ఆయన సెలక్షన్ ఆధారపడి ఉంటుంది.

OTTలోకి ‘DC’
తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన యాక్షన్ క్రైమ్ సినిమా ‘DC’ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. అరుణ్ మాథేశ్వరన్ తీసిన ఈ సినిమాలో వామికా గబ్బి హీరోయిన్‌గా నటించింది. థియేటర్లలో హిట్ కొట్టిన ఈ సినిమా, ఈరోజు (September 4) నుంచి Sun NXT యాప్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ చూసేయొచ్చు.

మారుమూల ప్రాంతాల ప్రజలకు న్యాయ సేవలు
మారుమూల ప్రాంతాల ప్రజలకు న్యాయ సేవలను దగ్గర చేసేందుకు సుప్రీంకోర్టు 26 మొబైల్ ఈ-సేవా వ్యాన్లను ప్రారంభించనుంది. సుప్రీంకోర్టు ఈ-కమిటీ పర్యవేక్షణలో చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని మధ్యానం 2 గంటలకు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, ఈ-కమిటీ ప్యాట్రన్-ఇన్-చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ప్రారంభించారు. జాతీయ న్యాయ సేవల సంస్థ, న్యాయశాఖ సహకారంతో ఈ వ్యాన్లు పనిచేస్తాయి. వీటి ద్వారా ఈ-కోర్టు సేవలు, ఈ-ఫైలింగ్, ఈపేమెంట్, మొబైల్ లోక్ అదాలత్‌లు, ఉచిత న్యాయ సహాయం, న్యాయ అవగాహన అందించనున్నారు.

ఇందిరమ్మ ఇంటికి మంత్రి గృహప్రవేశం
TG: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో నిర్మించిన నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటిని ప్రారంభించి కుటుంబ సభ్యులను అభినందించారు. పేద, నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

మహిళా సమైక్య భవన్‌కు డీకే అరుణ శంకుస్థాపన
TG: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామంలో మహిళా సమైక్య భవన్ నిర్మాణానికి ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ముందుగా గ్రామంలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నిర్మాణ పనులను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, కమ్యూనిటీ భవనాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. భవనం అందుబాటులోకి వస్తే సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

అక్షర స్కూల్‌లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్
TG: వరంగల్ జిల్లా నర్సంపేటలోని బాలాజీ విద్యాసంస్థలకు చెందిన అక్షర ది స్కూల్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఏ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ వనజ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టతను విద్యార్థులకు వివరించారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అలరించారు. నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేయగా పాఠశాల ప్రాంగణం బృందావనాన్ని తలపించింది.

సీఎం రేవంత్ నన్ను అవమానిస్తున్నారు: సురేఖ
TG: సీఎం రేవంత్ రెడ్డి తనను అవమానిస్తున్నారని ఆరోపిస్తూ మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ హైకమాండ్‌కు కంప్లైంట్ చేశారు. ఆగస్టు 22న సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్‌కు, ఆగస్టు 23న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మీనాక్షి నటరాజన్‌కు రాసిన పది పేజీల లెటర్‌ను మీడియాకు విడుదల చేశారు. రేవంత్ రెడ్డి తన శాఖల్లో తన నిర్ణయాధికారాన్ని తగ్గించి నేరుగా ఆర్డర్స్ ఇస్తున్నారని తెలిపారు. తన మాజీ ఓఎస్డీని తొలగించి, అతణ్ని అరెస్టు చేసేందుకు తన ఇంటికి పోలీసులను పంపి మంత్రి హోదాను అవమానించారన్నారు.

గాయం నాకు మంచే చేసింది: రష్మిక
‘మైసా’ షూటింగ్‌లో గాయపడటంతో దాదాపు నెలన్నర పాటు రష్మిక షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చారు. పెళ్లి తర్వాత సినిమా కమిట్‌మెంట్స్‌తో భర్త విజయ్ దేవరకొండతో ఎక్కువ టైం గడపలేకపోయానని ఆమె చెప్పారు. పెళ్లి తర్వాత దాదాపు మూడు నెలలు ఇద్దరూ కలుసుకోలేదని రష్మిక తెలిపారు. గాయం కారణంగా ఇంట్లో విశ్రాంతి తీసుకోవడంతో విజయ్‌తో తొలిసారి ఎక్కువ క్వాలిటీ టైమ్ దొరికిందని చెప్పారు. ఇద్దరూ కలిసి సీరియస్ షోలు, కొరియన్ డ్రామాలు చూస్తూ టైమ్ ఎంజాయ్ చేస్తున్నట్టు తెలిపింది.
ఇంకా చాలా మంది ఉన్నారా? టన్నెల్‌లో ఘోరం!
నేపాల్‌లో ఆగస్టు 26న వచ్చిన భారీ వరదల వల్ల 'త్రిశూలి 3A' హైడ్రో పవర్ ప్రాజెక్ట్ టన్నెల్‌లో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యక్తులను రెస్క్యూ టీమ్స్ సేఫ్‌గా కాపాడారు. దాదాపు 10 రోజుల పాటు టన్నెల్ లోపలే ఉండిపోయిన వారిని ఎంతో కష్టపడి బయటకు తీశారు. సెర్చ్ ఆపరేషన్ టైమ్‌లో లోపల నుంచి మరికొందరి గొంతులు కూడా వినిపించడంతో రెస్క్యూ ఆపరేషన్స్‌ను మరింత స్పీడప్ చేశారు. ప్రస్తుతం ఆర్మీ, ఇతర సెక్యూరిటీ టీమ్స్ లోపల ఉన్న మిగతా వారిని బయటకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

PFRDAలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
PFRDA రిక్రూట్‌మెంట్ 2026లో మొత్తం 30 వేకెన్సీస్‌కు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. Assistant Manager (Grade A) పోస్టులకు General, Research, Actuary, Official Language స్ట్రీమ్స్‌లో పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే అప్లికేషన్స్ స్టార్ట్ కాగా, సెప్టెంబర్ 24 లోపు <a href="https://ibpsreg.ibps.in/pfrdajul26/">అప్లై చేసుకోవచ్చు.</a> అర్హత స్ట్రీమ్‌ను బట్టి మారుతుంది. మ్యాక్సిమమ్ ఏజ్ ముప్పై ఏళ్లు ఉండాలి. General/EWS/OBC వారికి ఫీజు రూ. 1,000, SC/ST/PwBD/Womenకు ఎటువంటి ఫీజు లేదు. పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ <a href="https://pfrda.org.in/w/advertisement-recruitment-of-officer-grade-a-assistant-manager-2026?p_l_back_url=%2Fget-to-know%2Fcareers%2Fvacancies&p_l_back_url_title=Vacancies">Click</a> చేయండి.

కృత్రిమ పనీర్‌పై దేశవ్యాప్తంగా బ్యాన్?
దేశవ్యాప్తంగా కృత్రిమ పనీర్‌ను నిషేధించేందుకు FSSAI నిబంధనలు తీసుకొస్తోంది. ఇప్పటికే పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్ సహా 8 రాష్ట్రాల్లో దీని తయారీ, అమ్మకాలపై బ్యాన్ ఉంది. పాల స్థానంలో కూరగాయల నూనెలు ఉపయోగించే ఈ పనీర్‌ను పాన్-ఇండియా స్థాయిలో బ్యాన్ చేసేందుకు FSSAI CEO ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఈ-కామర్స్ యాప్‌లలో ఎక్స్‌పైరీ డేట్లు స్పష్టంగా ఉండాలని, స్కూళ్లకు 50 మీటర్ల లోపు జంక్ ఫుడ్ అమ్మకాలపై ఆంక్షలు విధించారు. రూల్స్ మీరిన 5 స్టార్ హోటళ్లకు నోటీసులు ఇచ్చారు.

SC/ST యాక్ట్ కింద కేసు పెట్టాలని CJP డిమాండ్
జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో తమ <a href="https://www.theclearcutnews.com/n/PsXCF6n">సపోర్టర్ సంజయ్‌పై</a> జరిగిన దాడి కేసులో CJP ప్రతినిధులు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. స్పోక్స్‌పర్సన్ సౌరవ్ దాస్ మాట్లాడుతూ.. ప్రొటెస్ట్‌లో ఓ మైనర్ బాలిక కూడా మొదటి రోజు నుంచి ఉందన్నారు. ఆ టైమ్‌లో కొందరు క్రిమినల్ గ్యాంగ్ వచ్చి వైలెన్స్ చేశారని ఆరోపించారు. ఘటనపై FIR నమోదైనా, మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరామని చెప్పారు. అయితే పోలీసులు రియాక్ట్ కాకపోవడంతో, <a href="https://x.com/PTI_News/status/2095749221593096612">కోర్టును అప్రోచ్ అవ్వాలని</a> పోలీసులు తమకు చెప్పారన్నారు.

ఆపిల్ స్కూల్‌లో ఘనంగా జన్మాష్టమి వేడుకలు..!
కాకినాడ జిల్లా మండపేటలో ఆపిల్ స్కూల్ సందడిగా మారింది. విద్యార్థులు బాలకృష్ణుడు, రాధ, గోపికల వేషాల్లో ఆకట్టుకున్నారు. 3D కళాకృతుల ద్వారా కృష్ణుని బాల్యలీలలు, వెన్నదొంగ, కాళీయ మర్దనం, కంస వధ వరకు ప్రదర్శించారు. ఉట్టి కొట్టే కార్యక్రమంలో చిన్నారులు పిరమిడ్ గా నిలిచి అలరించారు. కరస్పాండెంట్ ప్రజ్ఞ మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కోసం ఇలాంటి కార్యక్రమం నిర్వహించామన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ధర్నా చౌక్ లో టెట్ సమస్యలపై నిరాహార దీక్ష..! 4వ రోజు
విజయవాడ ధర్నా చౌక్లో ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. టెట్ సమస్యల పరిష్కారం కోసం యూటీఎఫ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 4 నుంచి నిరాహార దీక్షలు మొదలయ్యాయి. సీఐటీయూ ఈ దీక్షలకు మద్దతు ప్రకటించింది. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎ.వి. నాగేశ్వరరావు దీక్షలను ప్రారంభించారు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు, సీఐటీయూ ప్రతినిధులు పాల్గొన్నారు.

'దాడి కాదు.. సెల్ఫ్ డిఫెన్స్- స్వతంత్ర భరద్వాజ్ U-Turn
స్వతంత్ర భరద్వాజ్ U-Turn తీసుకున్నారు. ప్రొటెస్ట్ లో CJP యాక్టివిస్ట్ నిషూ ఆజాద్ తండ్రిపై దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణలను ఖండించారు. తను దాడి చేయలేదని, 10-15 మంది చుట్టుముట్టడంతో సెల్ఫ్ డిఫెన్స్ చేశానని అన్నారు. తన చేతి కడా తగిలి అతనికి గాయమైందని తెలిపారు. వైరల్ అవుతున్న పోడ్‌కాస్ట్ క్లిప్‌ను ఫేక్ అని కొట్టిపారేశారు. <a href="https://www.theclearcutnews.com/n/PsXCF6n">పొలిటికల్ సపోర్ట్</a> వల్లే అరెస్ట్ కాకుండా తప్పించుకున్నారనే వార్తలపై స్పందిస్తూ, కపిల్ మిశ్రా, చిరాగ్ పాశ్వాన్ తన బ్రదర్స్ లాంటి వారని, ఆ కామెంట్స్‌ను Satiricalగా చెప్పానని అన్నారు.

అర్ధరాత్రి రైల్లో మహిళకు అవమానం..భారీ ఫైన్
రిజర్వేషన్ ఉన్నప్పటికీ ఓ మహిళను అర్ధరాత్రి రైలు నుంచి దించేయడంపై కేరళ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. ఆమెకు రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని రైల్వే శాఖను ఆదేశించింది. కమిషన్ చైర్‌పర్సన్ జస్టిస్ అలెగ్జాండర్ థామస్ జీవో జారీ చేశారు. టికెట్ లేదంటూ RPF కేసు నమోదు చేయగా, తప్పుగా కేసు పెట్టినట్లు గుర్తించి రైల్వే అధికారులు కేసు ఉపసంహరించుకున్నారు. మహిళను రాత్రివేళ దించడం రైల్వే రూల్స్‌కి విరుద్ధమని థామస్ అన్నారు. నెలలోపు పరిహారం చెల్లించాలని, ఆలస్యమైతే 8 శాతం వడ్డీ చెల్లించాలని ఆదేశించారు.

Govt. ఉద్యోగుల SM పోస్టులపై కేంద్రం ఫోకస్
Govt. ఉద్యోగుల ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి SM(Social Media) అకౌంట్లను ఉపయోగించే తీరుపై కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ రూపొందించనున్నట్లు సమాచారం. అధికారులు తమ హోదాను ఉపయోగించి సొంత ప్రచారం చేసుకోవడం, అనుచిత వీడియోలు, రీల్స్, అభిప్రాయాలను పోస్టు చేయడాన్ని నియంత్రించేలా ఈ రూల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ ఎప్పుడు అమల్లోకి వస్తాయనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

APలో వర్షాలు.. గాలులు.. హెచ్చరిక..!
APలో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మబ్బుల వాతావరణంతో పాటు పిడుగులు పడొచ్చట. కొన్ని చోట్ల 40-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరికొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ పంటలు, ఆస్తులు దెబ్బతినకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు భద్రతపై దృష్టి పెట్టాలని అధికారులు చెబుతున్నారు.