Latest

'దాడి కాదు.. సెల్ఫ్ డిఫెన్స్- స్వతంత్ర భరద్వాజ్ U-Turn
National· 9h ago

'దాడి కాదు.. సెల్ఫ్ డిఫెన్స్- స్వతంత్ర భరద్వాజ్ U-Turn

స్వతంత్ర భరద్వాజ్ U-Turn తీసుకున్నారు. ప్రొటెస్ట్ లో CJP యాక్టివిస్ట్ నిషూ ఆజాద్ తండ్రిపై దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణలను ఖండించారు. తను దాడి చేయలేదని, 10-15 మంది చుట్టుముట్టడంతో సెల్ఫ్ డిఫెన్స్ చేశానని అన్నారు. తన చేతి కడా తగిలి అతనికి గాయమైందని తెలిపారు. వైరల్ అవుతున్న పోడ్‌కాస్ట్ క్లిప్‌ను ఫేక్ అని కొట్టిపారేశారు. <a href="https://www.theclearcutnews.com/n/PsXCF6n">పొలిటికల్ సపోర్ట్</a> వల్లే అరెస్ట్ కాకుండా తప్పించుకున్నారనే వార్తలపై స్పందిస్తూ, కపిల్ మిశ్రా, చిరాగ్ పాశ్వాన్ తన బ్రదర్స్ లాంటి వారని, ఆ కామెంట్స్‌ను Satiricalగా చెప్పానని అన్నారు.

అర్ధరాత్రి రైల్లో మహిళకు అవమానం..భారీ ఫైన్
Current Affairs· 10h ago

అర్ధరాత్రి రైల్లో మహిళకు అవమానం..భారీ ఫైన్

రిజర్వేషన్ ఉన్నప్పటికీ ఓ మహిళను అర్ధరాత్రి రైలు నుంచి దించేయడంపై కేరళ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. ఆమెకు రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని రైల్వే శాఖను ఆదేశించింది. కమిషన్‌ చైర్‌పర్సన్ జస్టిస్ అలెగ్జాండర్ థామస్ జీవో జారీ చేశారు. టికెట్‌ లేదంటూ RPF కేసు నమోదు చేయగా, తప్పుగా కేసు పెట్టినట్లు గుర్తించి రైల్వే అధికారులు కేసు ఉపసంహరించుకున్నారు. మహిళను రాత్రివేళ దించడం రైల్వే రూల్స్‌కి విరుద్ధమని థామస్‌ అన్నారు. నెలలోపు పరిహారం చెల్లించాలని, ఆలస్యమైతే 8 శాతం వడ్డీ చెల్లించాలని ఆదేశించారు.

Govt. ఉద్యోగుల SM పోస్టులపై కేంద్రం ఫోకస్‌
National· 10h ago

Govt. ఉద్యోగుల SM పోస్టులపై కేంద్రం ఫోకస్‌

Govt. ఉద్యోగుల ఎక్స్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ లాంటి SM(Social Media) అకౌంట్లను ఉపయోగించే తీరుపై కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ రూపొందించనున్నట్లు సమాచారం. అధికారులు తమ హోదాను ఉపయోగించి సొంత ప్రచారం చేసుకోవడం, అనుచిత వీడియోలు, రీల్స్‌, అభిప్రాయాలను పోస్టు చేయడాన్ని నియంత్రించేలా ఈ రూల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ ఎప్పుడు అమల్లోకి వస్తాయనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

APలో వర్షాలు.. గాలులు.. హెచ్చరిక..!
Local· 10h ago

APలో వర్షాలు.. గాలులు.. హెచ్చరిక..!

APలో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మబ్బుల వాతావరణంతో పాటు పిడుగులు పడొచ్చట. కొన్ని చోట్ల 40-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరికొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ పంటలు, ఆస్తులు దెబ్బతినకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు భద్రతపై దృష్టి పెట్టాలని అధికారులు చెబుతున్నారు.

గద్దె తొలగించవచ్చు.. ప్రజల గుండెల్లో స్థానం కాదు!
Local· 10h ago

గద్దె తొలగించవచ్చు.. ప్రజల గుండెల్లో స్థానం కాదు!

వరంగల్ జిల్లా అశోక్ నగర్‌లో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం నిర్మించిన గద్దెను తొలగించారు. ఈ చర్యపై BRS నల్లబెల్లి మండల అధ్యక్షుడు డాక్టర్ బానోత్ సారంగపాణి స్పందించారు. "గద్దె తొలగించొచ్చు.. కానీ ప్రజల గుండెల్లో నేతకు ఉన్న స్థానాన్ని ఎవరూ తొలగించలేరు" అని ఆయన వ్యాఖ్యానించారు. అనుమతులు, స్థల సమస్యలు ఉంటే చర్చించి పరిష్కరించాల్సిందేనన్నారు. ప్రజానేతల జ్ఞాపకాలను రాజకీయ కోణంలో చూడటం దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రజావాణి ఫిర్యాదుపై చర్యలు ఏవీ? ఏక్మాయి SC వార్డు సమస్యలు!
Local· 10h ago

ప్రజావాణి ఫిర్యాదుపై చర్యలు ఏవీ? ఏక్మాయి SC వార్డు సమస్యలు!

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఏక్మాయి గ్రామంలో ఎస్సీ వార్డు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. మురుగు కాలువలు, రోడ్లు, పారిశుధ్యం, దోమల బెడదతో వారి రోజూ గడవడం లేదు. ఆగస్టు 24న ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.. రిఫరెన్స్ నంబర్ DVIKB24082600085 కూడా వచ్చింది. బషీరాబాద్ పంచాయతీ అధికారికి పంపించారు కానీ.. ఇంకా చర్యలు మాత్రం లేవు! మురుగు నీరు నిలిచి దోమలు పెరిగిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు, కాలువలు సరిచేసి శాశ్వత పరిష్కారం తీసుకోవాలంటూ అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది.

విద్యార్థిని ఆత్మహత్య కేసులో మరో మలుపు..!
Local· 10h ago

విద్యార్థిని ఆత్మహత్య కేసులో మరో మలుపు..!

రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్‌లో ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ వచ్చింది. గురుకుల పాఠశాల వసతి గృహంలో బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా బాలిక తండ్రి పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. తమ కూతురి బంధువు రమేష్ వేధింపులే ఆత్మహత్యకు కారణమని ఆరోపించారు. దీంతో పోలీసులు రమేష్‌పై కేసు నమోదు చేశారు. ఇప్పటికే అధ్యాపకుల వేధింపుల ఆరోపణలతో ఇంగ్లీష్ లెక్చరర్‌ను సస్పెండ్ చేశారు. ఇప్పుడు కొత్త ఆరోపణలతో విచారణ మరో కోణంలో సాగుతోంది. ఈ కేసులో నిందితులెవరనేది తేలాల్సి ఉంది.

ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ: CM రేవంత్
TG· 10h ago

ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ: CM రేవంత్

TG: హైదరాబాద్‌లోని చంచల్‌గూడ-సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ సభలో CM రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వం కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోయిందని, బ్రిడ్జి నిర్మాణానికి ఒక్క పైసా ఖర్చు చేయలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం ఫండ్స్ ఇచ్చి ఫ్లైఓవర్ పూర్తి చేసిందన్నారు. ఓల్డ్ సిటీ కాదు.. ‘ఒరిజినల్ సిటీ’ అని అన్నారు. అసదుద్దీన్ అడిగిన డెవలప్‌మెంట్ పనులకు ఫండ్స్ ఇస్తామని చెప్పారు. వచ్చే ఎలక్షన్స్‌లోగా చాంద్రాయణగుట్ట వరకు మెట్రో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈర్లపల్లి అమ్మ చెరువు పేరు మార్పుపై గ్రామస్థుల నిరసన..!
Local· 10h ago

ఈర్లపల్లి అమ్మ చెరువు పేరు మార్పుపై గ్రామస్థుల నిరసన..!

మక్తల్-నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈర్లపల్లి అమ్మ చెరువును అభివృద్ధి చేస్తున్నారు. ఈ చెరువును 'ఈర్లపల్లి డ్యామ్'గానే ఉంచాలని గ్రామ ప్రజలు తీర్మానించారు. యూత్ కాంగ్రెస్ కొడంగల్ అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ ఈ ట్యాంక్‌ను 'గోఖపసల్వాద్ ట్యాంక్'గా మార్చాలని సోషల్ మీడియాలో ప్రతిపాదించారు. 200 ఏళ్ల నాటి ఈ చెరువు పేరు మారిస్తే అది తమ గ్రామానికి, గ్రామ గౌరవానికి అన్యాయం చేసినట్లేనని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సత్తుపల్లిలో Cool drink షాపులో దొంగలు.. ఇద్దరు అరెస్ట్!
Local· 10h ago

సత్తుపల్లిలో Cool drink షాపులో దొంగలు.. ఇద్దరు అరెస్ట్!

అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు cool drink షాపులో చోరీకి ప్రయత్నించారు. గమనించిన షాపు యజమాని పోలీసులకు కంప్లయింట్ చేశారు. పోలీసులు వేగంగా స్పందించి ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి గాంధీనగర్లో జరిగింది. గురువారం వారిని కోర్టులో హాజరుపరిచారు. ఇదే ప్రాంతంలో గతంలో జరిగిన మరో చోరీలోనూ వీరి పాత్ర ఉందని అంగీకరించారని పోలీసులు తెలిపారు. యజమానుల అప్రమత్తత వల్ల ప్రమాదాలు నివారించబడి, నేరస్తులను వేగంగా పట్టుకునే వీలుంటుందని పోలీసులు చెప్పారు.

కిష్టారం అంగన్వాడీలో గన్నేరు ఆకులు కలిసిన పప్పు భోజనం?
Local· 10h ago

కిష్టారం అంగన్వాడీలో గన్నేరు ఆకులు కలిసిన పప్పు భోజనం?

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో ఘటన చోటుచేసుకుంది. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు వడ్డించిన పప్పులో గన్నేరు ఆకులు కలిశాయి. సెప్టెంబర్ 1న గోంగూర పప్పు తయారీ సమయంలో ఇది జరిగింది. సమీపంలోని గన్నేరు మొక్కల ఆకులు కూడా కలిసిపోయాయని అధికారులు తెలిపారు. ఈ పప్పు తిన్న ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే సత్తుపల్లి ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పెద్ది గద్దె కూల్చివేతపై BRS ధర్నా..!
Local· 10h ago

పెద్ది గద్దె కూల్చివేతపై BRS ధర్నా..!

వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం నిర్మించిన గద్దెను కూల్చివేశారు. దీన్ని నిరసిస్తూ BRS శ్రేణులు ధర్నా చేపట్టారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ గద్దె కూల్చివేతపై BRS నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాధ్యులపై చర్యలు, విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలు ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి.

సొంతూరికి వీర జవాను.. ఘన స్వాగతం!
Local· 10h ago

సొంతూరికి వీర జవాను.. ఘన స్వాగతం!

మీరు ఇది విన్నారా? నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం గొల్లమాడ గ్రామంలో హడావుడి చెలరేగింది. 20 ఏళ్ల సైనిక సేవ పూర్తి చేసి రిటైర్ అయిన హవల్దార్ మేజర్ ప్రమోద్ సొంతూరికి తిరిగొచ్చారు. గ్రామస్థులు మేళతాళాలు, బాణాసంచాతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయనను ఊరేగింపుగా తీసుకెళ్లి సన్మానించారు. ఎలాంటి మచ్చలేకుండా, తమ కంపెనీ కమాండర్ కు క్రమశిక్షణ, శిక్షణ విషయాల్లో సహాయకుడిగా ఉండే ఉన్నతమైన హవల్దార్ మేజర్ పదవి నుంచి రిటైర్ అయ్యారు. ప్రమోద్ నేటి యువతకు ఆదర్శమని గ్రామస్థులు కొనియాడారు.

వినాయక విగ్రహాలకు పోలీస్ అనుమతి తప్పనిసరి!
Local· 11h ago

వినాయక విగ్రహాలకు పోలీస్ అనుమతి తప్పనిసరి!

పల్నాడు జిల్లా గురజాలలో పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. వినాయక చవితి విగ్రహాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి. పోలీస్, విద్యుత్, ఫైర్ శాఖల పర్మిషన్ పొందాలని సీఐ మురళి చెప్పారు. విగ్రహ ఏర్పాటు కమిటీలు ఈ నియమం పాటించాలి. నిమజ్జనం తేదీ, స్థలం ముందుగా తెలియజేయాలి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. నియమాలను ఎవ్వరు అతిక్రమించినా కఠిన చర్యలు ఉంటాయని సిఐ హెచ్చరించారు.

గురజాలలో ఓటర్ల జాబితా విడుదల..!
Local· 11h ago

గురజాలలో ఓటర్ల జాబితా విడుదల..!

ఇది విన్నారా? పల్నాడు జిల్లా గురజాల నగర పంచాయతీలో ఓటర్ల జాబితా సిద్ధమైంది. 23 వార్డుల ఫోటో ఎలక్టోరల్ రోల్ విడుదల చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2026 జనవరి 1ని ప్రామాణిక తేదీగా తీసుకున్నారు. ఆర్డీవో, తహసీల్దార్, మున్సిపల్, ఎంపీపీ కార్యాలయాల్లో జాబితాలు అందుబాటులో ఉన్నాయి. ఓటర్లు వెళ్లి తమ పేర్లు చెక్ చేసుకోవాలి. ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారులకు తెలియజేయాలి. ఈ అవకాశాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

12 రోజులుగా హంగర్ స్ట్రైక్.. 590 మంది బలైపోయారా?
Education· 11h ago

12 రోజులుగా హంగర్ స్ట్రైక్.. 590 మంది బలైపోయారా?

నాసిక్‌లో 12 రోజులుగా హంగర్ స్ట్రైక్ చేస్తున్న ట్రైబల్ స్టూడెంట్స్‌ను అభిజీత్ దిప్కే కలసి మద్దతు ఇచ్చారు. అక్కడ ఫుడ్, ఎడ్యుకేషన్, ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోవడం వల్లే లాస్ట్ 2 ఇయర్స్‌లో 590 మంది స్టూడెంట్స్ చనిపోయారని ఫైర్ అయ్యారు. దీక్ష చేస్తున్న వారి హెల్త్ పాడవుతుంది కాబట్టి స్ట్రైక్ ఆపి, డిమాండ్స్ నెరవేరే వరకు ఫైట్ చేయాలని చెప్పారు. అవసరమైతే అందరం కలసి ముంబైకి మార్చ్ చేద్దామని పిలుపునిచ్చారు.

YCP నేత హత్య కేసులో కీలకం.. నిందితుడు కోర్టులో లొంగిపోయాడు!
Local· 11h ago

YCP నేత హత్య కేసులో కీలకం.. నిందితుడు కోర్టులో లొంగిపోయాడు!

ఆగస్టు 2026లో పల్నాడు జిల్లా రెంటాల గ్రామంలో YCP నేత చెన్నారెడ్డి హత్యకు గురైన కేసులో ప్రధాన నిందితుడు ఉమామహేశ్వరరెడ్డి. ఆయన గురువారం గురజాల కోర్టులో లొంగిపోయారు. కోర్టు నిందితుడికి రిమాండ్ విధించింది. పోలీసులు కస్టడీ కోసం కోర్టును అభ్యర్థించారు. కస్టడీ కోరికపై విచారణ కొనసాగుతోంది. హత్యకు కారణం ఇంకా తెలియరాలేదు. చెన్నారెడ్డి బైకుపై వెళ్తుండగా కారుతో ఢీ కొట్టి, కళ్లలో కారం చల్లి, గొంతుకోసి హతమార్చిన సంఘటన అప్పట్లో ఎపి రాజకీయాల్లో కలకలం రేపింది.

పేకాట స్థావరంపై పోలీసులు పంజా..!
Local· 11h ago

పేకాట స్థావరంపై పోలీసులు పంజా..!

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం రాయుడుపాలెం గ్రామ సమీపంలోని గుట్టపై పేకాట కొట్టు ఉంది. దానిపై ఎస్సై పల్లెల ప్రదీప్ ఆధ్వర్యంలో పోలీసులు అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు పట్టుబడ్డారు. మరో ఆరుగురు పరారయ్యారు. పోలీసులు వారి నుంచి 52 పేక ముక్కలు, రూ.3,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు నాలుగు బైక్లు, మూడు ఫోన్లు కూడా జప్తు చేశారు. మొత్తం 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మీ ఊర్లో ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలున్నా? మీ వార్త పంపండి!

కామారెడ్డిలో అంబేద్కర్ భవన్.. బోర్డు పెట్టేశారు!
Local· 11h ago

కామారెడ్డిలో అంబేద్కర్ భవన్.. బోర్డు పెట్టేశారు!

కామారెడ్డి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవనం కోసం సైట్ ఫిక్స్ అయింది. రెండు ఎకరాల స్థలంలో బోర్డు పెట్టే ఈవెంట్ జరిగింది. జిల్లా DSDO వెంకటేశ్వర్, అంబేద్కర్ యువజన సంఘం నేతలు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు కోత్తోల్ల గంగారాం, సెక్రెటరీ గైని రాజు హాజరయ్యారు. గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి మల్లన్న, నీరడి సంగమేశ్వర్, ధ్యామని భూపతి, లేగ్గల రాజు, గడ్డం రవి పాల్గొన్నారు. భవన నిర్మాణానికి ఇది మొదటి అడుగని, శరవేగంగా అంబేద్కర్ భవన నిర్మాణం పూర్తవుతుందని నేతలు చెబుతున్నారు.

కేరళ డ్రైవర్ ఎమోషనల్ ఫేర్‌వెల్!
Motivational· 11h ago

కేరళ డ్రైవర్ ఎమోషనల్ ఫేర్‌వెల్!

కేరళం KSRTC బస్సు డ్రైవర్ రిటైర్మెంట్ రోజు తన బస్సుకు ఎమోషనల్ ఫేర్‌వెల్ చెప్పారు. ఇడుక్కి కుమిలి డిపోకి చెందిన పౌల్ కురియన్ సెప్టెంబర్ 2న తన లాస్ట్ డ్యూటీ పూర్తి చేశారు. షిఫ్ట్ ముగిశాక బస్సును పార్క్ చేసి, స్టీరింగ్‌కు ముద్దుపెట్టుకుని సాల్యూట్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. KSRTC ఆఫీషియల్స్ షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్ల మనసులను గెలుచుకుంది. ఆయన డెడికేషన్‌ను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

కొండగట్టు గుట్టపై సెల్ టవర్..!
Local· 11h ago

కొండగట్టు గుట్టపై సెల్ టవర్..!

జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయానికి వచ్చే భక్తులకు సెల్ సిగ్నల్ సమస్య ఉంది. భక్తులు, అధికారులు పలుమార్లు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఇండస్ సెల్ టవర్ సంస్థతో మాట్లాడి టవర్ ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. ఇప్పటికే టవర్ ఏర్పాటు పూర్తయ్యింది. రేపు ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు. దీంతో కొండపై భక్తులకు మొబైల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.