Latest

హోర్ముజ్ జలసంధిలో దాడి..భారత నౌకదళా సిబ్బంది మృతి
హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు చమురు ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఈ ఘటనలో ఓ భారతీయ నౌకదళా సిబ్బందిలో ఒకరు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెంచిన ఈ ఘటనపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలు పోతున్నా.. గవర్నమెంట్ సైలెంట్!
ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న నిరాహార దీక్ష 17వ రోజుకు చేరింది. సుదీర్ఘ ఉపవాసం వల్ల ఆయన కండరాల క్షీణతతో తీవ్ర నొప్పితో బాధపడుతున్నారు. దీక్ష ఆపాలని CJP ఫౌండర్ అభిజిత్ దీప్కేతో పాటు అందరూ రిక్వెస్ట్ చేయగా, "నన్ను దీక్ష ఆపమని అడగొద్దు, చర్చలు జరపడానికి కూడా సిద్ధంగా లేని ప్రభుత్వాన్ని ప్రశ్నించండి" అంటూ ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం సోనమ్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనకు సపోర్ట్‌గా పోస్టులు పెడుతున్నారు.

అమెరికా ఆంక్షల మధ్య యథావిధిగా ఇరాన్ చమురు ఎగుమతులు
అమెరికా 60 రోజుల ఆంక్షల మినహాయింపును రద్దు చేసినప్పటికీ ఇరాన్ చమురు ఎగుమతులు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయని ఆ దేశ ఇంధనశాఖ మంత్రి మొహ్సెన్ పాక్‌నెజాద్ తెలిపారు. ఆంక్షలను ఎదుర్కొనే వ్యవస్థ ఇప్పటికే రెడీగా ఉండటంతో ఎగుమతులపై ప్రభావం ఉండదని స్పష్టం చేశారు.

ఆషాఢం ఆఫర్ అంటూ గ్రామస్తులకు టోకరా
AP:కోనసీమ జిల్లా మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో గుర్తుతెలియని ఓ వ్యక్తి గ్రామంలోకి వచ్చి లక్కీ డ్రాలో చేరితే ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తామని ప్రచారం చేశాడు. ఆషాడం ప్రత్యేక ఆఫర్ పేరుతో ఫ్రిజ్, ఎయిర్ కూలర్, డబుల్ కాట్ మంచం, వాషింగ్ మెషిన్, బైక్‌ల వంటి ఖరీదైన వస్తువులను అతితక్కువ ధరకే అందిస్తామని నమ్మించాడు. రోజువారీ కూలీలే లక్ష్యంగా పలువురి నుంచి నగదు, ఫోన్‌పే ద్వారా వేలాది రూపాయలు వసూలు చేశాడు. డబ్బు చేతికి రాగానే మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. బాధితులు మలికిపురం PSలో ఫిర్యాదు చేశారు.
రైల్వే పాయింట్స్ మ్యాన్ సాహసం అదుర్స్
కర్ణాటక రాష్ట్రం మురుడేశ్వర్ రైల్వేస్టేషన్‌లో కదులుతున్న రైలు నుంచి ఒక ప్రయాణికుడు దిగడానికి ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు అతను ఫ్లాట్‌ఫార్మ్ మధ్యలోకి పడిపోతుండగా డ్యూటీలో ఉన్న పాయింట్స్ మ్యాన్ గణపతి నాయక్ అతణ్ని బయటకు లాగి ప్రాణాలు కాపాడాడు. అతని ధైర్యసాహసాన్ని గుర్తించిన కొంకణ్ రైల్వే చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ రూ.10 వేలు నగదును బహుమతిగా ప్రకటించారు.

చీమలు తీపి పదార్థాలను ఎలా గుర్తిస్తాయి?
చీమలు తీపి పదార్థాలను ఎలా గుర్తిస్తాయో తెలుసా? వాటి తలపై ఉండే రెండు యాంటెన్నాలలో వేలాది సూక్ష్మ గ్రాహకాలు ఉంటాయి. ఇవి గాలిలో ఉన్న వాసన అణువులను గుర్తిస్తాయి. తీపి పదార్థాల నుంచి విడుదలయ్యే రసాయన అణువులను పసిగట్టి, దూరం నుంచే ఆహారం ఎక్కడ ఉందో గుర్తిస్తాయి. ఒక చీమ తీపి ఆహారం కనుక్కుంటే తిరిగి గూటికి వెళ్తూ నేలపై ఫెరోమోన్ అనే రసాయన మార్గాన్ని వదులుతుంది. ఆ మార్గాన్ని అనుసరించి మిగతా చీమలు కూడా అదే ఆహారం వద్దకు చేరుకుంటాయి.

మళ్లీ తగ్గిన గోల్డ్ రేట్స్!
బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గోల్డ్ రేట్స్ మళ్లీ తగ్గాయి. ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ₹110, 22 క్యారెట్లపై ₹100, 18 క్యారెట్లపై ₹80 వరకు తగ్గింది. ప్రస్తుతం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర ₹1,42,800 ఉండగా, 22 క్యారెట్లు ₹1,30,900 వద్ద, 18 క్యారెట్లు ₹1,07,100 గా ఉంది. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల ధరల్లో మార్పులు ఉండొచ్చు, కాబట్టి కొనేముందు ఒకసారి లైవ్ రేట్స్ చెక్ చేసుకోండి.

OUలో పోరుదీక్ష.. విద్యార్థి నేత అరెస్ట్
TG: రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలని చేయాలని విద్యార్థిసేన ఆధ్వర్యంలో OUలో నిరుద్యోగ పోరుదీక్ష చేశారు. యూనివర్సిటీలో దీక్షకు అనుమతి లేదని విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు శివప్రసాద్‌ను OU పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన CM రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారని ఫైరయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్‌లను ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందని ఆరోపించారు.

క్షుద్రపూజల పేరుతో బాలుడి మృతి
AP: క్షుద్ర పూజలకు చిన్నారి మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. దివ్యాంగ బాలుడు చక్రవర్తి(5)ని నడిపిస్తానని మొబీనా అనే మహిళ కుటుంబసభ్యులను నమ్మించింది. బాలుడిని మొబీనాకు అప్పగించి తల్లిదండ్రులు వెళ్లిపోయారు. అనంతరం అతని రెండు చేతులను కట్టేసి చిత్రహింసలు పెట్టింది. దెబ్బలకు తాళలేక అతడు స్పాట్‌లో చనిపోయాడు. అయితే తిరిగి బతికిస్తాని మృతదేహంతో మొబీనా పూజలు చేసింది. చివరికి ఆమె తీరుపై అనుమానం రావడంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బొమ్మరిల్లు డైరెక్టర్ భాస్కర్‌తో నాగార్జున 101వ సినిమా?
హీరో కింగ్ నాగార్జున తన 100 సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉండగా, బొమ్మరిల్లు డైరెక్టర్ భాస్కర్ ఇటీవల ఆయనకు ఓ కథ వినిపించారని సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. నాగార్జునకి ఆ కథ నచ్చి అగ్రిమెంట్ కూడా చేశారని తెలుస్తోంది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ మీద ఇండస్ట్రీలో అంచనాలు పెరిగాయి.

రాజ్‌కుమార్ మృతదేహం మాకు వద్దన్న కుటుంబసభ్యులు
TG: ఆరుగురిని క్రూరంగా హతమార్చిన నిందితుడు రాజ్‌కుమార్ మృతదేహానికి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు మృతదేహాన్ని వారి కుటుంబసభ్యులకు ఇవ్వగా, వారు అతని బాడీని తమ వెంట తీసుకువెళ్ళడానికి నిరాకరించారు. దీంతో పోలీసులు చేవెళ్ల మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి స్థానిక స్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తిచేశారు.

బాబా వేషంలో రౌడీషీటర్
TG: 2018 హైదరాబాద్ నగరం సైఫాబాద్ హత్య కేసుకు సంబంధించి పరారీలో ఉన్న నిందితుడు, రౌడీషీటర్ మహ్మద్ జావేద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కళ్లు కప్పేందుకు అతను సంగారెడ్డి జిల్లా చేర్యాలలోని ఓ దర్గాలో బాబా అవతారమెత్తాడు. ఖైరతాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతడిని పట్టుకున్నారు. నిందితుడి నుంచి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ పరీక్షల్లో అతడు గంజాయి తాగినట్టు నిర్ధారణ కావడంతో సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు.

విదేశీ విద్యార్థుల తొలి ఎంపికగా భారత్
విదేశీ విద్యార్థుల తొలి ఎంపికగా భారత్ మారుతోంది. భారత్‌కు ఉన్నత విద్య కోసం వచ్చే విదేశీ విద్యార్థుల్లో నేపాల్ (24.1%) తొలి స్థానంలో నిలిచింది. తర్వాత యూఏఈ (7%), అమెరికా (5.9%), బంగ్లాదేశ్ (5.9%), నైజీరియా (5.7%), జింబాబ్వే(4%) దేశాలు ఉన్నాయి. ఫారిన్ విద్యార్థులకు భారత్ ‘ఎడ్యుకేషన్ డెస్టినేషన్’గా మారుతున్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి.

పోక్సో నిబంధనలు దుర్వినియోగం: సుప్రీం
దిల్లీ వరుస ప్రేమ వ్యవహారాల్లో నమోదవుతున్న పోక్సో కేసులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రేమ జంటలను విడదీయడానికి కొందరు తల్లిదండ్రులు పోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొంది. బాధితుల వయసు, పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పోలీసులు కేసులు నమోదు చేయాలని సూచించింది. ఇలాంటి కేసుల్లో విచారణ సమయంలో నిజాలను నిష్పక్షపాతంగా పరిశీలించాలని స్పష్టం చేసింది. ఈ చర్యలు యువత భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అభిప్రాయపడింది.
బస్సులో అలా..భరతం పట్టిన యువతి
మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాలో ఆగివున్న బస్సులో ఒక వ్యక్తి తోటి మహిళా ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ యువతి ఆ వ్యక్తి చెంపచెళ్లుమనిపించి, చెప్పుతో చితకబాదింది. ఈ ఘటన సీసీ టీవీలో రికార్డయింది. నిందితుడు నితీష్‌గా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితురాలి నుంచి ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.

ఇంట్లోనే లంచం.. గుమ్మం వద్దే ACB
TG: పెద్దపల్లి మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ సతీష్ ACBకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. మున్సిపల్ పరిధిలో జరిగిన పనుల బిల్లును విడుదల చేయడానికి కాంట్రాక్టర్ బత్తుల శ్రీను నుంచి రూ. 2 లక్షల లంచం డిమాండ్ చేశాడు. తన ఇంట్లోనే డబ్బులు తీసుకుంటున్న AEని ACB అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కరీంనగర్ ఏసీబీ DSP మహేందర్ రెడ్డి తెలిపారు.

పాఠశాలలో ఫుడ్ పాయిజన్
TG: రాష్ట్రంలో ఫడ్ పాయిజన్ ఘటనలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వరంగల్ జిల్లా మామునూరులోని జ్యోతిబాపూలే పాఠశాలలో ఉదయం టిఫిన్ తిని 18 మంది విద్యార్థులు వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల సిబ్బంది వెంటనే విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని పాఠశాల ప్రిన్సిపల్ వై.మనోహర్ రెడ్డి తెలిపారు. ఫుడ్ పాయిజన్ కావడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

'లార్డ్స్' ఎందుకంత ప్రత్యేకం?
1814లో స్థాపించిన ‘లార్డ్స్’ ప్రపంచ క్రికెట్‌లో చారిత్రక మైదానంగా గుర్తింపు పొందింది. ఇది ఇంగ్లండ్‌లో ఉంది. దీన్ని 'క్రికెట్‌కు మక్కా'గా పిలుస్తారు. అనేక చారిత్రక టెస్టులు, ప్రపంచకప్ ఫైనల్స్‌కు ఆతిథ్యం ఇచ్చిన వేదిక ఇది. సెంచరీ లేదా ఐదు వికెట్లు సాధించిన క్రికెటర్ల పేర్లను ఆనర్స్ బోర్డులో నమోదు చేయడం ఇక్కడి ట్రెడిషన్. అందుకే లార్డ్స్‌లో ఆడడం ప్రతి క్రికెటర్ తన జీవితకాల గౌరవంగా భావిస్తారు.

RK బీచ్ వద్ద యువతి ఆత్మహత్యాయత్నం
AP: విశాఖపట్నం RK బీచ్ రోడ్డులో ఓ యువతి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకోవడంతో క్షణాల్లో మంటలు పెద్దఎత్తున వ్యాపించాయి. యువతి గట్టిగా కేకలు వేస్తూ రోడ్డుపైకి పరుగెత్తింది. స్థానికులు, అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో ఆమె చేతులు, ముఖం, తల భాగం తీవ్రంగా కాలిపోయాయని పోలీసులు తెలిపారు. KGHకు తరలించారు. ఆమె పరిస్థితి సీరియస్‌గా ఉందని డాక్టర్స్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

CM హెడ్‌లైన్స్ కోసమే మాట్లాడుతున్నారు
TG: CM రేవంత్ రెడ్డి నీచమైన బాషను పక్కనపెట్టి సాగునీరు, తాగు నీరు అందించే చర్యలు తీసుకోవాలని బీజేపీ MP ఈటల రాజేందర్ ఫైరయ్యారు. కనీస అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని విమర్శించారు. హరీష్ రావు, KCR, KTR ఉన్న ఖిలాడీ కమిటీలో ఈటల చేరారని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి హెడ్ లైన్స్ కోసం మాట్లాడే వ్యక్తి అని, చిత్తశుద్ధి ఉంటే వెంటనే పంటపొలాలకు నీళ్లు అందించాలన్నారు. BRS హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగితే వారిపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదన్నారు.

చిన్నారులను చంపి తల్లి ఆత్మహత్య
AP: ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా వినుకొండ రూరల్ మండలం విఠంరాజుపల్లిలో చోటుచేసుకుంది. గ్రామంలోని భారతి అనే మహిళ తన పిల్లలిద్దరినీ చంపి, తాను ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో "నా చావుకు ఎవరూ కారణం కాదు" అని భారతి రాసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.