Latest

లైసెన్స్‌కు ముందు 3 గం. వీడియో క్లాసులు తప్పనిసరి
TG: డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారికి రాష్ట్రంలో కొత్త రూల్ రాబోతోంది. పర్మినెంట్ లైసెన్స్‌కు అప్లై చేసుకున్నవారు ముందుగా 3 గం. వీడియో లెసన్స్ చూడాలి. రోడ్డు సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్‌పై అవేర్‌నెస్ కల్పించడమే దీని టార్గెట్. వీడియో క్లాసులు కంప్లీట్ చేసినవారినే ట్రాక్ టెస్ట్‌కు అనుమతిస్తారు. ట్రాక్ టెస్ట్‌లో పాస్ అయితేనే లైసెన్స్ ఇస్తారు. ప్రస్తుతం ఈ సిస్టమ్‌ను కూకట్‌పల్లి RTAలో ట్రయల్ బేసిస్‌లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సక్సెస్ అయితే అన్ని జోనల్ ఆఫీసుల్లోనూ అమలు చేయనున్నారు.

ట్రాక్టర్ డ్రైవర్.. విద్యుత్ టవర్‌కు ఉరి!
పోలవరం జిల్లా చింతూరులో శనివారం విషాదం చోటుచేసుకుంది. చట్టికి చెందిన సోడే రాజ్ కుమార్ (ట్రాక్టర్ డ్రైవర్) శుక్రవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి – శనివారం శబరి నది పక్కన ఉన్న విద్యుత్ టవర్ వరకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గాలించగా ఆ స్థితిలో కనిపించాడు. వివాహేతర సంబంధం, కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (గమనిక :- NCRB 2022 నివేదిక ప్రకారం, మొత్తం 1.71లక్షల ఆత్మహత్యల్లో 10.2% ప్రేమ వివాహేతర సంబంధాలవల్ల జరిగాయి.)

అభివృద్ధితో పాటు పచ్చదనం కావాలి
AP: గుంటూరు జిల్లా ఇన్నర్ రింగ్‌రోడ్డులో డ్రెయిన్ నిర్మాణం కోసం ఇప్పటికే నాటిన మొక్కలను తొలగించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పచ్చదనం పెంపు కార్యక్రమాల్లో భాగంగా ఒక్కో మొక్కకు రూ.1,000 నుంచి రూ.1,200 వరకు ప్రజాధనం ఖర్చు చేస్తున్న సమయంలో, నిర్మాణ పనుల పేరుతో వాటిని తొలగించడం పర్యావరణానికి, ప్రభుత్వ నిధులకు నష్టం కలిగించడమేనని విమర్శిస్తున్నారు. ముందస్తు ప్రణాళికతో డ్రెయిన్ పనులు చేపట్టి ఉంటే మొక్కలను కాపాడే అవకాశం ఉండేదని పేర్కొన్నారు.

దాచేపల్లి అంజుమన్ కమిటీలో కొత్త సభ్యుడు.. నాగుల్ ఎంపిక
AP: పల్నాడు జిల్లా దాచేపల్లి మండల అంజుమన్ ఇస్లామియా కమిటీలో షేక్ నాగుల్ కొత్త సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. కమిటీలో సుదీర్ఘకాలం సేవలందించిన స్వర్గీయ తొండ మహబూబ్ స్థానంలో ఆయనను నియమించారు. గత 50 ఏళ్లకు పైగా దాచేపల్లి మండలం, పరిసర ప్రాంతాల ప్రజల సమస్యల పరిష్కారానికి అంజుమన్ ఇస్లామియా కమిటీ సేవలందిస్తోందని ప్రతినిధులు తెలిపారు. మహబూబ్ కుటుంబానికి చెందిన నాగుల్ కు కమిటీలో స్థానం కల్పించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.

తెలుగు వెలుగును చాటిన భాషా దినోత్సవం
నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు ఉపాధ్యాయుడు సురేందర్ మాట్లాడుతూ.. తెలుగు భాష గొప్పతనాన్ని, సాహిత్య వైభవాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. మాతృభాష పరిరక్షణకు విద్యార్థులు కృషి చేయాలని సూచించారు. తెలుగు భాషను నిత్య జీవితంలో విరివిగా ఉపయోగిస్తూ భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మోడల్ మార్కెట్ కు మోక్షం ఎప్పుడు..?
TG: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో 2020లో ప్రారంభమైన మోడల్ మార్కెట్ నిర్మాణం నేటికీ పూర్తికాకపోవడంతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూరగాయలు, మాంసం, పండ్ల విక్రయాలను ఒకే చోట నిర్వహించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం మార్కెట్ నిర్మాణాన్ని ప్రారంభించింది. ప్రభుత్వం మారిన తర్వాత పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దీంతో వ్యాపారులు రోడ్లపైనే కూరగాయలు, మాంసం విక్రయిస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. వినియోగదారులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

నేడు 'తెలుగు' భాషా దినోత్సవం.. గిడుగు రామమూర్తి జయంతి
నేడు తెలుగు భాషా దినోత్సవం. గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా ఈ రోజును జరుపుకుంటున్నారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. వ్యవహారిక భాషా ఉద్యమానికి గిడుగు రామమూర్తి బలమైన పునాది వేశారు. ప్రజలు మాట్లాడే భాషలోనే విద్య, రచనలు ఉండాలని ఆయన కోరుకున్నారు. సులభమైన తెలుగును ప్రజలకు దగ్గర చేయడంలో కీలక పాత్ర పోషించారు. తెలుగు భాష అభివృద్ధికి ఆయన చేసిన కృషి నేటికీ స్ఫూర్తిదాయకం. ఈ సందర్భంగా తెలుగు భాషను కాపాడుకుందాం. కొత్త తరానికి తెలుగును మరింత దగ్గర చేద్దాం.

నీటి వనరుల అభివృద్ధికి శ్రీకారం
AP: పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలో గిరిజన కుటుంబాల అభివృద్ధికి సమగ్ర కార్యక్రమం ప్రారంభమైంది. నాబార్డ్ సహకారంతో విద్యా ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో నల్లరాయిగూడ పంచాయతీలో 200 పీవీటీజీ కుటుంబాలకు తోటల పెంపకం, నీటి వనరుల అభివృద్ధి పనులను నాబార్డ్ ఏపీ ప్రాంతీయ కార్యాలయ అధికారి సోమైందర్ సింగ్ ప్రారంభించారు. విద్యా ఫౌండేషన్స్ అధ్యక్షులు ప్రసాద్ ఉదండరావు మాట్లాడుతూ తివ్వకొండపై ఆరు పెర్కొలేషన్ ట్యాంకులు, రెండు ఫార్మ్ పాండ్లు నిర్మించి మొక్కలకు నీటి సదుపాయం కల్పిస్తామని తెలిపారు.

సెప్టెంబర్ 1 నుంచి మారనున్న Important రూల్స్
సెప్టెంబర్ 1 నుంచి కొన్ని కీలక మార్పులు, డెడ్‌లైన్లు అమల్లోకి రానున్నాయి. LPG వాడేవారు e-KYCని ఆగస్ట్ 31లోపు పూర్తి చేయాలి. LPG ధరల్లోనూ మంత్లీ రివ్యూ తర్వాత చేంజెస్ ఉండొచ్చు. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌లో జర్నీ చేసే వారికి సెప్టెంబర్ 1 నుంచి ఇమ్మిగ్రేషన్ వద్ద బోర్డింగ్ పాస్‌పై స్టాంప్ అవసరం లేదు. ఇక రూ.3 కోట్లు, అంతకంటే ఎక్కువ బల్క్ FDలపై కొత్త వడ్డీ రేట్ల డిస్క్లోజర్ రూల్స్ సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ITR ఫైలింగ్‌కు ఆగస్ట్ 31 చివరి తేదీ.

ప్రజల సమస్యలు తెలుసుకున్న పోలీస్ ఇన్‌స్పెక్టర్
AP: చిత్తూరు జిల్లా పలమనేరు అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె. మోహన్‌రెడ్డి పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా గడ్డూరు కాలనీని సందర్శించి గ్రామస్థుల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. స్థానికులతో మాట్లాడి వారి ఇబ్బందులు, అవసరాలపై ఆరా తీశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు. గొడవలు, వివాదాలు, ప్రలోభాలకు దూరంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొనాలని కోరారు.

ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తికి తీవ్రగాయాలు
TG: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ బస్టాండ్ సమీపంలో ఆర్టీసీ బస్సు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో అతడి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న నస్పూర్ 108 సిబ్బంది ఈఎంటీ లక్ష్మయ్య, పైలెట్ సత్తయ్య వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడికి అక్కడే ప్రథమ చికిత్స అందించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Train ఫుట్‌బోర్డ్‌పై జర్నీ చేస్తున్నారా? ఇక జాగ్రత్త!
Train జర్నీలో ఫుట్‌బోర్డ్‌పై కూర్చోవడం, డోర్ దగ్గర నిలబడటం సేఫ్ కాదని సౌత్ సెంట్రల్ రైల్వే అలర్ట్ చేసింది. ఇలా జర్నీ చేయడం డేంజర్‌తో పాటు Railway Act, 1989 ప్రకారం నేరమని తెలిపింది. ఫుట్‌బోర్డింగ్ చేస్తే మూడు నెలల వరకు జైలు, రూ.500 వరకు ఫైన్ లేదా రెండూ విధించే అవకాశముంది. రైల్వే స్టాఫ్ ప్యాసింజర్‌ను ట్రైన్ నుంచి దింపే అధికారం కూడా ఉంది. కాబట్టి సేఫ్ జర్నీ కోసం డోర్ దగ్గర నిలబడకుండా, ఫుట్‌బోర్డ్‌పై కూర్చోకుండా జర్నీ చేయాలని తెలిపింది.

ఇంటి తాళం పగలగొట్టి బంగారం చోరీ
TG: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం పాత వరిపేటలో దొంగలు ఇంటి తాళం పగలగొట్టి 7.5 గ్రాముల బంగారం చోరీ చేశారు. గ్రామానికి చెందిన రాజు ఈ నెల 26న కుటుంబ సభ్యులతో కలిసి జైపూర్‌లో జరిగిన శుభకార్యానికి వెళ్లారు. శుక్రవారం ఇంటికి తిరిగి వచ్చేసరికి తలుపు తాళం పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లోని బీరువాను పరిశీలించగా అందులో ఉంచిన 7.5 గ్రాముల బంగారం కనిపించలేదు. దీంతో రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న నేతలు
AP: కోనసీమ జిల్లా రాజోలు ప్రభుత్వ ఎస్సీ బాలుర హాస్టల్‌లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను రాజోలు నియోజకవర్గ SC సంక్షేమ సంఘం నాయకులు పరిశీలించారు. తాత్కాలిక హాస్టల్‌లో విద్యార్థుల వసతి పరిస్థితులు, ఇబ్బందులు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాలకు చెందిన 54 మంది విద్యార్థులు హాస్టల్‌లో ఉంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నూతన హాస్టల్ భవనం నిర్మించేలా కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు. అప్పటివరకు విద్యార్థులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు.

ఉర్దూ కోర్సుల పునఃప్రారంభానికి చర్యలు
AP: ఉర్దూ మాధ్యమ విద్యార్థులకు ఉన్నత విద్యలో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు దూరవిద్యా కోర్సులను పునఃప్రారంభించనున్నట్లు బిఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ విజయభాస్కర్ రావు హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా RUTA AP ప్రతినిధులు వీసీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉర్దూ మాధ్యమ దూరవిద్యా కోర్సులను తిరిగి ప్రారంభించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన వీసీ, ఈ డిసెంబర్ నుంచే కోర్సులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీసీ హామీపై RUTA AP ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర ప్రమాదం
TG: ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. వేంసూరు మండలం సమీపంలో జరిగిన ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమై నుజ్జునుజ్జయింది. వాహన భాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ హైవేపై వరుస ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కార్లు, ఆటోలు ఉన్నవారికి షాక్.. పెరిగిన CNG ధర
CNG వెహికల్స్ వాడే వారికి బ్యాడ్ న్యూస్. ఈరోజు నుంచి దిల్లీ-NCRతో పాటు కొన్ని ప్రాంతాల్లో CNG ధరలు పెరిగాయి. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) కిలోకు రూ.3.89 పెంచింది. దీంతో దిల్లీలో CNG ధర రూ.86.98/kgకు చేరింది. ఇంపోర్ట్ చేసుకునే LNG ఖర్చులు భారీగా పెరగడంతో ఈ రేట్లు పెంచినట్లు IGL తెలిపింది. CNG రేట్లు పెరగడంతో ఆటోలు, క్యాబ్స్, వంటి CNG వెహికల్స్ జర్నీ కాస్ట్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది.

BRAOUలో AI బేస్డ్ ఎడ్యుకేషన్‌కు బిగ్ బూస్ట్
TG: నిన్న హైదరాబాద్‌లో <a href="https://opvarsity-news.blogspot.com/2026/08/ai-based-education-is-more-learner.html#more">BRAOU</a> 45th ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. యూనివర్సిటీ ఇకపై డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌కే పరిమితం కాకుండా డిజిటల్, ఆన్‌లైన్ యూనివర్సిటీగా మారనుందని VC ప్రొ. ఘంటా చక్రపాణి తెలిపారు. AI బేస్డ్ ఎడ్యుకేషన్‌తో స్టూడెంట్స్ తమకు నచ్చిన టైమ్, స్పీడ్, లాంగ్వేజ్‌లో నేర్చుకోవచ్చని CEMCA డైరెక్టర్ డా. బి. శద్రాచ్ అన్నారు. త్వరలో BRAOUలో ఫారిన్ లాంగ్వేజెస్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు ‘AI for Teachers’ కోర్సుతో Govt. టీచర్లకు ట్రైనింగ్ ఇస్తున్నారు.

వీడియో వివాదం.. మస్లీస్ పార్టీ MLCపై యాక్షన్!
TG: మస్లీస్ పార్టీ MLC మిర్జా రహ్మత్ బేగ్‌పై పార్టీ యాక్షన్ తీసుకుంది. వైరల్ వీడియో కాంట్రవర్సీపై ఆయనను పార్టీ నుంచి వెంటనే పార్టీ నుంచి ఔట్ చేసింది. అలాగే MLC పదవికి రాజీనామా చేయాలని ఆదేశించింది. మరోవైపు తనను కొందరు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ MLC బేగ్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది. వీడియోలో అసలు ఏముందనే వివరాలను పోలీసులు, AIMIM క్లారిటీ ఇవ్వలేదు. దీంతో సోషల్ మీడియాలో ఈ అంశంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
విశాఖలో దారుణం.. ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి
AP: విశాఖపట్నం జిల్లాలో దారుణ ఘటన జరిగింది. పెందుర్తి మండలం చింతలగ్రహారం కాలనీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు చనిపోయారు. మల్లా వినోద్‌కుమార్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఈ ఘటనలో సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానికుల ఇన్ఫర్మేషన్‌తో పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. ఇద్దరిపిల్లలకు విషం ఇచ్చి, తరువాత భార్యాభర్తలు ఉరివేసున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక తెలిసే అవకాశం ఉంది.

తాగునీటికి ఇబ్బందులు రావొద్దు: కలెక్టర్
TG: ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. చెన్నూర్ పట్టణంలో అమృత్ పథకం కింద చేపట్టిన నీటి ట్యాంక్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ట్యాంక్ నిర్మాణంతోపాటు పైపులైన్ పనులను వేగవంతం చేసి నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.