Latest

స్టాక్ మార్కెట్ లో  ఈ షేరు దుమ్ము రేపుతుంది బాసు!
Business· 20 Jun 2026

స్టాక్ మార్కెట్ లో ఈ షేరు దుమ్ము రేపుతుంది బాసు!

రైల్వే రక్షణ వ్యవస్థ 'కవచ్' సెగ్మెంట్‌లో దుమ్మురేపుతున్న మల్టీబ్యాగర్ స్టాక్ Kernex Microsystems ప్రస్తుతం కాస్త నెమ్మదించింది. గత 3 నెలల్లో ఏకంగా 110% పైగా లాభాలతో ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన ఈ షేరు, రీసెంట్‌గా ప్రాఫిట్ బుకింగ్ (లాభాల స్వీకరణ) వల్ల 4% పైగా క్షీణించింది. ట్రెండ్ చూస్తే.. కేవలం నెల రోజుల్లోనే ఈ స్టాక్ 50% పెరిగి సెన్సెక్స్‌ను సైతం అవుట్‌పర్ఫామ్ చేసింది. సౌత్ ఇండియాలో 548 కిలోమీటర్ల మేర 'కవచ్ 4.0' సిస్టమ్‌ను విస్తరించాలని రైల్వే శాఖ భారీ ప్లాన్ చేస్తుండటంతో, రాబోయే రోజుల్లో ఈ స్టాక్‌లో మరిన్ని కదలికలు ఉండొచ్చని మార్కెట్ వర్గాల అంచనా!

హనుమాన్ టెంపుల్‌లో ఊహించని ప్రమాదం!▶
News· 20 Jun 2026

హనుమాన్ టెంపుల్‌లో ఊహించని ప్రమాదం!

మహారాష్ట్ర పర్బానీలోని యశ్వాడి అనే ఊరిలో ఒక ఘోర ప్రమాదం జరిగింది. అక్కడ ఉన్న హనుమాన్ టెంపుల్ మండపం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన టైమ్ లో అక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు. మండపం కూలిపోవడంతో ఆ శిథిలాల కింద దాదాపు 30 మంది వరకు చిక్కుకుపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకుని, లోపల ఉన్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రెజెంట్ అక్కడ ఫుల్ టెన్షన్ వాతావరణం నెలకొంది.

ప్రపంచంలోనే బెస్ట్ లీడర్ మోదీ: ట్రంప్▶
World· 20 Jun 2026

ప్రపంచంలోనే బెస్ట్ లీడర్ మోదీ: ట్రంప్

అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో ఇండియా ప్రధాని నరేంద్ర మోదీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రపంచంలోనే ఇద్దరు గొప్ప లీడర్స్ ఎవరని ఒక జర్నలిస్ట్ అడగ్గా. అందులో ఒకరు చైనా ప్రెసిడెంట్ షీ జిన్‌పింగ్ కాగా, ఇంకొకరు ఇండియా ప్రధాని మోదీ అని ట్రంప్ చెప్పారు. మోదీ చాలా మంచి లీడర్ అని, ఇండియా నంబర్స్ కూడా చాలా బాగున్నాయని పొగిడారు. మోదీ యుద్ధాలకు దూరంగా ఉంటారని, అది చాలా స్మార్ట్ డెసిషన్ అని ట్రంప్ ప్రశంసించారు. ఇండియా ప్రపంచంలోనే చాలా పెద్ద దేశం అంటూ ట్రంప్ మోదీని పొగిడారు.

88 ఏళ్ల పర్సన్ కు ట్రంప్ పర్సనల్ సపోర్ట్!▶
World· 20 Jun 2026

88 ఏళ్ల పర్సన్ కు ట్రంప్ పర్సనల్ సపోర్ట్!

అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లో ఒక ఇన్‌స్పైరింగ్ అవార్డు ప్రెజెంటేషన్ చేశారు. 88 ఏళ్ల రిటైర్డ్ US మెరైన్ జేమ్స్ కేపర్స్ జూనియర్ దేశానికి చేసిన సేవలను గుర్తిస్తూ, ట్రంప్ ఆయనకు స్వయంగా అమెరికా అత్యున్నత సైనిక పురస్కారం 'మెడల్ ఆఫ్ ఆనర్' (Medal of Honor) ఇచ్చి గౌరవించారు. జేమ్స్ కేపర్స్ జూనియర్‌కు ట్రంప్ పర్సనల్‌గా సపోర్ట్ చేస్తూ ఈ బిగ్గెస్ట్ అవార్డును ప్రెసెంట్ చేయడం నిజంగా ఒక అద్భుతమైన మూమెంట్.

ఈ దేశంలో ఇలా పాట పాడితే 74 కొరడా దెబ్బలు?
Viral· 20 Jun 2026

ఈ దేశంలో ఇలా పాట పాడితే 74 కొరడా దెబ్బలు?

ఇరాన్‌లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. పరాస్తో అహ్మదీ అనే మహిళ హిజాబ్ (బురఖా) లేకుండా, స్లీవ్‌లెస్ బట్టలు వేసుకుని యూట్యూబ్ లైవ్‌లో సాంగ్స్ పాడింది. దీంతో అక్కడి కోర్టు ఆమెకు ఏకంగా 74 కొరడా దెబ్బల శిక్ష వేసింది. అంతేకాదు రెండేళ్ల పాటు దేశం దాటి వెళ్లకూడదని, ఎలాంటి మ్యూజిక్ ప్రోగ్రామ్స్ చేయకూడదని రూల్ పెట్టింది. 2025లో ఇరాన్ తెచ్చిన కొత్త రూల్స్ ప్రకారం 12 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా హిజాబ్ వేసుకోవాలి, లేదంటే జైలు శిక్ష పక్కా. ఈ వింత రూల్స్, కఠిన శిక్షలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.

పెళ్లి చేసుకున్న ఇద్దరు మగాళ్లు!
Viral· 20 Jun 2026

పెళ్లి చేసుకున్న ఇద్దరు మగాళ్లు!

ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా గంహారియా గ్రామంలో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వర్షాలు అస్సలు పడకపోవడంతో ఊరి పెద్దలు ఒక వింత పాత సంప్రదాయాన్ని మళ్లీ ఫాలో అయ్యారు. ఊరిలో వర్షాలు పడాలంటే ‘అందిర బిబాహ’ (మగాళ్ల పెళ్లి) చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా జతిన్ (29), కలాండి (27) అనే ఇద్దరు మగాళ్లకు గుడిలో గ్రాండ్‌గా పెళ్లి చేశారు. సంప్రదాయం ప్రకారం ఈ జంట ఒక రోజంతా భార్యాభర్తలుగా కలిసి ఉండి, ఆ తర్వాత ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. ఇలా చేస్తే వర్షాలు పడతాయని గ్రామస్తుల గట్టి నమ్మకం. ప్రస్తుతం ఈ వింత పెళ్లి ఫోటోస్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

సాయి కృష్ణ లాకప్ డెత్.. హోమ్ మినిస్టర్ అనిత రిజైన్ చేయాల్సిందే!▶
Crime· 20 Jun 2026

సాయి కృష్ణ లాకప్ డెత్.. హోమ్ మినిస్టర్ అనిత రిజైన్ చేయాల్సిందే!

సాయి కృష్ణ లాకప్ డెత్ ఇష్యూ ఇప్పుడు AP పాలిటిక్స్‌లో ఫుల్ హీట్ పెంచేసింది. దీనికి బాధ్యత వహిస్తూ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత వెంటనే తన పోస్ట్‌కి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో YCP లీడర్స్, కార్యకర్తలు భారీ ఆందోళన చేపట్టారు. గవర్నమెంట్ కేర్‌లెస్‌ వల్లే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయంటూ ఫుల్ ఫైర్ అయ్యారు. సాయి కృష్ణ ఫ్యామిలీకి న్యాయం జరిగే వరకు వదిలేదే లేదని, అనిత రిజైన్ చేయాల్సిందేనంటూ స్లోగన్స్‌తో తిరుపతిని హోరెత్తించారు. ప్రస్తుతం ఈ ప్రొటెస్ట్ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

NEET స్టూడెంట్స్ లైఫ్ తో ఆడుకుంటున్న అధికారులు!
Education· 20 Jun 2026

NEET స్టూడెంట్స్ లైఫ్ తో ఆడుకుంటున్న అధికారులు!

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) చేసిన ఇంకో పెద్ద మిస్టేక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నాగ్‌పూర్‌కు చెందిన ఒక స్టూడెంట్‌కు ఏకంగా అబుదాబిలో నీట్ (NEET) ఎగ్జామ్ సెంటర్ పడింది. దీనిపై ఆ స్టూడెంట్ NTA అధికారులకు కంప్లైంట్ చేయడంతో, వాళ్లు తప్పు తెలుసుకుని కరెక్ట్ అడ్రస్‌తో కొత్త అడ్మిట్ కార్డ్ ఇచ్చారు. ఆల్రెడీ ఎన్నో తప్పులు చేస్తూ, వందలాది మంది స్టూడెంట్స్ లైఫ్‌తో ఆడుకుంటున్న సెంట్రల్ గవర్నమెంట్. ప్రతి విషయంలో ఇలాగే ఫుల్ కేర్‌లెస్‌గా ఉంటోందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.

ACB హిస్టరీలోనే బిగ్గెస్ట్ క్యాష్ సీజ్..
Politics· 20 Jun 2026

ACB హిస్టరీలోనే బిగ్గెస్ట్ క్యాష్ సీజ్..

ల్యాండ్ అండ్ మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ACB జరిపిన రైడ్స్‌లో కళ్ళు చెదిరే నిజాలు బయటపడ్డాయి. ఆల్రెడీ అతని ఇంటి బెడ్ కింద, వేరే ప్లేస్‌లలో కోటి రూపాయలు దొరకగా. తాజాగా ఓపెన్ చేసిన బ్యాంక్ లాకర్లలో ఇంకో కోటి క్యాష్ దొరికింది. అంతేకాదు, అతని బ్యాంక్ అకౌంట్లలో ఉన్న రూ.5 కోట్ల మనీని కూడా అధికారులు సీజ్ చేశారు. ACB హిస్టరీలోనే ఇది బిగ్గెస్ట్ క్యాష్ సీజ్ అని, ఇంకా ఓపెన్ చేయాల్సిన రెండు లాకర్లలో ఇంకెంత మనీ ఉందోనని అధికారులు షాక్‌లో ఉన్నారు.

ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసన!▶
Politics· 20 Jun 2026

ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసన!

ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసన చేపట్టింది. 'థాలీ బజావో' (ప్లేట్లు వాయించడం) ప్రోగ్రామ్‌తో అక్కడ ఫుల్ హంగామా చేశారు. "వెయ్యి గొంతుకల ఒకే డిమాండ్.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి" అంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా గట్టిగా నినాదాలు చేశారు. అలాగే రీసెంట్‌గా ఆత్మహత్యలకు పాల్పడ్డ స్టూడెంట్స్ ఫ్యామిలీస్‌కి కోటి రూపాయల చొప్పున కాంపెన్సేషన్ ఇవ్వాలని పట్టుబట్టారు.

యోగా ఈవెంట్‌లో నవీన్ పొలిశెట్టి కామెడీ!▶
Entertainment· 20 Jun 2026

యోగా ఈవెంట్‌లో నవీన్ పొలిశెట్టి కామెడీ!

ఇంటర్నేషనల్ యోగా డే ఈవెంట్ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో గ్రాండ్‌గా జరిగింది. హీరో నవీన్ పొలిశెట్టి కూడా ఈ ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేశారు. అందరితో కలిసి యోగాసనాలు వేస్తూనే, తన మార్క్ కామెడీతో నవీన్ అక్కడ ఫుల్ ఫన్ క్రియేట్ చేశారు. సీరియస్‌గా యోగా చేయాల్సిన చోట కూడా నవీన్ వింతగా ఆసనాలు వేయడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. "నేను యోగా రెగ్యులర్ గా చేస్తాను, యూత్ అంతా యోగా చేయాలి" అని నవీన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఇంటర్నేషనల్ యోగా డే.. బ్యూటిఫుల్ విజువల్స్!▶
Motivational· 20 Jun 2026

ఇంటర్నేషనల్ యోగా డే.. బ్యూటిఫుల్ విజువల్స్!

ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా గుంటూరు జిల్లాలోని హిస్టారికల్ ఉండవల్లి గుహల్లో స్పెషల్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్ పాల్గొన్నారు. బాబా అక్కడ యోగాసనాలు వేశారు. చారిత్రాత్మకమైన ఉండవల్లి గుహల బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన ఈ యోగా వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

కుంభమేళా గర్ల్ మోనాలిసాకు ప్రాణభయం..
Viral· 20 Jun 2026

కుంభమేళా గర్ల్ మోనాలిసాకు ప్రాణభయం..

'కుంభమేళా గర్ల్' మోనాలిసా, ఆమె భర్త మొహమ్మద్ ఫర్మాన్‌కు ప్రొటెక్షన్ ఇవ్వాలని కేరళ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఆన్‌లైన్ లవ్‌తో వీరిద్దరూ కేరళలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోగా, మోనాలిసా మైనర్ అంటూ ఆమె తండ్రి మధ్యప్రదేశ్‌లో కిడ్నాప్ కేసు పెట్టారు. దీంతో భర్త అరెస్ట్‌పై కేరళ హైకోర్టు స్టే ఇచ్చింది. మతాంతర వివాహం వల్ల తమ ఫ్యామిలీస్ నుండి ప్రాణాలకు ముప్పు ఉందని ఈ కపుల్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, జులై 10న జరిగే నెక్స్ట్ హియరింగ్ వరకు వీరికి సేఫ్టీ కల్పించాలని కోర్టు ఆర్డర్ వేసింది.

తాళాలు అవసరం లేదు.. కారు వైపు చూస్తే చాలు లాక్ ఓపెన్!▶
Politics· 20 Jun 2026

తాళాలు అవసరం లేదు.. కారు వైపు చూస్తే చాలు లాక్ ఓపెన్!

మెర్సిడెస్ బెంజ్ తన కొత్త ఎలక్ట్రిక్ కారులో ఒక అదిరిపోయే ఫ్యూచరిస్టిక్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇకపై ఈ కారును ఓపెన్ చేయడానికి ఎలాంటి తాళాలు (keys) అవసరం లేదు. కేవలం మన ఫేస్ రికగ్నిషన్ ద్వారా, అంటే కారు వైపు చూస్తే చాలు దానంతట అదే డోర్స్ తెరుచుకుంటుంది. మన స్మార్ట్‌ఫోన్స్‌లో ఉండే ఫేస్ లాక్ లాగే ఈ కార్ టెక్నాలజీ కూడా పనిచేస్తుంది. కార్ల హిస్టరీలోనే ఇదొక నెక్స్ట్ లెవెల్ అప్‌డేట్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కార్ ఫీచర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

బండి భగీరథ్‌‌కు తాత్కాలిక బెయిల్‌ మంజూరు
TG· 20 Jun 2026

బండి భగీరథ్‌‌కు తాత్కాలిక బెయిల్‌ మంజూరు

TG: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌‌కు తాత్కాలిక బెయిల్‌ మంజూరైంది. పోక్సో కేసులో అరెస్ట్ అయి నెల రోజులకు పైగా జైల్లో ఉన్న భగీరథ్‌కు మేడ్చల్ మల్కాజ్‌గిరి కోర్ట్ వారం రోజులపాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. తమ కూతురిని భగీరథ్ లైంగికంగా వేధించాడని మే 8వ తేదీన బాలిక తల్లి హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో మే 16న అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

KTR దమ్ముంటే ఆ పనిచేయాలి: మైనంపల్లి
Politics· 20 Jun 2026

KTR దమ్ముంటే ఆ పనిచేయాలి: మైనంపల్లి

TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR దమ్ముంటే మల్కాజిగిరికి వచ్చి పోటీ చేయాలని కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు సవాల్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలపై, తమపై ఇష్టానుసారం మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. ఇకపై దాడికి ప్రతిదాడి తప్పకుండా చేస్తామని.. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని, BRS నేతలకు సినిమా చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు చూపిస్తే శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తానని మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అల్లు అర్జున్ స్పెషల్ వీడియో కాల్.. ఆ చిన్నారి ఎవరంటే?▶
Motivational· 20 Jun 2026

అల్లు అర్జున్ స్పెషల్ వీడియో కాల్.. ఆ చిన్నారి ఎవరంటే?

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శ్రద్ధ అనే చిన్నారి, అల్లు అర్జున్‌తో మాట్లాడాలని ఆశపడింది. ఈ విషయం తెలుసుకున్న ఒక NGO టీమ్ ఆయనను కాంటాక్ట్ చేయగా, బన్నీ వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఆ చిన్నారికి వీడియో కాల్ చేసి స్పెషల్‌గా మాట్లాడారు. ఎంతో ప్రేమతో పలకరిస్తూ ఆ పాప ఫేస్‌లో హ్యాపీనెస్ తెచ్చారు. చిన్నారి కోరికను తీర్చి, ధైర్యం చెప్పిన బన్నీ తన మంచి మనసు చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో కాల్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తండ్రికి ఫోన్‌ చేసి.. గోదావరిలో దూకిన కానిస్టేబుల్
Crime· 20 Jun 2026

తండ్రికి ఫోన్‌ చేసి.. గోదావరిలో దూకిన కానిస్టేబుల్

AP: తూర్పుగోదావరి జిల్లా శ్రీరాంపురానికి చెందిన చంద్రమళ్ల వంశీ(31) కాకినాడ APSP మూడో బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వంశీకి కుటుంబసభ్యులు పెళ్లి సంబంధం చూసి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశారు. అప్పటికే పరిచయం ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్‌, రాజమహేంద్రవరం మహిళా PSలో వంశీపై ఫిర్యాదు చేశారు. పోలీసులు పలుమార్లు వంశీని స్టేషన్‌కు పిలిపించి విచారించారు. వంశీ తన తండ్రికి ఫోన్‌ చేసి తాను గోదావరి నదిలోకి దూకుతున్నట్లు చెప్పి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఆడవారు మీకంటే హైట్ ఉన్నా, ఎక్కువ సంపాదిస్తున్నా.. మగాళ్లకు భయమా?
Motivational· 20 Jun 2026

ఆడవారు మీకంటే హైట్ ఉన్నా, ఎక్కువ సంపాదిస్తున్నా.. మగాళ్లకు భయమా?

మహిళా భాగస్వామి కంటే మగవారే పైచేయిగా ఉండాలనే రూల్ వెనుక పితృస్వామ్య (patriarchy) ఆలోచనలు ఉన్నాయి.5,000 ఏళ్ల క్రితం ఇద్దరూ సమానమే అయినా, కాలక్రమేణా మగవారిలో అభద్రతాభావం పెరిగింది. డేటింగ్ యాప్స్‌లో పురుషులు హైట్ అబద్ధం చెప్పడం, వైఫ్ ఎక్కువ సంపాదిస్తే ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవ్వడం దీనికి నిదర్శనం. అమెరికాలో 16% మంది భార్యలే భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. బ్రిటన్ రాణి భర్త ఆల్బర్ట్ కూడా 'నేను ఇంట్లో కేవలం భర్తను, యజమానిని కాదు' అని బాధపడ్డారు. నిజానికి మహిళలు ఎక్కువ హైట్ ఉన్నా, ఎక్కువ సంపాదించినా అది చాలా నార్మల్! మనసుతో భాగస్వామిని ఎంచుకుంటేనే రిలేషన్స్ హ్యాపీగా ఉంటాయి.

పేలిన కూలర్.. పెంకుటింట్లో మంటలు
Crime· 20 Jun 2026

పేలిన కూలర్.. పెంకుటింట్లో మంటలు

AP: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం మెరకపాలెంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఫైర్ యాక్సిడెంట్‌లో మూడు కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. కోరుకొండ బాబురావు, కోరుకొండ కృష్ణమూర్తి కుటుంబాలు, తదితరులు ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇంట్లో ఉన్న కూలర్‌ లోవోల్టెజ్‌తో పేలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే ఇంట్లోని వస్తువులు, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.5లక్షల ఆస్తినష్టం జరిగినట్లు ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా అంచనా వేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

చిన్నపాము అని ఆటాడితే ప్రాణం తీసింది
Crime· 20 Jun 2026

చిన్నపాము అని ఆటాడితే ప్రాణం తీసింది

TG: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఖాద్రీహిల్స్‌కు చెందిన సయ్యద్ మొహిద్దీన్ హుస్సైనీ(30) వ్యాపారవేత్త. ఆయనకు మొయినాబాద్‌లో ఫాంహౌస్ ఉంది. ఆయన ఫ్రెండ్స్‌తో కలిసి అక్కడికి వెళ్లారు. ఫాంహౌస్‌లోకి చిన్న కట్లపాము రావడంతో చేతితో పట్టుకొని మొహిద్దీన్ అందరినీ భయపెట్టాడు. పాము కుడిచేతి వేలును నోటితో గట్టిగా పట్టుకొంది. కరుస్తోందని పక్కనున్నవారు చెప్పినా తనకు ఏంకాదని చెప్పాడు. శరీరంలో మార్పులు రావడంతో మెహిదీపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లగా డాక్టర్స్ ఇంజక్షన్ ఇచ్చారు. తర్వాత ఉస్మానియా హాస్పిటల్‌కు తీసుకెళ్లగా మొహిద్దీన్ మృతి చెందినట్లు డాక్టర్స్ తెలిపారు.