ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసన!
ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసన చేపట్టింది. 'థాలీ బజావో' (ప్లేట్లు వాయించడం) ప్రోగ్రామ్‌తో అక్కడ ఫుల్ హంగామా చేశారు. "వెయ్యి గొంతుకల ఒకే డిమాండ్.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి" అంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా గట్టిగా నినాదాలు చేశారు. అలాగే రీసెంట్‌గా ఆత్మహత్యలకు పాల్పడ్డ స్టూడెంట్స్ ఫ్యామిలీస్‌కి కోటి రూపాయల చొప్పున కాంపెన్సేషన్ ఇవ్వాలని పట్టుబట్టారు.

