తాళాలు అవసరం లేదు.. కారు వైపు చూస్తే చాలు లాక్ ఓపెన్!
మెర్సిడెస్ బెంజ్ తన కొత్త ఎలక్ట్రిక్ కారులో ఒక అదిరిపోయే ఫ్యూచరిస్టిక్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇకపై ఈ కారును ఓపెన్ చేయడానికి ఎలాంటి తాళాలు (keys) అవసరం లేదు. కేవలం మన ఫేస్ రికగ్నిషన్ ద్వారా, అంటే కారు వైపు చూస్తే చాలు దానంతట అదే డోర్స్ తెరుచుకుంటుంది. మన స్మార్ట్‌ఫోన్స్‌లో ఉండే ఫేస్ లాక్ లాగే ఈ కార్ టెక్నాలజీ కూడా పనిచేస్తుంది. కార్ల హిస్టరీలోనే ఇదొక నెక్స్ట్ లెవెల్ అప్‌డేట్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కార్ ఫీచర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

