AP

బిగ్ అలర్ట్.. SIR సర్వేకు ఇక 3 రోజులే
AP· 12 Jul 2026

బిగ్ అలర్ట్.. SIR సర్వేకు ఇక 3 రోజులే

AP: SIR ఇంటింటి సర్వే ప్రక్రియ మరో మూడు రోజుల్లో ముగుస్తుందని, జూన్ 14వ తేదీ అర్ధరాత్రి నుంచి సర్ మ్యాపింగ్ యాప్ పని చేయడం ఆగిపోతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గడువు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు డిజిటలైజ్డ్ అయిన ఓటర్లలో సుమారు 10 శాతం మంది ఓటర్లలో మరణించిన వాళ్లు, ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్న వారు, దొరకని ఓటర్లు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నట్లు తెలిపారు. జూలై 11 సాయంత్రం 4గంటల వరకు మొత్తం 4,16,27,694 మంది ఓటర్లకు గాను 3,61,23,312 ఓటర్ల వివరాలు డిజిటలైజ్డ్ అయ్యాయని పేర్కొన్నారు.

అంగన్‌వాడీలపై CI వివాదాస్పద వ్యాఖ్యలు
AP· 11 Jul 2026

అంగన్‌వాడీలపై CI వివాదాస్పద వ్యాఖ్యలు

AP: ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయాలని అంగన్వాడీ కార్యకర్తలు నంద్యాల కలెక్టరేట్‌ను ముట్టడించారు. CITU ఆధ్వర్యంలో 600మందికి పైగా అంగన్వాడీలు భారీ ధర్నా నిర్వహించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకుంది. వినతిపత్రాన్ని కలెక్టర్ స్వీకరించకుండానే వెళ్లిపోయారని రోడ్డుపై బైఠాయించి ఆందోళన కొనసాగించారు. ఓ అంగన్వాడీ కార్యకర్తపై లేడీ కానిస్టేబుల్ చేయి చేసుకోవడంతో మరింత ఉద్రిక్తంగా మారింది. అంతేకాకుండా, నంద్యాల 3 టౌన్ CI వేణుగోపాల్ అంగన్వాడీలతో ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి వచ్చారా, నన్ను ఏం చేయలేరంటూ దురుసగా ప్రవర్తించారు. CI , లేడీ కానిస్టేబుల్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అంగన్వాడీల మెరుపు ధర్నా.. కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
AP· 10 Jul 2026

అంగన్వాడీల మెరుపు ధర్నా.. కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

AP: దీర్ఘకాలికంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు మెరుపు ధర్నాకు దిగడంతో తిరుపతి కలెక్టరేట్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకుంది. ESI, PF సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. CITU ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ వర్కర్లకు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలన్నారు. అంగన్వాడీలు సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్నా, వారి సామాజిక భద్రతను ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. వెంటనే వారి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ప్రభుత్వం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకునే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.

కొండకోనలు దాటినా కాపాడలేకపోయారు
AP· 10 Jul 2026

కొండకోనలు దాటినా కాపాడలేకపోయారు

AP: పోలవరం జిల్లా కూనవరం మండలం కారుమానుకొండకు చెందిన సమ్మక్క ప్రియ(18) పాముకాటుకి గురైంది. కుటుంబసభ్యులు ఆమెను డోలీ ద్వారా కూటూరు గవర్నమెంట్ హాస్పిటల్‌కు, ఆ తర్వాత చింతూరుకు తరలించారు. అనంతరం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించినట్లు యువతి తండ్రి లక్ష్మణ్‌రెడ్డి తెలిపారు. అక్కడ అడ్మిట్‌ కూడా చేసుకోకుండా వెనక్కి పంపేశారని ఆయన వాపోయారు. అనంతరం గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్తే డాక్టర్స్ పట్టించుకోలేదన్నారు. అర్ధరాత్రి గిలగిలా కొట్టుకుంటూ తన కుమార్తె చనిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు.

మెగా టూరిజం హబ్‌గా పోలవరం
AP· 10 Jul 2026

మెగా టూరిజం హబ్‌గా పోలవరం

AP: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే, ECRF డ్యామ్ (Earth cum Rock Fill Dam) సుందరీకరణ డిజైన్లు తుది రూపానికి వచ్చాయి. జపాన్‌కు చెందిన నిప్పాన్‌ కోయి ఆర్కిటెక్చర్‌ సంస్థ ఈ డిజైన్లను రూపొందించింది. ఈ డిజైన్లపై సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు సంస్థ ప్రతినిధులతో సమీక్షించారు. ఈ ప్రాజెక్టు పరిధిలోని 10,000 ఎకరాల్లో టూరిజం హబ్‌ కోసం ఇటీవల లైడార్‌ సర్వే కూడా చేశారు. పోలవరం నుంచి పాపికొండలు మీదుగా భద్రాచలం వరకూ టూరిజం హబ్‌గా మార్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గోదావరి విశిష్టత చాటేలా మ్యూజియం, వాటర్‌ స్పోర్ట్స్‌, టెంపుల్‌ టూరిజం, పార్క్‌ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.