Crime· 29 Jul 2026
మహిళ ఫిర్యాదుతో CIపై వేటు
HYD జూబ్లీహిల్స్ PS ఇన్స్పెక్టర్ U.శ్రీనివాసులురెడ్డిని విధి నిర్వహణలో నిర్లక్ష్యం, తీవ్ర ఆరోపణల నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేశారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళను మాయమాటలతో నమ్మించి సన్నిహితంగా మెలిగారని, ఫొటోలు, వీడియోలు తీసి డబ్బుల కోసం బెదిరించారని బాధితురాలు ఆరోపించింది. తనపై పలుమార్లు లైంగికదాడి చేసి అబార్షన్ చేయించారని ఫిర్యాదులో పేర్కొంది. మహిళే తనను బెదిరించి డబ్బులు వసూలు చేసిందని ఇన్స్పెక్టర్ వాదించినప్పటికీ, ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఆదేశించి, సస్పెన్షన్ చేశారు.