Crime· 30 Jul 2026
సినిమా చూస్తుండగానే బాలీవుడ్ నటికి బిగ్ షాక్..
బాలీవుడ్ నటి, నిర్మాత కీర్తి కుల్హారీ సైబర్ మోసానికి గురయ్యారు. ముంబైలోని ఒక మల్టీప్లెక్స్‌లో సినిమా చూస్తుండగా, ఆమె క్రెడిట్ కార్డు ద్వారా ఏరోమెక్సికో ఎయిర్‌లైన్స్‌లో 2,525 డాలర్ల విదేశీ లావాదేవీ జరిగినట్లు మెసేజ్ వచ్చింది. ఓటీపీ ఎవరికీ షేర్ చేయకపోయినా, నిమిషాల వ్యవధిలోనే 4 ఇల్లీగల్ లావాదేవీల ద్వారా రూ. 2.43 లక్షలకు పైగా మాయమైపోయాయి.కీర్తి ఫిర్యాదుతో అంబోలి పోలీసులు, సైబర్ సెల్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.