Crime· 13 Aug 2026
ప్రైవేట్ పార్ట్స్‌కు కరెంట్ షాక్ ఇచ్చి భర్త హత్య
దిల్లీలోని రతియా మార్గ్‌లో మున్నాలాల్(55)ను అతని భార్య మంజూ, ఆమె ప్రియుడు చమన్ కలిసి హత్య చేశారు. దొంగలు చోరీ చేయడానికి వచ్చి హత్య చేసినట్టు పోలీసులు అనుమానించారు. అయితే ఫోరెన్సిక్ పరీక్షల్లో మాత్రం మందు ఇచ్చి, గొంతు కోసి, తల, ముఖం మీద దెబ్బలు కొట్టి, ప్రైవేట్ భాగాలపై విద్యుత్ షాక్ ఇచ్చి చంపినట్లు తేలింది. సీసీ కెమెరా ఫుటేజీ చూడటంతో నిజం బయటపడింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.