Crime· 11 Aug 2026
గుప్త నిధుల పేరుతో ఘరానా మోసం.. రూ.కోటి స్వాహా
TG: హైదరాబాద్‌లో గుప్త నిధుల పేరుతో మోసాలు చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇళ్ల కింద నిధులున్నాయని నమ్మించి, గుంతల్లో బొగ్గు, ఫేక్ గోల్డ్ కాయిన్స్ పాతిపెట్టేవారు. తాము చెప్పిన పూజలు చేస్తే బొగ్గు బంగారంగా మారుతుందని నమ్మించి బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసేవారు. ఇలా 11 మందిని మోసం చేసి రూ.కోటి వరకు దోచేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి రెండు కార్లు, ఆటో, రెండు బైక్‌లు, నాలుగు ఫోన్లు, 25 ఫేక్ గోల్డ్ కాయిన్స్, పూజా ప్రొడక్ట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.