Local

మానవత్వానికి నిలువెత్తు రూపం.. మన్యం కలెక్టర్ !!
Local· 12 Apr 2026

మానవత్వానికి నిలువెత్తు రూపం.. మన్యం కలెక్టర్ !!

మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి గారు చేసిన ఈ పని ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఆయన రియల్ 'GOAT' (Greatest Of All Time) అంటూ జనం పొగిడేస్తున్నారు. నో ప్రోటోకాల్.. ఓన్లీ హ్యుమానిటీ అంటున్నారు మన్యం కలెక్టర్. చినభొగిలి మండలం దగ్గర రోడ్డు మీద బాధితుడిని చూడగానే వెంటనే రియాక్ట్ అయ్యారు. తన హోదా, ప్రోటోకాల్ పక్కనపెట్టి ఫోన్ చేసి ఆర్డర్స్ వేయడం కాకుండా, స్వయంగా రంగంలోకి దిగి బాధితుడిని కారులో ఎక్కించుకుని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. బాధితుడికి ఫస్ట్ ఎయిడ్ చేయించి,ఆపై మళ్ళీ పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్లి జాయిన్ చేయించారు. పవర్ ఉన్నవాళ్లు కాకుండా, మనసున్న వాళ్లే రియల్ సెలబ్రిటీలు అని కలెక్టర్ గారు ప్రూవ్ చేశారు.

ఆశా జీవితం.. అడుగడుగునా పోరాటాలే
Local· 12 Apr 2026

ఆశా జీవితం.. అడుగడుగునా పోరాటాలే

ఆశా భోంస్లే జీవితంలో అడుగడుగునా పోరాటాలు చేశారు. లతా మంగేష్కర్ అనే వటవృక్షం నీడలో మ్యూజిక్ వరల్డ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డారు. వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో విషాదాలు తట్టుకొని నిలబడ్డారు. 16 ఏళ్లకే ఆశా పెళ్లి చేసుకున్నారు. మొదటి భర్త గణపత్ రావు భోంస్లే శాడిస్ట్. ఇద్దరు పిల్లలు పుట్టి, మూడోసారి గర్భవతిగా ఉన్నప్పుడు ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. పుట్టింట్లో ఆదరణ కూడా లభించకపోవడంతో ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకుందామనుకున్నారు.. ఆర్ డి బర్మన్ తో ప్రేమ పెళ్లితో ఆమె ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. కూతురు వర్ష డిప్రెషన్‌తో షూట్ చేసుకుని చనిపోయింది. కొడుకు హేమంత్ క్యాన్సర్‌తో చనిపోయాడు. రెండో భర్త RD బర్మన్‌ కి కూడా దూరమైంది. ఇన్ని బాధల మధ్యా ఆమె పాటలు పాడుతూ కోట్లాది మంది హృదయాల్ని గెలిచారు.

ఠారెత్తిస్తున్న ఎండలు.. మరో 10 రోజులు ఇంతే
Local· 10 Apr 2026

ఠారెత్తిస్తున్న ఎండలు.. మరో 10 రోజులు ఇంతే

తెలంగాణలో భానుడు భగభగలాడనున్నాడు! ఏప్రిల్ 10 నుండి 13 వరకు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ నెల 22 వరకు ఎండలు అత్యధికంగా ఉంటాయని చెప్పింది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44°C దాటే అవకాశం ఉండటంతో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ప్రభుత్వ సూచనలు: మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు బయటకు రావద్దు. లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలి, ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా (నీరు, ORS తాగుతూ) ఉండాలి. ఉప్పు, కారం, నూనె వస్తువులకు దూరంగా ఉండాలి. తలనొప్పి, కండరాల బలహీనత లేదా స్పృహ తప్పడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 40°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత అత్యధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి!