Local

వైఎస్సాఆర్‌కు ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఘన నివాళి
Local· 2d ago

వైఎస్సాఆర్‌కు ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఘన నివాళి

TG: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను నాయకులు గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోపాల్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ మినాజ్, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని వైఎస్సార్‌కు ఘన నివాళులు అర్పించారు.

పోస్టుమాస్టర్ నిర్లక్ష్యం.. బాధితుడికి ఆర్థిక నష్టం
Local· 2d ago

పోస్టుమాస్టర్ నిర్లక్ష్యం.. బాధితుడికి ఆర్థిక నష్టం

AP: రికరింగ్ డిపాజిట్ (RD) వ్యవహారంలో పోస్టుమాస్టర్ నిర్లక్ష్యంతో ఆర్థికంగా, మానసికంగా నష్టపోయానని అంబేడ్కర్ కోనసీమ జిల్లా లక్కవరం గ్రామానికి చెందిన జిల్లెల్ల శ్రీనివాస్ ఆరోపించారు. సమస్య పరిష్కారం కోసం గతంలో పోస్టుమాస్టర్ సుబ్రహ్మణ్యాన్ని సంప్రదించినా ఫలితం లేకపోవడంతో వినియోగదారుల సంక్షేమ సంఘాన్ని ఆశ్రయించారు. తనకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుతూ పోస్టుమాస్టర్‌కు సంఘం ఆధ్వర్యంలో రిజిస్టర్డ్ లేఖ పంపించారు. లేఖ అందిన 15 రోజుల్లోగా బాధితుడికి నష్టపరిహారం అందించాలని వారు సూచించారు.