Local· 1d ago
విద్యుత్ కోతలతో రైతుల ఇబ్బందులు: జీవన్‌రెడ్డి
TG: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యిరోజుల పాలనలో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్, డొంకేశ్వర్ ఉమ్మడి మండలాల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజాసమస్యలు, అవినీతి, అక్రమాలను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించామని, ప్రస్తుతం విద్యుత్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.