Local· 22 Aug 2026
హోంమంత్రి నియోజకవర్గంలో కనీస వసతులు కరువు
AP: మౌలిక వసతుల కోసం రాజయ్యపేట గ్రామస్తులు రోడ్డెక్కారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని రాజయ్యపేటలో సుమారు 200 కుటుంబాలు కనీస సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నడిచేందుకు సరైన రోడ్లు, తాగునీరు, వీధిలైట్లు, సైడ్ కాలువలు, డ్రైనేజీ సౌకర్యాలు లేక అవస్థలు ఎదురవుతున్నాయని తెలిపారు. సమస్యలను పరిష్కరించాలని హోంమంత్రి, స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనితను కోరారు. అనంతరం గ్రామంలో రోడ్లు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శన నిర్వహించారు.