85 ఏళ్ల వయసులో ఎంఏ..వాహ్!

హరియాణాలోని సిర్సాకు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ లాల్‌చంద్ గోదారా 85 ఏళ్ల వయసులో ఎంఏ పూర్తి చేశారు. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU)లో ఆయన మాస్టర్స్ డిగ్రీ సాధించారు. 76 ఏళ్ల వయసులో తిరిగి చదువు ప్రారంభించి, 81 ఏళ్లకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం పీహెచ్‌డీ లేదా న్యాయశాస్త్రం చదవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2002లో జాబ్ రిటైర్మెంట్ తర్వాత అథ్లెటిక్స్‌లోనూ మెడల్స్ సాధించారు. తన మనవళ్ల ప్రశ్నలతో మళ్లీ చదువుపై ఆసక్తి పెరిగిందని ఆయన ఫ్యామిలీ మెంబర్స్ తెలిపారు.


