TG· 2d ago
CPSపై ఉద్యోగుల మహాగర్జన
TG: CPSను రద్దుచేసి OPS అమలు చేయాలంటూ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసన గళం వినిపించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో నల్లబ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులతో నిరసనలు చేపట్టారు. హైదరాబాద్ నాంపల్లి గగన్ విహార్, అబిడ్స్ బీమా భవన్, కలెక్టరేట్ వద్ద, సచివాలయంలో ఉద్యోగులు ఆందోళనలు నిర్వహించారు. సీపీఎస్ రద్దు హామీని ప్రభుత్వం అమలు చేయాలని ఐకాస నేతలు డిమాండ్ చేశారు. 30 ఏళ్లపాటు సేవలందించే ఉద్యోగులకు సీపీఎస్, ఐదేళ్ల పదవీకాలం ఉండే ప్రజాప్రతినిధులకు ఓపీఎస్ కొనసాగించడం అన్యాయమన్నారు.