వాటర్ సప్లైపై సీతక్క ఫుల్ ఫోకస్
TG: ఎర్రమంజిల్లోని గ్రామీణ తాగునీటి సరఫరా కార్యాలయంలో మంత్రి సీతక్క అధికారులతో సమావేశం అయ్యారు. ఎల్నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో తాగునీటి షార్టేజ్ రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు, గ్రామాలకు జరుగుతున్న తాగునీటి సరఫరాపై చర్చించారు. ఎక్కడా నీటి షార్టేజ్ తలెత్తకుండా నిరంతరం మానిటరింగ్ చేయాలని, ప్రజలకు తాగునీరు నిరంతరంగా అందేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు

