← Back to news

రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించేందుకు కొత్త గైడ్‌లైన్స్

By A.Ajay· 2h ago
రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించేందుకు కొత్త గైడ్‌లైన్స్

TG: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసింది. అక్టోబర్ 12న G.O. నంబర్ 48 విడుదల చేసింది. రహదారి భద్రతా నిధుల ఆదాయం, ఖర్చుల వివరాలను ఆన్‌లైన్‌లో పర్యవేక్షించడంతోపాటు, రాష్ట్ర, జిల్లా స్థాయి ఖాతాలకు CAG ఆడిట్ తప్పనిసరి చేసింది. పోలీస్, ఆరోగ్య, రహదారులు, విద్య తదితర శాఖలు రోడ్డు భద్రతపై తీసుకున్న చర్యల వివరాలను మూడు నెలలకోసారి సంబంధిత సంస్థకు అందించేలా గైడ్‌లైన్స్ రూపొందించింది.

రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించేందుకు కొత్త గైడ్‌లైన్స్

More in TG