← Back to news

CECపై కాంగ్రెస్ పోరు.. చార్మినార్ వరకు మార్చ్

By Prashanth· 1h ago· X

TG: తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు V. హనుమంతరావు నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు హైదరాబాద్‌లోని మదీనా మార్కెట్ నుంచి చార్మినార్ వరకు తిరంగా మార్చ్ నిర్వహించారు. CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. S.I.Rలో అక్రమాలు జరిగాయని, కోట్లాది మంది ఓటర్ల పేర్లు తొలగించారంటూ ఈ నిరసన చేపట్టారు. ఓటర్ల హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా కాంగ్రెస్ చేపడుతున్న ఆందోళనల్లో భాగంగా ఈ తిరంగా మార్చ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు.

More in TG