← Back to news

₹11.69 లక్షల రాగి సామగ్రి స్వాహా

By Lokesh· 1h ago
₹11.69 లక్షల రాగి సామగ్రి స్వాహా

TG: హైదరాబాద్‌లోని దూలపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో చోరీ జరిగింది. పావని పవర్ సిస్టమ్స్ కంపెనీలోకి తెల్లవారుజామున నలుగురు వ్యక్తులు కాంపౌండ్ వాల్ దూకి లోపలికి వెళ్లారు. అక్కడున్న 779.5 కిలోల రాగి ట్యూబులు, బస్ బార్లను ఎత్తుకెళ్లారు. వీటి విలువ ₹11.69 లక్షలుగా గుర్తించారు. ఈ దృశ్యాలు CCTVలో రికార్డయ్యాయి. కంపెనీ కంప్లైంట్‌తో పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు.

More in TG