TG

నీళ్లపై కనీస అవగాహన లేదు
TG· 21 Jul 2026

నీళ్లపై కనీస అవగాహన లేదు

TG: కాంగ్రెస్ ప్రభుత్వానికి నీళ్ల మీద కనీస అవగాహన లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేవాదుల BRS కట్టిన ప్రాజెక్టు.. ఆ విషయం కూడా కాంగ్రెస్ నాయకులకు తెలియదన్నారు. దేవాదుల ప్రాజెక్టులోని 38.16 TMCల నీటిని ఎత్తుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారని తెలిపారు. 22 రిజర్వాయర్లు నింపుతామని, ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తామని చెప్పారని పేర్కొన్నారు. మంత్రి మాటలు నమ్మి రైతులు నారు పోసుకున్నారని పేర్కొన్నారు. ఇప్పుడేమో ప్రాజెక్టుల నుంచి నీళ్లు విడుదల చేయడంలేదని ఫైరయ్యారు.

షాకింగ్.. బైక్ ఇంజిన్‌లో నాగుపాము
TG· 21 Jul 2026

షాకింగ్.. బైక్ ఇంజిన్‌లో నాగుపాము

TG: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బస్టాండ్‌లో పార్క్ చేసి ఉన్న ఓ బైక్ ఇంజిన్‌లో భారీ నాగుపాము కనిపించడంతో కలకలం రేపింది. పామును గమనించిన ప్రయాణికులు భయాందోళనకు గురై వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న స్నేక్ క్యాచర్ చాకచక్యంగా బైక్ ఇంజిన్‌లో నుంచి నాగుపామును సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం దానిని పట్టణ శివారులోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ ఘటనతో బస్టాండ్‌లో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది. వర్షాకాలంలో పాములు వాహనాల్లోకి చేరే అవకాశం ఉన్నందున, పార్క్ చేసిన వాహనాలను స్టార్ట్ చేసే ముందు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని స్నేక్ క్యాచర్ సూచించారు.

మహిళ ఆత్మహత్యాయత్నం
TG· 21 Jul 2026

మహిళ ఆత్మహత్యాయత్నం

TG: భద్రాచలం వద్ద గోదావరి వంతెనపై ఓ మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ములకలపల్లి మండలం పొగళ్లపల్లి గ్రామానికి చెందిన గొళ్లమూడి శైలజ (37) కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలతో తీవ్ర మనస్తాపానికి గురై నదిలోకి దూకేందుకు ప్రయత్నించింది. స్థానికులు, వాహనదారులు సమయస్ఫూర్తితో ఆమెను అడ్డుకుని కాపాడారు. అనంతరం బూర్గంపాడు పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తన ఇంటి స్థలాన్ని మరిది అక్రమంగా ఆక్రమించుకున్నాడని, భర్తపై తప్పుడు కేసులు పెట్టించి వేధిస్తున్నారని శైలజ ఆరోపించింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

టీచర్ బదిలీపై తల్లిదండ్రుల కన్నీటి ఆవేదన
TG· 21 Jul 2026

టీచర్ బదిలీపై తల్లిదండ్రుల కన్నీటి ఆవేదన

AP: శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం ఆనందపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గోపాలకృష్ణ బదిలీకి వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఆయనను బదిలీ చేస్తే తమ పిల్లలకు TCలు తీసుకుని వేరే పాఠశాలల్లో చేర్పిస్తామని హెచ్చరించారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాఠశాలలో చేరాలని ప్రోత్సహించిన గోపాలకృష్ణ వల్లే తమ పిల్లలు మంచి విద్య పొందుతున్నారని తల్లిదండ్రులు తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండా బదిలీ చేయడం అన్యాయమని ఫైరయ్యారు. గ్రామస్తుల వినతిపై స్పందించిన MEO చిన్నారావు, గోపాలకృష్ణను తిరిగి ఆనందపురం పాఠశాలలో బోధించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు ప్రారంభం
TG· 21 Jul 2026

ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు ప్రారంభం

TG: కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (CURE)‌ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ‘ఇందిరమ్మ ఇండ్లు’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి విధివిధానాలు, అర్హతలు, మార్గదర్శకాలను సచివాలయంలో క్యూర్‌ పరిధిలోని పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి ఆయన ప్రకటించారు. తొలి విడతగా ఇప్పటికే స్థలాలు గుర్తించిన 16 నియోజకవర్గాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు. ఇళ్ల కోసం దరఖాస్తులను ఈ నెల 21 నుంచి ఆగస్టు 10 వరకు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.

హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు సీరియస్
TG· 21 Jul 2026

హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు సీరియస్

TG: హైడ్రా కమిషనర్ AV రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేట్ భూమిలోకి వెళ్లరాదన్న కోర్టు ఆదేశాలను మూడుసార్లు ఉల్లంఘించినందుకు అరెస్టు చేయాలని కూడా ఆదేశించింది. అయితే ప్రభుత్వ న్యాయవాదుల విజ్ఞప్తితో ఆ ఆదేశాలను విరమించుకుని, ఆయన వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. మల్కాజ్‌గిరి మండలం లోతుకుంట భూమి వివాదంలో హైడ్రా జోక్యంపై విచారణ జరిపిన ధర్మాసనం, కోర్టు ధిక్కరణను తీవ్రంగా పరిగణించింది. హైడ్రా ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని, కోర్టు ఆదేశాలంటే లెక్క లేకుండా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయింది.

ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం
TG· 20 Jul 2026

ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం

TG: హైదరాబాద్‌లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనీ IPSపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ప్రస్తుతం అతడు SR నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తోటి మహిళా ట్రైనీపై అతడు అసభ్యకరమైన మెసెజెస్ పంపడం, బెదిరింపులకు పాల్పడడం, వ్యక్తిగత వీడియోలను రికార్డు చేసి బ్లాక్‌మెయిల్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు BNS పలు సెక్షన్లు, ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జెండా చిరిగిపోయినా స్పందించని అధికారులు
TG· 20 Jul 2026

జెండా చిరిగిపోయినా స్పందించని అధికారులు

TG: హైదరాబాద్‌లోని నాగోల్ మూసీ నదీ తీరంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా చిరిగిపోయి నేలపై పడిపోవడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఇనుప గొలుసులు(రోప్స్) తెగిపోవడంతో జెండా కింద పడిపోయినా, సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోలేదని స్థానికులు ఫైరయ్యారు. దాదాపు వారం క్రితమే కింద పడ్డా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకుండా వదిలేశారని విమర్శిస్తున్నారు. స్తంభానికి మరమ్మతులు చేపట్టి, కొత్త జెండాను ఆవిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

హైదరాబాద్‌లో ముగ్గురు బాలికలు మిస్సింగ్
TG· 20 Jul 2026

హైదరాబాద్‌లో ముగ్గురు బాలికలు మిస్సింగ్

TG: హైదరాబాద్‌లో ముగ్గురు బాలికలు ఆకస్మికంగా అదృశ్యమవడం కలకలం రేపుతోంది. దోమలగూడలో నివసిస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కార్మిక కుటుంబాలకు చెందిన స్నేహ, లలిత, లత ఆదివారం ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లారు. రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన దోమలగూడ పోలీసులు CCTV ఫుటేజీని పరిశీలించగా, బాలికలు హిమాయత్‌నగర్‌లో ఆటో ఎక్కి కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద దిగినట్లు గుర్తించారు. వారు ఛత్తీస్‌గఢ్ వెళ్లారా లేదా ఇతర ప్రాంతానికి వెళ్లారా అనే కోణంలో ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు.

ఆగస్టు 3 వరకు క్షేత్రస్థాయిలో పనిచేయాలి
TG· 20 Jul 2026

ఆగస్టు 3 వరకు క్షేత్రస్థాయిలో పనిచేయాలి

TG: SIR ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించిన నేపథ్యంలో CM రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పెరిగిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆగస్టు 3 వరకు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. ఫారాల స్వీకరణ పూర్తయ్యే వరకు నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల కోసం ఎవరూ గాంధీ భవన్‌కు రావొద్దని స్పష్టం చేశారు. సర్ ప్రక్రియపై జరిగిన వర్చువల్ సమీక్షలో 25 నియోజకవర్గాల పనితీరుపై CM అసంతృప్తి వ్యక్తం చేశారు. నాలుగు నియోజకవర్గాల్లో అసలు పని జరగలేదని పేర్కొన్నారు. పనితీరు మెరుగుపరచని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్లాట్లు ఇప్పిస్తానని, రాత్రికి రాత్రే పరార్
TG· 19 Jul 2026

ప్లాట్లు ఇప్పిస్తానని, రాత్రికి రాత్రే పరార్

TG: మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లో ప్లాట్ల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ప్లాట్లు ఇప్పిస్తానని చెప్పి వెంకటేష్ అనే వ్యక్తి పలువురి నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడని బాధితులు ఆరోపించారు. డబ్బులు చెల్లించిన తర్వాత ప్లాట్లు ఇవ్వకపోవడంతో అతని ఇంటి ముందు వారు ఆందోళనకు దిగారు. అయితే అక్కడికి చేరుకునే సరికి వెంకటేష్ ఇల్లు అమ్ముకుని కుటుంబంతో కలిసి పరారైనట్లు తెలిసి వారు షాక్‌కు గురయ్యారు. తమ కష్టార్జిత సొమ్మంతా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేష్‌‌ను అరెస్ట్ చేసి, తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని పోలీసులు, ప్రభుత్వాన్ని కోరారు.

కారం చల్లి రాళ్లు రువ్విన రైతులపై కేసు నమోదు
TG· 19 Jul 2026

కారం చల్లి రాళ్లు రువ్విన రైతులపై కేసు నమోదు

TG: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం చేపట్టిన 600 ఎకరాల భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టారు. పెద్దఎత్తున చేరుకున్న రైతులు, గ్రామస్తులు అధికారులను, పోలీసులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చెలరేగి, కొందరు రైతులు పోలీసులపై కారం చల్లి రాళ్లు, కుర్చీలు విసిరారు. ఈ ఘటనలో DCP యోగేష్ గౌతమ్‌తో పాటు పలువురు CIలకు గాయాలయ్యాయి. పోలీసులు హైఅలర్ట్ ప్రకటించి, దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశారు. వీడియో ఆధారంగా గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.