Latest

రిలే నిరాహార దీక్షలను జయప్రదం చేయండి
Local· 22 Aug 2026

రిలే నిరాహార దీక్షలను జయప్రదం చేయండి

TG: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24 నుంచి 26 వరకు జిల్లా కలెక్టరేట్‌ల ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు సీఐటీయూ వనపర్తి జిల్లా నాయకత్వం ప్రకటించింది. మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేసి, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, అధికారుల, రాజకీయ నాయకుల వేధింపులు ఆపాలని కోరారు. ఈఎస్, పీఎఫ్ సౌకర్యాలు కల్పించడంతో పాటు పీఆర్సీ పరిధిలోకి తీసుకురావాలని అన్నారు.

గచ్చిబౌలిలో కూలిన ఏడంతస్తుల భవనం
TG· 22 Aug 2026

గచ్చిబౌలిలో కూలిన ఏడంతస్తుల భవనం

TG: హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో ఏడంతస్తుల భవనం కూలింది. 50 గజాల్లో నిర్మాణంలో ఉన్న ఈ భవనం ఒక్కసారిగా కూలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భవనం కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.

ఆగస్టు 24 నుంచి యాత్ర- దేవేంద్ర నాథ్ మహతో
Education· 22 Aug 2026

ఆగస్టు 24 నుంచి యాత్ర- దేవేంద్ర నాథ్ మహతో

దేవేంద్ర నాథ్ మహతో రాంచీలో మీడియాతో మాట్లాడుతూ, CGL ఇష్యూపై విద్యార్థుల తరఫున తాము చేసే పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. అర్హులైన నిరుద్యోగులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ సంస్కరించేందుకు ఆగస్టు 24 సోమవారం నుంచి 24 జిల్లాల్లో 'రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ రీఫార్మ్ యాత్ర' చేపడుతున్నట్లు అనౌన్స్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని హెచ్చరించారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు
Local· 22 Aug 2026

నాగర్ కర్నూల్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు

TG: నాగర్‌కర్నూల్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కల్వకుర్తి, వెల్దండ, అచ్చంపేట, అమ్రాబాద్, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ తదితర మండలాల్లో 0.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రైతుల్లో ఆందోళన నెలకొంది. వర్షాలు రాక పత్తి తదితర పంటలు వాడిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. వర్షం ముఖం చాటేయడంతో పంటలు వాడిపోతున్నాయని అంటున్నారు.

‘ఇరుముడి’ DAY 1 కలెక్షన్స్
Entertainment· 22 Aug 2026

‘ఇరుముడి’ DAY 1 కలెక్షన్స్

రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇరుముడి’ సినిమా మొదటిరోజు మంచి వసూళ్లు సాధించింది. మనదేశంలో సుమారు రూ.14.80 కోట్ల నెట్ కలెక్షన్స్ రాగా, ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.24.20 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు రూ.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. రవితేజ కెరీర్‌లోనే మొదటిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఇది నిలిచింది.

వెయ్యేళ్లకు పైబడిన గుంటూరు చరిత్ర
Local· 22 Aug 2026

వెయ్యేళ్లకు పైబడిన గుంటూరు చరిత్ర

AP: గుంటూరు నగరానికి వెయ్యేళ్లకు పైబడిన చరిత్ర ఉంది. క్రీ.శ.669లో తూర్పు చాళుక్య రాజు విష్ణువర్ధనుడు–II కాలం నాటి పూణే తామ్రశాసనాల్లో కుంటూరు, గొంటూరు, గుంటూరు పేర్లు కనిపిస్తాయి. 10వ శతాబ్దపు ఎడేరు తామ్రశాసనంలోనూ ‘గొంటూరు’గా ప్రస్తావన ఉంది. 10 నుంచి 14వ శతాబ్దాల వరకు శాసనాల్లో ఈ పేరు కనిపించింది. ఉమ్మడి గుంటూరు పరిధిలోని పల్నాడు కూడా మధ్యయుగంలో కీలక రాజకీయ కేంద్రంగా వెలుగొందింది.

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
Local· 22 Aug 2026

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

TG: ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి భరత్ ప్రసాద్ ఆరా తీశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఆయన వైద్య విద్యార్థులు, వైద్యులు, రోగులతో మాట్లాడారు. విద్యార్థుల శిక్షణ, విధుల నిర్వహణపై వివరాలు తెలుసుకున్న అనంతరం చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారికి అందుతున్న వైద్యం, ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. అనంతరం వైద్యులతో సమావేశమై ప్రతి రోగికి మెరుగైన వైద్యం, అవసరమైన శ్రద్ధ అందించాలని సూచించారు.

ఆశ్రమ పాఠశాలకు మహిళా వార్డెన్‌ను నియమించాలి: SFI
Local· 22 Aug 2026

ఆశ్రమ పాఠశాలకు మహిళా వార్డెన్‌ను నియమించాలి: SFI

TG: బాలికల వసతి గృహంలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పూర్తిస్థాయి మహిళా వార్డెన్‌ను నియమించాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేసింది. నిర్మల్ జిల్లాలోని స్వర్ణ ఆశ్రమ బాలికల పాఠశాల సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ దిగంబర్, DTDOకు వినతిపత్రం అందజేశారు. బాలికల వసతి గృహానికి ప్రస్తుతం పురుష వార్డెన్ ఉండటంతో విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యార్థినుల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని మహిళా వార్డెన్‌ను నియమించాలని కోరారు. పారిశుధ్యం, తాగునీరు తదితర కనీస వసతులు మెరుగుపరచాలన్నారు.

స్కూళ్ల సమస్యలపై Gen Alpha గళం.. దేశవ్యాప్తంగా ఫోకస్‌లోకి!
Current Affairs· 22 Aug 2026

స్కూళ్ల సమస్యలపై Gen Alpha గళం.. దేశవ్యాప్తంగా ఫోకస్‌లోకి!

దేశంలో Gen Alpha విద్యార్థుల వరుస ప్రొటెస్ట్లు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. స్కూళ్లలో బేసిక్ ఫెసిలిటీస్ కల్పించాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. టీచర్ల కొరత, పనిచేయని టాయిలెట్లు, ప్లేగ్రౌండ్లు లేకపోవడం, స్కూళ్లకు సరైన రోడ్లు లేకపోవడంపై ఆందోళనలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 300 మంది స్టూడెంట్స్ స్కూల్ రోడ్డు కోసం 6 కి.మీ. నడిచారు. లక్నోలో 250 మంది బాలికలు టీచర్ల కొరతపై నిరసన చేశారు. గవర్నమెంట్ డేటా కూడా దేశంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నట్లు చెబుతుంది.

యోగా క్రీడాకారులకు గుడ్‌న్యూస్.. రేపే జిల్లాస్థాయి పోటీలు
Local· 22 Aug 2026

యోగా క్రీడాకారులకు గుడ్‌న్యూస్.. రేపే జిల్లాస్థాయి పోటీలు

TG: మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం జిల్లాస్థాయి యోగా పోటీలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రినిటీ హైస్కూల్‌లో జరిగే ఈ పోటీల్లో ఆర్టిస్టిక్, రిథమిక్, ట్రెడిషనల్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ జాన్ థామస్, రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ అధ్యక్షుడు అక్కల తిరుపతివర్మ, కార్యదర్శి మండ శ్రీనివాస్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి ఆసక్తి ఉన్న యోగా క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాలని నిర్వాహకులు కోరారు.

ప్రైవేట్ స్థలంలో జరిగే అవమానాలకు SC/ST చట్టం వర్తించదు
Current Affairs· 22 Aug 2026

ప్రైవేట్ స్థలంలో జరిగే అవమానాలకు SC/ST చట్టం వర్తించదు

షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (నివారణ) అత్యాచారాల చట్టం కింద జరిగే అవమానాలు లేదా కులం పేరుతో దూషించడం కేవలం ‘Public View’లో జరిగితేనే నేరంగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రైవేట్ గదిలో లేదా నాలుగు గోడల మధ్య, ప్రజలు లేని చోట జరిగితే ఈ చట్టం వర్తించదని క్లారిటీ ఇచ్చింది. 2020లో ఒక స్కూల్ మేనేజర్‌పై నమోదైన కేసులో నేరంగా జరిగిన ప్రాంతం ప్రైవేటు స్థలం అని, అక్కడ ఎవరూ లేరని తెలిపింది. దీనిపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌ను రద్దు చేసింది.

ఈరోజు బంగారం ధరలు చూశారా?
Current Affairs· 22 Aug 2026

ఈరోజు బంగారం ధరలు చూశారా?

అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడటం, పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,520 పెరిగి రూ.1,63,090కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,400 పెరిగి రూ.1,49,500కి చేరింది. మార్కెట్లో బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి షాపింగ్ ప్లాన్ చేసేముందు లైవ్ ప్రైస్ చెక్ చేసుకోవడం మంచిది.

డబ్బు ఆశ చూపించి గంజాయి రవాణా.. ఇద్దరి అరెస్ట్
Local· 22 Aug 2026

డబ్బు ఆశ చూపించి గంజాయి రవాణా.. ఇద్దరి అరెస్ట్

TG: రూ.10 వేలకు ఆశపడి గంజాయి రవాణాకు అంగీకరించిన ఇద్దరు ఒడిశా యువకులు నిజామాబాద్‌లో పోలీసులకు పట్టుబడ్డారు. ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన గణేష్ పోలి (20), దీపక్ సాహు (21)లకు గుర్తుతెలియని వ్యక్తి రూ.10వేలు ఇస్తానని చెప్పి గంజాయి తరలించేలా ప్రలోభపెట్టినట్లు పోలీసులు తెలిపారు. షిర్డీలో ఆగి ఉన్న ఆటోలో 2 సూట్ కేసులు పెట్టి రావాలన్నారు. ఆ ప్రకారం శిరిడీ ఎక్స్ ప్రెస్ రైలులో సూట్‌కేసులు పెట్టుకుని వెళ్తుండగా నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌లో తనిఖీలు చేపట్టగా, సుమారు 24.3 కిలోల ఎండు గంజాయి బయటపడింది.

చదువుకోవాలని ఉంది కానీ, స్కూల్ ప్రయాణమే ప్రశ్నార్థకం
Local· 22 Aug 2026

చదువుకోవాలని ఉంది కానీ, స్కూల్ ప్రయాణమే ప్రశ్నార్థకం

AP: చదువుకోవాలనే తపన ఉంది.. కానీ స్కూలుకు వెళ్లే ప్రయాణమే ప్రశ్నార్థకంగా మారింది అంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం ఊటుకూరు పంచాయతీలోని ఇందిరానగర్‌ కాలనీకి చెందిన సుమారు 40 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నారు. పేద కుటుంబాలకు చెందిన తమకు ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. తమ ప్రాంతానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్
Local· 22 Aug 2026

గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్

TG: గురుకులాల్లో మిగిలిన ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు కామారెడ్డి జిల్లాలో స్పాట్ అడ్మిషన్లకు అధికారులు సిద్ధమయ్యారు. జిల్లాలోని 11 గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు, ఇంటర్ మొదటి సంవత్సరం MPC, BiPC కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఈనెల 25న ఉదయం 9గంటలకు స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బాలురకు భిక్కనూరులోని గురుకుల కళాశాలలో, బాలికలకు తాడ్వాయిలోని గురుకుల కళాశాలలో కౌన్సెలింగ్ జరుగుతుందని తెలిపారు.

హోంమంత్రి నియోజకవర్గంలో కనీస వసతులు కరువు
Local· 22 Aug 2026

హోంమంత్రి నియోజకవర్గంలో కనీస వసతులు కరువు

AP: మౌలిక వసతుల కోసం రాజయ్యపేట గ్రామస్తులు రోడ్డెక్కారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని రాజయ్యపేటలో సుమారు 200 కుటుంబాలు కనీస సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నడిచేందుకు సరైన రోడ్లు, తాగునీరు, వీధిలైట్లు, సైడ్‌ కాలువలు, డ్రైనేజీ సౌకర్యాలు లేక అవస్థలు ఎదురవుతున్నాయని తెలిపారు. సమస్యలను పరిష్కరించాలని హోంమంత్రి, స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనితను కోరారు. అనంతరం గ్రామంలో రోడ్లు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శన నిర్వహించారు.

ఫార్మా యూనిట్‌లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి
TG· 22 Aug 2026

ఫార్మా యూనిట్‌లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

TG: యాదాద్రి భువనగిరి జిల్లా దోతిగూడెం దగ్గరలో భారీ ప్రమాదం జరిగింది. Hazelo Labలో రియాక్టర్ బ్లాస్ట్ అయ్యింది. నిన్న అర్ధరాత్రి షిఫ్ట్ మారుతున్న టైమ్‌లో ఈ బ్లాస్ట్ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు ఎంప్లాయీస్ మృతి చెందగా, కొందరికి గాయాలయ్యాయి. పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్ అక్కడికి చేరుకున్నారు. గాయపడిన వారిని దగ్గరలోని హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. బ్లాస్ట్‌కు కారణాలపై పోలీసులు కేసు బుక్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదం గతంలో కూడా జరిగినట్టు తెలుస్తోంది.

బైక్‌ను ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి
Local· 22 Aug 2026

బైక్‌ను ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి

AP: కర్నూలు జిల్లా జొన్నగిరి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బైక్‌, లారీ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో మదనంతపురానికి చెందిన బాలమధు, మహేంద్ర అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గుంత పూడ్చేందుకు వెళ్లి.. మరో గుంతలో చిక్కుకున్న ట్రక్!
National· 22 Aug 2026

గుంత పూడ్చేందుకు వెళ్లి.. మరో గుంతలో చిక్కుకున్న ట్రక్!

మహారాష్ట్ర నాసిక్‌లో రోడ్ల పరిస్థితులపై ఆందోళన కలిగించే ఘటన జరిగింది. గంగాపూర్ రోడ్‌లో గుంతలు పూడ్చేందుకు కంకర తీసుకెళ్తున్న ట్రక్, రోడ్డు కుంగిపోవడంతో గుంతలో చిక్కుకుంది. ట్రక్ స్టార్మ్‌వాటర్ డ్రైనేజ్ లైన్ కోసం తవ్విన స్థలం దగ్గరకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డు ఒక్కసారిగా కుంగడంతో ట్రక్ వెనక్కి జారిపోయింది. దాని ముందు చక్రాలు గాల్లో వేలాడుతూ కనిపించాయి. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి. దీంతో ప్రభుత్వ పనితీరుపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తూన్నారు.

వ్యాధులపై అలర్ట్.. కలెక్టర్ కీలక ఆదేశాలు
Local· 22 Aug 2026

వ్యాధులపై అలర్ట్.. కలెక్టర్ కీలక ఆదేశాలు

TG: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. జన్నారం ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగుల పరిస్థితిపై ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ ఉమాశ్రీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తికి అవకాశం ఉన్నందున ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.

ధాన్యం మాయం.. రైస్ మిల్లు సీజ్
Local· 22 Aug 2026

ధాన్యం మాయం.. రైస్ మిల్లు సీజ్

TG: మంచిర్యాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్, సివిల్ సప్లై అధికారుల ఆకస్మిక తనిఖీలు కలకలం రేపాయి. చెన్నూరు మండలం కత్తరశాల, ఆస్నాద్ గ్రామాల్లోని రెండు రైస్ మిల్లుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. కత్తరశాలలోని శ్రీ రాజరాజేశ్వర రైస్ మిల్లులో భారీ అవకతవకలు గుర్తించినట్లు సమాచారం. సుమారు రూ.2 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో మిల్లును సీజ్ చేసి, నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు.