Latest

PSCMSను అందుబాటులోకి తెచ్చిన విద్యాశాఖ
Local· 22 Aug 2026

PSCMSను అందుబాటులోకి తెచ్చిన విద్యాశాఖ

TG: ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు, అడ్మిషన్లు, విద్యార్థుల భద్రత, వసతుల సమస్యలపై వచ్చే ఫిర్యాదుల నమోదు, పర్యవేక్షణ కోసం తెలంగాణ పాఠశాల విద్యాశాఖ PSCMS(ప్రైవేట్ స్కూల్స్ కంప్లైంట్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) ఆన్‌లైన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఈ చర్యను CCV(COUNCIL FOR CITIZENS VOICE) స్వాగతించింది. ఫిర్యాదులను నిర్ణీత గడువులో విచారించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

పరకాలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Local· 22 Aug 2026

పరకాలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

TG: పేద కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం పరకాలలో జరిగింది. హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. పరకాల పట్టణంతో పాటు పరకాల, నడికుడా, ఆత్మకూర్, దామెర మండలాల పరిధిలోని అర్హులైన పేద కుటుంబాలకు ఈ కార్డులను అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ముళ్లపొదల్లో పసికందు..కాపాడిన గొర్రెలకాపర్లు
Local· 22 Aug 2026

ముళ్లపొదల్లో పసికందు..కాపాడిన గొర్రెలకాపర్లు

AP: అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు దగ్గర్లో ఉన్న నగరవనం ఎదుట ముళ్లపొదల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఆడశిశువును పడేసి వెళ్లిపోయారు. అటుగా వెళ్తున్న గొర్రెల కాపర్లు చిన్నారి ఏడుపు విని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. శిశువు ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత శిశు సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని ICDS సూపర్వైజర్ ఝాన్సీ తెలిపారు.

NQAS గుర్తింపునకు వైద్య సిబ్బంది శ్రమించాలి: DPO
Local· 22 Aug 2026

NQAS గుర్తింపునకు వైద్య సిబ్బంది శ్రమించాలి: DPO

TG: గర్గుల్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌కు జాతీయ నాణ్యతా ప్రమాణాల గుర్తింపు (NQAS) సాధించేలా వైద్య సిబ్బంది సమష్టిగా కృషి చేయాలని జాతీయ ఆరోగ్య మిషన్ జిల్లా ప్రోగ్రామ్ అధికారి పద్మజ సూచించారు. శనివారం కామారెడ్డి మండలం గర్గుల్‌లోని పల్లె దవాఖానను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు అందిస్తున్న చికిత్స ప్రమాణాలు, నిరంతర పర్యవేక్షణ, వైద్య సహాయక సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉన్న అన్ని రకాల వైద్య సేవలను నిరంతరం అందించాలని సూచించారు.

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.250 కోట్ల పరిహారం
Local· 22 Aug 2026

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.250 కోట్ల పరిహారం

AP: వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు కోల్పోయి త్యాగాలు చేసిన నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం మరో రూ.250 కోట్ల పరిహారం అందించింది. ఉండవల్లి నివాసంలో CM చంద్రబాబు నిర్వాసిత కుటుంబాలకు రూ.250 కోట్లచెక్కు ను అందజేశారు. ఇప్పటివరకు వెలిగొండ నిర్వాసితులకు ప్రభుత్వం అందించిన మొత్తం పరిహారం రూ.768 కోట్లకు చేరింది. కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ముత్తుమల అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.

అమీన్పూర్‌లో  అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Local· 22 Aug 2026

అమీన్పూర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

TG: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్‌ డివిజన్‌లో మౌలికవసతుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తూ రూ.8.19 కోట్ల పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రాజేంద్రరెడ్డి కాలనీ, సాయిఅంబిక కాలనీ, పీఎన్‌ఆర్ కాలనీ, నరేంద్రనగర్, సాయిరామ్ ఎంక్లేవ్, శంకర్ గ్రీన్ హోమ్స్, బృందావన్ టీచర్స్ కాలనీ, నవ్య నందనవనం, నర్రేగూడెం, రాజీవ్ గృహకల్ప కాలనీల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో సుమారు రూ.8.19 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అంతర్గత మురుగు నీటి కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

రాజా బహదూర్ సేవలు అజరామరం: ఎమ్మెల్యే
Local· 22 Aug 2026

రాజా బహదూర్ సేవలు అజరామరం: ఎమ్మెల్యే

TG: విద్యారంగాన్ని బాగు చేసి, నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి అందించిన సేవలు అజరామరమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్‌నగర్ పట్టణంలో రెడ్డి సేవాసమితి ఆధ్వర్యంలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి జయంతి వేడుకలను నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. రాజా బహదూర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందే మోహన్, రెడ్డి సేవా సమితి అధ్యక్షుడు మదన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు
Local· 22 Aug 2026

కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు

TG: కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 42 పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులు 15, సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు 22, సీఏఎస్‌ (స్పెషలిస్ట్‌) పోస్టులు 5 ఖాళీలు ఉన్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ బి. వాల్యా తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 27న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగే వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు.

SVBC చైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారం
Local· 22 Aug 2026

SVBC చైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారం

AP: తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో SVBC(Sri Venkateshwara Bhakthi Channel) చైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు వచ్చారు. నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణతోపాటు వారి కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ వర్మ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఎస్వీబీసీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

రామగుండంలో యూరియా ఉత్పత్తికి అంతరాయం
Local· 22 Aug 2026

రామగుండంలో యూరియా ఉత్పత్తికి అంతరాయం

TG: కరీంనగర్ జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని RFCL యూరియా పరిశ్రమలో రిఫార్మర్ సిస్టం ఎల్బోలో భారీ శబ్దంతో పగిలి పోయినట్టు తెలుస్తుంది. దీంతో అమోనియా లీక్ అయ్యి పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. యూరియా ఉత్పత్తికి వారం రోజులపాటు అంతరాయం ఏర్పడనుంది. తరచూ కర్మగారంలో యూరియా లీక్ అవడంతో తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు అంటున్నారు.

ఆదివాసీల అద్భుతం..వెదురు కొమ్ములు కూర!
Infotainment· 22 Aug 2026

ఆదివాసీల అద్భుతం..వెదురు కొమ్ములు కూర!

ఆదివాసీల జీవన విధానంలో అడవి అంటే కేవలం చెట్లు, కొండలు మాత్రమే కాదు. వారి ఆహారం, ఆరోగ్యం, సంస్కృతి, జీవనాధారం కూడా. వర్షాకాలం ప్రారంభమైతే అడవుల్లో ప్రకృతి అందాలతోపాటు అనేక రకాల సహజ ఆహార పదార్థాలు అందుబాటులోకి వస్తాయి. కొన్ని ప్రాంతాల్లో కోరేడిగా పిలిచే వెదురు కొమ్ములు వర్షాకాలంలోనే ఎక్కువగా లభిస్తాయి. అడవిలోకి వెళ్లే ఆదివాసీ ప్రజలు తాజా వెదురు కొమ్ములను సేకరించి ఇళ్లకు తీసుకువస్తారు. అనంతరం తమ పూర్వీకుల నుంచి వచ్చిన సంప్రదాయ పద్ధతుల్లో వాటిని శుభ్రం చేసి వంట చేసుకుంటారు.

సన్నవడ్ల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోండి
Local· 22 Aug 2026

సన్నవడ్ల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోండి

TG: సన్నవడ్లు సాగు చేసిన రైతులు తప్పనిసరిగా తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని భీమదేవరపల్లి మండల వ్యవసాయ అధికారిణి పద్మ సూచించారు. సెప్టెంబర్ 10వ తేదీలోగా సన్న రకాల వడ్లు వేసిన రైతులు వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. రైతులు సన్న విత్తనాలు కొనుగోలు చేసిన సంబంధిత డీలర్ల వద్దే ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. సొంతంగా అందుబాటులో ఉన్న సన్న రకాల విత్తనాలతో పంట సాగు చేసిన రైతులు స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించి సంబంధిత ఏఈఓల వద్ద వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.

శిలాఫలకంపై ‘నియోజకవర్గం’ గందరగోళం!
Local· 22 Aug 2026

శిలాఫలకంపై ‘నియోజకవర్గం’ గందరగోళం!

TG: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి రెవెన్యూ డివిజన్ కార్యాలయ భవన నిర్మాణ శంకుస్థాపన శిలాఫలకంపై జరిగిన మిస్టేక్ చర్చనీయాంశంగా మారింది. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేరు కింద కోరుట్లకు బదులుగా మెట్‌పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అని పేర్కొన్నారు. ఇద్దరు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న అధికారిక కార్యక్రమంలోనే ఈ పొరపాటు జరగడంపై విమర్శలు వస్తున్నాయి. ఒకప్పటి మెట్‌పల్లి నియోజకవర్గం మళ్లీ ఏర్పడిందా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి.

పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి: కలెక్టర్
Local· 22 Aug 2026

పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి: కలెక్టర్

TG: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ అధికారులను ఆదేశించారు. ఎఫ్‌ఎల్‌ఎన్ ఫలితాలను సమీక్షిస్తూ డి-గ్రేడ్ విద్యార్థుల అభ్యసన సామర్థ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. విద్యార్థుల చదువులో వెనుకబాటుతనాన్ని గుర్తించి అవసరమైన ప్రత్యేక బోధన అందించాలన్నారు. అర్హులైన ప్రత్యేక అవసరాల పిల్లలకు చేయూత పింఛన్, ఎస్టీ విద్యార్థులకు రాజీవ్ విద్యా దీవెన ఉపకార వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రజాసమస్యల పరిష్కారానికి మంత్రి క్షేత్రస్థాయి పర్యటన
Local· 22 Aug 2026

ప్రజాసమస్యల పరిష్కారానికి మంత్రి క్షేత్రస్థాయి పర్యటన

TG: ప్రజాసమస్యల పరిష్కారంలో జాప్యాన్ని సహించేది లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను హెచ్చరించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో వరుసగా మూడోరోజు పర్యటించిన మంత్రి.. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టారు. పెంట్లవెల్లిలో ప్రతిపాదిత స్టేడియం స్థలాన్ని పరిశీలించారు. అనంతరం రెవెన్యూ సమస్యలపై అధికారులతో సమీక్షించారు. మ్యూటేషన్ల కోసం ప్రజలను ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు.

కార్మికుల పోరుబాట.. 24 నుంచి నిరాహార దీక్షలు
Local· 22 Aug 2026

కార్మికుల పోరుబాట.. 24 నుంచి నిరాహార దీక్షలు

TG: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24, 25 తేదీల్లో నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు సీఐటీయూ జిల్లా నాయకుడు నానహే సాబ్, తెలంగాణ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగం గంగాధర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా పోతగల్‌లో నిర్వహించిన గ్రామపంచాయతీ కార్మికుల సమావేశంలో వారు మాట్లాడారు. కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, వేతనాలను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.

అసెంబ్లీ హౌస్‌కీపింగ్ వర్కర్స్ నిరసన
Local· 22 Aug 2026

అసెంబ్లీ హౌస్‌కీపింగ్ వర్కర్స్ నిరసన

AP : అమరావతి మల్కాపురం సెంటర్‌లో అసెంబ్లీ, సచివాలయం హౌస్‌కీపింగ్ టీమ్స్ తమ జీతాలు పెంచాలని నిరసన చేపట్టాయి. 2019 తర్వాత నుంచి ఇప్పటివరకు జీతాలు పెరగలేదని, భారీగా పెరిగిన ఖర్చులు, ఇంటి అద్దెలతో సర్దుకుపోవడం కష్టంగా మారిందని కార్మికులు తెలిపారు. మున్సిపల్ పారిశుద్ధ్య వర్కర్లకి నెలకి రూ. 21,000 ఇస్తుంటే, తమకు మాత్రం రూ. 10,470 మాత్రమే ఇస్తున్నారని అన్నారు.ఇప్పటికైనా జీతాలు పెంచకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలు మరింత ఎక్కువ చేస్తామని చెప్పారు.

రెండు కార్లు ఢీ.. చిన్నారికి గాయాలు!
Local· 22 Aug 2026

రెండు కార్లు ఢీ.. చిన్నారికి గాయాలు!

TG: హనుమకొండ జిల్లాలో రెండు కార్లు ఢీకొన్న ఘటన కలకలం రేపింది. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ మహిళా డైరీ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హుస్నాబాద్ వైపు నుంచి వస్తున్న కారు, ముల్కనూర్ వైపు వెళ్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఓ చిన్నారికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో వాహనాలు దెబ్బతిన్నాయి. గాయపడిన చిన్నారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

పలమనేరులో ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’
Local· 22 Aug 2026

పలమనేరులో ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’

AP : చిత్తూరు జిల్లాలో పలమనేరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’లో భాగంగా శనివారం పారిశుధ్య పనులు చేశారు. మున్సిపల్ ఆఫీస్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి, ప్రజలతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. అన్ని వార్డుల్లో శుభ్రత, ఫాగింగ్, బ్లీచింగ్, డ్రైనేజీ పూడికతీత పనులు పూర్తి చేశామని మున్సిపల్ మేనేజర్ ఖాదర్ మొహిద్దీన్ తెలిపారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

సురవరం సుధాకర్‌రెడ్డికి నివాళులర్పించిన నేతలు
Local· 22 Aug 2026

సురవరం సుధాకర్‌రెడ్డికి నివాళులర్పించిన నేతలు

TG: CPI మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నల్లగొండ మాజీ పార్లమెంటు సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి మొదటి వర్ధంతి సందర్భంగా హిమాయత్‌నగర్ లోని రాష్ట్ర కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటానికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి, CPI జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, CPI జాతీయ నాయకులు డాక్టర్ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, డి.వి.విజయలక్ష్మి, సయ్యద్ అజీజ్ పాషా పూలమాల వేసి నివాళులర్పించారు.

కామారెడ్డి కలెక్టర్ సెలవు: మెదక్ కలెక్టర్‌కు బాధ్యతలు
Local· 22 Aug 2026

కామారెడ్డి కలెక్టర్ సెలవు: మెదక్ కలెక్టర్‌కు బాధ్యతలు

TG : కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఈ నెల 24 నుంచి వచ్చే నెల 10 వరకు సెలవుపై విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ సమయంలో ఆయన స్థానంలో మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఇన్చార్జి బాధ్యతలు చూసుకుంటారని అధికారులు ఆదేశాలు ఇచ్చారు.సెలవుకు వెళ్లేముందు శనివారం నిజామాబాద్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ అంశాలపై ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొంటారు.