Latest

కేరళలో పీహెచ్‌డీ రీసెర్చ్ స్కాలర్‌పై వివక్ష..నిరసన
కేరళలోని తుంచత్ ఎళుత్తచ్చన్ మలయాళ యూనివర్సిటీలో దళిత్ పీహెచ్‌డీ రీసెర్చ్ స్కాలర్ అనఘా శశి తన తల్లి అంబికా శశితో కలిసి ఆరు రోజులుగా నిరసన చేస్తున్నారు. యూనివర్సిటీలో తనపై వివక్ష చూపుతున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. 2024 మార్చిలో ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ విభాగంలో చేరిన అనఘ కోర్స్ వర్క్ పూర్తి చేసిన తర్వాత ఏడాదైనా రీసెర్క్ స్టార్ట్ చేయలేకపోయారు. గైడ్ అరుణ్ బాబు, ప్రొఫెసర్ జైని వర్గీస్ తనకు క్లీనింగ్ పనులు, క్లెరికల్ పనులు అప్పగించారని ఆమె ఆరోపిస్తున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు CISF గుడ్‌బై.. కేంద్రం సంచలన నిర్ణయం
AP: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాంట్ నుంచి CISF సర్వీసుల రద్దుకు ఆదేశించినట్లు తెలుస్తోంది. మొత్తం 1,331 CISF పోస్టులు వెనక్కి తీసుకోనున్నారు. ఇందులో 1,033 సెక్యూరిటీ వింగ్, 298 ఫైర్ వింగ్ పోస్టులు ఉన్నాయి. మూడు నెలల నోటీస్ తర్వాత నవంబర్ 17న పూర్తిగా రద్దు కానుంది. RINL ఇవ్వాల్సిన పెండింగ్ డ్యూస్‌ను కూడా క్లియర్ చేయాలని కేంద్రం ఆదేశించింది. స్టీల్ ప్లాంట్‌కు రక్షణగా ఉన్న CISFను రద్దు చేస్తూ కేంద్రం ఇచ్చిన ఆర్డర్స్ ఇప్పుడు అనేక ప్రశ్నలకు దారితీస్తున్నాయి.

రైళ్లలో బోగీలు పెంచండి.. రైల్వే అధికారులకు కీలక విజ్ఞప్తి
TG: రాఖీ పండుగ సందర్భంగా రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ సభ్యుడు అనుమాస శ్రీనివాస్ కోరారు. మంచిర్యాల నుంచి సింగరేణి, ఇంటర్‌సిటీ, రామగిరి, బల్లార్షా–కాజీపేట మధ్య నడిచే రైళ్లలో బోగీల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు డివిజనల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ బిజయ్ కుమార్ రాత్‌కు వినతిపత్రం అందజేశారు. రాఖీ పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉండటంతో రైళ్లలో రద్దీ పెరుగుతుందని తెలిపారు.

పర్యావరణ నాణ్యతలో భారత్ స్థానం ఎంత?
Yale University (Yale Center for Environmental Law & Policy, Yale Center for Geospatial Solutions), Columbia University (CIESIN) 12 అంశాలను ఆధారంగా చేసుకొని ప్రపంచ పర్యావరణ నాణ్యతను లెక్కిస్తాయి. దీని ప్రకారం Environment Performance Index(EPI)ను విడుదల చేస్తాయి. 2026 ఎడిషన్‌లో 177 దేశాలను 47 ఇండికేటర్ల ద్వారా ర్యాంక్ చేశారు. 177 దేశాలలో భారతదేశం 176వ స్థానంలో ఉంది. ఇది ఆందోళన కలిగించే అంశమని పర్యావరణవేత్తలు అంటున్నారు. మొదటి స్థానంలో ఎస్టోనియా నిలిచింది.

అంతర్ జిల్లాల బైక్ దొంగలు అరెస్ట్
AP: అంతర్‌జిల్లాల్లో వరుసగా బైక్‌లను టార్గెట్ చేస్తున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి, ఏడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పరిధిలోని ఆత్మకూరు, చినకాకాని గ్రామాలతో పాటు తిరుపతి, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో వాహనాలను చోరీ చేసిన తెనాలికి చెందిన పార్థసారథి, రవికుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఏడు ద్విచక్రవాహనాలను రికవరీ చేసి సీజ్ చేశారు. విచారణలో తెనాలి రూరల్ పరిధిలోని జగ్గడగుంటపాలెంలో ఇంటి దొంగతనాలకు కూడా పాల్పడినట్లు గుర్తించారు.

iPhone కోరిక..ముగ్గురి ప్రాణం తీసింది
మహారాష్ట్రలోని చత్రపతి శంభాజీనగర్‌లో నిన్న ఒకే కుటుంబంలోని ముగ్గురు కొండ మీద నుంచి దూకి <a href="https://www.theclearcutnews.com/n/7qicUy5">ఆత్మహత్య చేసుకున్న ఘటన</a> స్థానికంగా విషాదం నింపింది. ఈ ఘటనకు కారణం ఐఫోన్ అనే విషయం ఇవాళ తెలిసింది. 18 ఏళ్ల కునాల్ ఐఫోన్ కావాలని కోరగా, తండ్రి కాదన్నాడు. దీంతో అతను కవ్తా కొండ ఎక్కాడు. మధ్యాహ్నం 1 గంటలకి అతను దూకుతానని బెదిరించగా, తండ్రి అతన్ని కాపాడేందుకు వెళ్లి ఇద్దరూ 300 అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డారు. కొద్ది నిమిషాల్లో తల్లి కూడా అదే చోటు నుంచి పడి మరణించింది.
నాగ్‌పూర్‌లో 36 టన్నులకు పైగా థాయ్ క్యాట్‌ఫిష్‌లు సమాధి
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో అక్రమంగా పెంచుతున్న థాయ్ క్యాట్‌ఫిష్ చేపలపై ఫిషరీస్ శాఖ పెద్ద ఎత్తున క్రాక్‌డౌన్ చేపట్టింది. చిచోలి-మహాదూలా ప్రాంతంలోని 11 చెరువుల నుంచి 36 టన్నులకు పైగా నిషేధిత చేపలను స్వాధీనం చేసుకుని వాటిని గుంతలు తీసి పాతిపెట్టారు. థాయ్ క్యాట్‌ఫిష్ చేపల పెంపకం, విక్రయం చట్టవిరుద్ధమని, ఈ చేపలు స్థానిక జీవవైవిధ్యానికి ముప్పు కలిగిస్తాయని అధికారులు తెలిపారు.

పోచమ్మ తల్లికి బోనాలు.. భక్తులతో కిక్కిరిసిన కొందుర్గు
TG: కొందుర్గులో పోచమ్మ తల్లి బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. రంగారెడ్డి జిల్లా కొందుర్గులో శ్రావణమాసం రెండో శుక్రవారం, వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని గ్రామ ప్రజలు పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామాన్ని సుభిక్షంగా ఉంచాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆస్పత్రి ముందు కుటుంబసభ్యుల ఆందోళన
TG: మూడు నెలల పసికందు మృతి చెందడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం చేనుగొనిపల్లి గ్రామానికి చెందిన హరీష్, శ్రావణి దంపతుల మూడు నెలల పాపను అనారోగ్యంతో గద్వాలలోని సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చికిత్స పొందుతున్న సమయంలో పాప మృతి చెందిందని, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని వారు ఆరోపించారు. పాప మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.
డ్యాన్స్ నుంచి టేబుల్ టెన్నిస్ వరకు.. చైనా రోబోల స్టంట్స్
బీజింగ్‌లో జరుగుతున్న World రోబో-2026 కాన్ఫరెన్స్‌లో చైనా Humanoid Robots ఆకట్టుకుంటున్నాయి. మనుషులతో Boxing, <a href="https://x.com/XueJia24682/status/2091003931707232461">Dance చేయడం,</a> Table Tennis ఆడటం వంటి స్టంట్స్ చేస్తున్నాయి. హ్యూమనాయిడ్ రోబోల ప్రొడక్షన్, యూజ్‌లో చైనా ప్రపంచంలో ముందంజలో ఉంది. ఇండస్ట్రీలు, ఇళ్లు, హోటళ్లలో రోబోలను యూజ్ చేసేలా కొన్ని సంస్థలు అభివృద్ధి చేస్తున్నాయి. ఫ్యూచర్‌లో రోజుచేసే పనుల్లోనూ రోబోల వాడకాన్ని ఎక్స్‌పాండ్ చేయడమే టార్గెట్‌గా పనిచేస్తున్నాయి.

రోడ్లపై మురుగునీరు.. గుంతల్లో ప్రయాణం
AP: కాకినాడ జిల్లా రౌతులపూడి గ్రామ పంచాయతీలో పారిశుధ్యం, రోడ్ల నిర్వహణపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో చెత్త కుప్పలు పేరుకుపోవడం, డ్రైనేజీలు మూసుకుపోవడంతో మురుగునీరు రోడ్లపై ప్రవహించడం, రోడ్లు గుంతలమయంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పాఠశాలల పరిసరాల్లో చెత్త, మురుగు పేరుకుపోవడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, చెత్తను తొలగించాలని, రోడ్లను మెరుగుపరచాలని అధికారులను కోరారు.

పోలీసు ఇంట్లోనే భారీ చోరీ
AP: పోలీసు ఉద్యోగి ఇంట్లోనే భారీ చోరీ జరగడం కొత్తపేటలో కలకలం రేపింది. కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని ఆర్‌ఎస్ నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కొత్తపేట డీఎస్పీ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వ్యక్తి భార్యతో కలిసి వైద్య చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన గుర్తుతెలియని దుండగులు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాను ధ్వంసం చేసి సుమారు 28 తులాల బంగారం, 750 గ్రాముల వెండి ఆభరణాలను అపహరించినట్లు పోలీసులు తెలిపారు.

Employeeపై లైంగిక వేధింపులు.. Star హోటల్ ఛైర్మన్‌పై కేసు
TG: హైదరాబాద్‌లో ఓ మహిళా Employeeపై సెక్సువల్ హరాస్‌మెంట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బేగంపేటలోని ఓ స్టార్ హోటల్ ఛైర్మన్‌పై పోలీసులు కేసు బుక్ చేశారు. తనను లైంగికంగా వేధించారని బాధితురాలు ఆరోపించింది. శాలరీ ఇంక్రిమెంట్ ఆగినప్పుడు తన కోరికలు తీర్చమనేవాడని కంప్లైంట్ చేసింది. ఘటనపై ఆరోపణలకు సంబంధించిన వివరాలను పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఛైర్మన్‌తో పాటు HR, జనరల్ మేనేజర్, ఇంకొంతమందిపై కేసులు పెట్టి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మెట్రో డ్రగ్స్ పరిశ్రమ సహకారంతో పిల్లలకు చేయూత
TG: విద్యార్థుల చదువుకు అండగా నిలిచేందుకు మెట్రో డ్రగ్స్ పరిశ్రమ ముందుకు వచ్చింది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి పాఠశాలలో పరిశ్రమ సహకారంతో విద్యార్థులకు యూనిఫాంలు, టై, బెల్టు, షూలు, స్టడీ మెటీరియల్, ఆట పరికరాలను అందించారు. ఈ సందర్భంగా పరిశ్రమ ప్రతినిధి ఉమామహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. పిల్లల చదువుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో పరిశ్రమలు సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని సూచించారు.

రూపారెడ్డి హత్యపై తీవ్ర ఆగ్రహం.. విద్యార్థి సంఘాల నివాళి
TG: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్యను విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. గద్వాల పట్టణంలోని చింతలపేట ఎస్సీ, బీసీ, ఆనందనిలయం హాస్టల్ విద్యార్థులతో కలిసి ఆమెకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థులు సెల్‌ఫోన్లు, డ్రగ్స్, మద్యం, డబ్బులకు బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. తల్లిదండ్రులు, గురువులను గౌరవించడం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు.

కాగ్నా బ్రిడ్జి వద్ద దెబ్బతిన్న రహదారిని పరిశీలించిన బుయ్యని
TG: కాగ్నా బ్రిడ్జి వద్ద దెబ్బతిన్న రహదారితో ప్రయాణికులు, వాహనదారులకు ప్రమాదం పొంచి ఉండటంతో సమస్యను త్వరగా పరిష్కరించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి అధికారులను కోరారు. తాండూర్ పట్టణ సమీపంలోని కాగ్నా బ్రిడ్జి వద్ద దెబ్బతిన్న రహదారిని ఆయన పరిశీలించారు. బ్రిడ్జిపై రహదారి పరిస్థితిని పరిశీలించి ప్రమాదాల నివారణకు ఏర్పాటు చేసిన బారికేడ్లు, హెచ్చరిక సూచికలను కూడా తనిఖీ చేశారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

మయన్మార్‌లో మిలిటరీ దారుణం.. బౌద్ధ విహారంపై అటాక్
మయన్మార్‌లో మిలిటరీ దారుణానికి పాల్పడింది. సాగైంగ్ దగ్గరలోని ఓ బౌద్ధ మఠంపై నిన్న ఎయిర్‌స్ట్రైక్ చేసింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. బౌద్ధుల వారం రోజుల ధ్యాన కార్యక్రమం జరుగుతుండగా అటాక్ జరిగింది. దాదాపు 100 మంది అక్కడ ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఫైటర్ జెట్ రెండు బాంబులు వేసినట్లు కొన్ని సంస్థలు తెలిపాయి. ఈ ఘటనపై మయన్మార్ సైన్యం ఇంకా రెస్పాండ్ అవ్వలేదని తెలుస్తోంది.

పిల్లలకు డ్యాన్స్‌తో పాఠాలు.. టీచర్‌కు నేషనల్ అవార్డు!
TG: కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని MPP గర్ల్స్ ప్రైమరీ స్కూల్ టీచర్ భవానీకి జాతీయ గౌరవం దక్కింది. కేంద్ర విద్యాశాఖ అనౌన్స్ చేసిన నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డుకు సెలెక్ట్ అయ్యారు. దేశంలో ఎంపికైన 48 మందిలో తెలంగాణ నుంచి భవానీ ఒక్కరే కావడం విశేషం. సెప్టెంబర్ 5న దిల్లీలో విజ్ఞాన్ భవన్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. స్టూడెంట్స్‌కు ఈజీగా అర్థమయ్యేలా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, డ్యాన్స్ ద్వారా పాఠాలు చెబుతున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ అభినందనలు తెలిపారు.

పత్తి పంటకు ముప్పు రాకుండా.. రైతులకు కీలక దిశానిర్దేశం
TG: పత్తి పంటలో చీడపీడలను తొలిదశలోనే గుర్తిస్తే నష్టాన్ని నివారించవచ్చని ఏఈఓ శ్రీనివాస్ రైతులకు సూచించారు. మంచిర్యాల జిల్లా భీమిని మండలం చిన్నతిమ్మాపూర్ గ్రామంలో పత్తిపంటను ఆయన పరిశీలించారు. పంట ఎదుగుదల, మొక్కల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. పంటలో చీడపీడల ఉనికిని ఎప్పటికప్పుడు గమనించాలని, తెగుళ్లు లేదా పురుగుల ప్రభావం కనిపించిన వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. సమస్యను గుర్తించకుండా సొంతంగా మందులు వినియోగించడం వల్ల పంటకు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు.

కామారెడ్డిలో యువజన కాంగ్రెస్ సమీక్ష సమావేశం
TG: యువజన కాంగ్రెస్‌ను గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఖలీద్ అహ్మద్ పిలుపునిచ్చారు. కామారెడ్డిలో జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, సభ్యత్వ నమోదు, ఐవైసీ యాప్‌లో గ్రామ కమిటీల ఏర్పాటు, పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంపై చర్చించారు.

పీహెచ్‌సీలో కలెక్టర్ చెక్.. సిబ్బందికి షాక్ ట్రీట్‌మెంట్
TG: మంచిర్యాల జిల్లా దండేపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలపై కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. శుక్రవారం పీహెచ్‌సీని సందర్శించిన ఆయన ఓపీ రిజిస్టర్, వార్డు, ల్యాబ్, మందుల నిల్వలను పరిశీలించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న గర్భిణుల ప్రసవాల వివరాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పీహెచ్‌సీలో వైద్యులు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు సమయపాలన పాటిస్తూ విధులకు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు.