Latest

హార్దిక్ పాండ్యా నుంచి క్రాంతి గౌడ్‌కు స్పెషల్ గిఫ్ట్!
భారత మహిళల క్రికెటర్ క్రాంతి గౌడ్ తన అభిమాన ఆటగాడైన హార్దిక్ పాండ్యా నుంచి గొప్ప కానుక అందుకుంది. బెంగళూరులో వీరిద్దరూ కలిసినప్పుడు, క్రాంతి పుట్టినరోజు సందర్భంగా పాండ్యా తన సంతకంతో కూడిన 33వ నంబర్ జెర్సీని ఇచ్చాడు. తాను ఎంతగానో అభిమానించే పాండ్యా నుంచి జెర్సీ అందడంతో క్రాంతి గౌడ్ చాలా ఆనందించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది.
నటి నమిత వెయిట్ లాస్ సీక్రెట్!
సినీ నటి <a href="https://www.instagram.com/reel/Dbx2IqMJr8k/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==">నమిత</a> 3 నెలల్లో 10 కేజీల బరువు తగ్గి షాక్ ఇచ్చారు. క్రాష్ డైటింగ్, పస్తులు లేకుండా కేవలం సౌత్ ఇండియన్ డైట్, ఇంటెన్స్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌తోనే ఇది సాధ్యమైందని చెప్పారు. కఠినమైన డైట్ వల్ల మజిల్స్ వీక్ అవుతాయని, హెల్దీగా బరువు తగ్గాలంటే ప్రాపర్ ఫుడ్, వర్కవుట్స్ రెండూ ముఖ్యమని వివరించారు. 'స్కల్ప్ట్ యువర్ బాడీ' డైటీషియన్ ధరణి గైడెన్స్‌తో బరువు తగ్గడం చాలా హ్యాపీగా ఉందంటూ ఒక వీడియోను ఇన్స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

300 మంది విద్యార్థినులకు నోట్‌బుక్స్ పంపిణీ
TG: సిరిసిల్ల ప్రభుత్వ బాలికల కళాశాలలో 300 మంది విద్యార్థినులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ జి. వనజా కుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి 4వ వార్డ్ కౌన్సిలర్ లైఖ్ సుల్తానా తాజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం తొలిసారిగా ఇంటర్మీడియట్ విద్యార్థినులకు ఒక్కొక్కరికి 12 ఉచిత నోట్‌బుక్స్ అందించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థినులు కష్టపడి చదివి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.

నర్సంపేటలో పెద్ది విగ్రహం తొలగింపు
TG: వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అధికారులు తొలగించారు. గద్దెను పూర్తిగా కూల్చివేశారు. సిమెంట్ ఇటుకలను అక్కడ నుండి దూరంగా తరలించారు. దగ్గరలో విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది సైతం ఫోన్లు వాడేందుకు అధికారులు నిరాకరించినట్లు సమాచారం. విగ్రహం తొలగింపు ప్రక్రియ అత్యంత రహస్యంగా పోలీసుల పహారాలో చేపట్టారు. సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్తున్న వారిని మధ్యలోనే అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది.

CJP ఎంట్రీతో ప్రిన్సిపాల్ సస్పెండ్!
మహారాష్ట్రలోని హింగోలి జిల్లా లింబాలా మక్తా గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్‌ను విద్యాశాఖ సస్పెండ్ చేసింది. స్కూల్‌లోనే మద్యం తాగి క్లాస్‌రూమ్‌లో నిద్రపోతున్నాడని విలేజర్స్, సీజేపీ ఫౌండర్ <a href="https://x.com/abhijeet_dipke/status/2089603362107048005?s=20">అభిజీత్ దిప్కే</a> బిడిఓకి కంప్లైంట్ చేశారు. దిప్కే ఆగస్టు 15న స్కూల్‌ను విజిట్ చేసి, యాక్షన్ తీసుకోకపోతే ప్రొటెస్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ప్రిన్సిపాల్ సస్పెండ్ అయినప్పటికీ, ఐదు క్లాసులకు ఇద్దరే టీచర్స్ ఉన్నారని, మరో ఇద్దరు టీచర్లను ఇచ్చే వరకు తమ ఫైట్ కంటిన్యూ అవుతుందని దిప్కే స్పష్టం చేశారు.

మహారాష్ట్రలో మత మార్పిడుల నిరోధక చట్టం!
మహారాష్ట్ర ప్రభుత్వం ‘<a href="https://economictimes.indiatimes.com/news/india/maharashtra-freedom-of-religion-act-to-come-into-force-on-august-28-what-changes/articleshow/133320393.cms">ద మహారాష్ట్ర ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ యాక్ట్, 2026</a>’ పేరుతో కొత్త చట్టాన్ని తెచ్చింది. మోసం చేసి లేదా బలవంతంగా మతం మార్చితే గరిష్టంగా 7 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఇది బెయిల్ రాని నేరం. ఎవరైనా ఇష్టంతో మతం మారాలన్నా 60 రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలి. చట్టవ్యతిరేకంగా మతం మారినవారి పిల్లలకు తల్లి మతమే వర్తిస్తుంది. బలవంతపు మార్పిడులను అడ్డుకోవడానికే ఈ చట్టమని ప్రభుత్వం చెప్పగా, కొందరు మాత్రం ఇది వ్యక్తిగత స్వేచ్ఛను దెబ్బతీస్తుందని విమర్శిస్తున్నారు.

సోషల్ మీడియా సంస్థలు భారత చట్టాలను పాటించాల్సిందే: కేంద్రం
దేశంలో పనిచేసే ఏ సోషల్ మీడియా సంస్థ అయినా దేశంలో అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎలాన్ మస్క్‌కు చెందిన ‘ఎక్స్’కు కేంద్రం స్పష్టమైన సందేశం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం సూచించిన ఏ అకౌంట్‌ను అయినా తొలగించాలని ఆదేశిస్తే.. ఆ ఆదేశం యూజర్స్‌కు కనిపించేలా, అందరికీ తెలిసేలా ‘ఎక్స్’ ఇటీవల కొత్త నిబంధనను తీసుకొచ్చింది. దీనిపై కేంద్రం స్పందించింది.

తమిళ జాతీయవాద పునరుజ్జీవన మహాసభకు భారీ స్పందన
తమిళనాడులోని ఉలంగూరులో జరిగిన తమిళ జాతీయవాద పునరుజ్జీవన మహాసభకు భారీ స్పందన వచ్చింది. విడుదలై సిరుతైగళ్ కట్చి(VCK) అధ్యక్షుడు తలైవర్ తిరుమావళవన్ పుట్టిన రోజున నిర్వహించిన ఈ సభలో పది లక్షల మంది పాల్గొన్నారు. ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే మతం, ఒకే ప్రభుత్వం, ఒకే పార్టీ, ఒకే నాయకుడు అనే ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతాన్ని దక్షిణ భారత ప్రజలు అంగీకరించరని సభ తీర్మానం చేసింది. రాజ్యాంగ హక్కులను బీజేపీ కాలరాస్తున్న తీరును వీసీకే తీవ్రంగా వ్యతిరేకించింది. మహాసభ తీర్మానాలకు జనం చప్పట్లతో ఆమోదం తెలిపారు.

ఆఫర్ లెటర్ ఉంది… ఉద్యోగం మాత్రం లేదు! 😳
ఊహించండి… నెలలుగా ఉద్యోగం కోసం ఎదురుచూశారు. ఆఫర్ వచ్చింది. జాయినింగ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. ఇక కొత్త జీవితానికి రెడీ అవుతున్న సమయంలో, జాయినింగ్‌కు ఐదు రోజుల ముందు ఆఫర్ రద్దయితే ఎలా ఉంటుంది? భారతీయ గ్రాడ్యుయేట్ తేజస్వ్ అగర్వాల్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆగస్టు 18న ఒరాకిల్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా చేరాల్సి ఉండగా, ఆఫర్‌ను రద్దు చేసినట్లు ఆయన <a href="https://www.linkedin.com/posts/tejasw464_tejaswagrawalresume-ugcPost-7495079436397162498-Ktnw/?utm_source=share&utm_medium=member_desktop&rcm=ACoAAExY3CYBKjyriNTuPUsNR_7VtmGSH_AgEg8">LinkedIn</a>లో వెల్లడించారు. మేలో ఇదే ఆఫర్‌ను ఒకసారి రద్దు చేసి, జూలైలో తిరిగి ఇచ్చారట. ఉద్యోగం దొరికిందని సంబరపడేలోపే… అది ఉంటుందా అనే ప్రశ్న మొదలవుతోంది.

రేపు సుగాలి ప్రీతి తల్లి వీల్‌చైర్ యాత్ర
AP: 10వ తరగతి స్టూడెంట్ సుగాలి ప్రీతి హత్యాచార ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. 2017లో కర్నూలులో జరిగిన ఈ అన్యాయంపై బాధితురాలి తల్లి పార్వతి నేటికీ పోరాటం చేస్తున్నారు. ఆగస్టు 19వ తేదీ ప్రీతి మరణించిన రోజు. ఈ సందర్భంగా ప్రీతి తల్లి పార్వాతి కర్నూలు నుంచి విజయవాడ వరకు వీల్‌చైర్ యాత్ర చేస్తున్నారు. నిందితులకు శిక్ష పడాలని, ఈ కేసుకు సంబంధించి పూర్తి నిజాలు వెలికితీసి న్యాయం చేయాలని కోరుతున్నారు.

AE ఫ్యామిలీ సూసైడ్?
పిఠాపురం AE నూకరాజు ఫ్యామిలీ గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ కేసులో షేక్ సాదిక్ ఖాన్‌పై పోలీసులు ఇంకో మర్డర్ కేసు కూడా ఫైల్ చేశారు. జులై 2న నూకరాజు అల్లుడు జగదీశ్‌రెడ్డికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి సాదిక్ చంపేశాడని, ఆ తర్వాత ఫ్యామిలీని బెదిరించి ప్రాపర్టీ, బ్యాంక్ లాకర్ డీటైల్స్ లాక్కున్నాడని సూసైడ్ నోట్‌లో రాశారు. సాదిక్ వేధింపులు తట్టుకోలేకే సూసైడ్ చేసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ఘటనలో 10 ఏళ్ల మనవడు ఈదుకుంటూ వచ్చి ప్రాణాలతో బయటపడ్డాడు.

GO 97ను రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 97 (శక్తి స్కీమ్) వల్ల తమ మూడేళ్ల చదువు వృథా అవుతుందని వికారాబాద్‌తో పాటు పలు చోట్ల నిరసన తెలిపారు. ఈ జీవో వల్ల డిప్లొమా పూర్తయ్యాక నేరుగా ఇంజినీరింగ్ చదివే అవకాశం పోతుందని, మళ్లీ ఇంటర్ చదవాల్సి వస్తుందని బాధపడ్డారు. డిప్లొమా ప్రాధాన్యతను తగ్గించే జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేయగా,BRS మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ విద్యార్థులకు మద్దతు ఇచ్చారు.

మళ్లీ వర్షాలు గట్టిగానే పడబోతున్నాయా?
ఇటీవల వర్షాలు కాస్త తగ్గడంతో “ఇక తగ్గిపోయినట్టే!” అనుకుంటున్నారా? మళ్లీ మాన్సూన్ యాక్టివ్ అవుతోంది. ఆగస్టు 20 నుంచి 24 వరకు తూర్పు, మధ్య భారతంలో వర్షాలు బాగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ముఖ్యంగా జార్ఖండ్, బిహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, తూర్పు మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు పడొచ్చు. జార్ఖండ్‌లో కొన్ని ప్రాంతాల్లో మరింత తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నీటిముంపు, వరదలు, రోడ్లపై రాకపోకలకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.

కింగ్ కోహ్లీ క్రికెట్ ప్రయాణానికి 18 ఏళ్లు!
రన్‌మిషన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి 18 ఏళ్లు పూర్తయ్యాయి. 2008 ఆగస్టు 18న శ్రీలంకపై తన తొలి వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత పరుగుల వరద పారిస్తూ కెప్టెన్‌గా ఇండియాకి ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిస్తూ సరికొత్త రికార్డులు సృష్టించాడు. ఇప్పటివరకు 3 ఫార్మాట్లలో కలిపి 85 సెంచరీలు కొట్టిన కోహ్లీ.. త్వరలోనే 100 సెంచరీలు పూర్తి చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

తిరుపతి సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ సోదాలు
AP: తిరుపతిలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసులు సిబ్బందితో కార్యాలయానికి చేరుకుని సోదాలు చేపట్టారు. లెక్కల్లో చూపని రూ.2.48 లక్షల నగదును గుర్తించి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదు వివరాలకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్ లక్ష్మీదేవిని విచారించారు. నగదుతోపాటు కార్యాలయంలోని రిజిస్ట్రేషన్ రికార్డులను, సంబంధిత దస్తావేజులను, నగదు లావాదేవీలకు సంబంధించిన వివరాలను పరిశీలించారు.

20న జాబ్ మేళా
TG: జోగులాంబ గద్వాల జిల్లాలోని నిరుద్యోగ యువతకు వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి జి.ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. IDOCలోని జిల్లా ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్హతలు SSC/ITI/ Inter/Degree/B.Tech(Mech or Elec)/ B.Com ఉండాలని పేర్కొన్నారు.

బాల కార్మికులు లేని సమాజమే లక్ష్యం
TG: బాల కార్మికులు లేని సమాజ నిర్మాణానికి అందరం పాటుపడాలని బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోస్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమిదేవరపల్లి మండలం కొత్తకొండలో వీరభద్రస్వామి దేవాలయానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ బాలల హక్కులను పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. బాలలతో ఎవరైనా పని చేసినట్లయితే టోల్‌ఫ్రీ నెంబర్ 1098కు సమాచారం అందించాలని వారు తెలిపారు.

ప్రపంచ రోడ్లపైకి 4,000+ రోబోట్యాక్సీలు!
చైనాకు చెందిన Pony.ai సంస్థ ప్రపంచవ్యాప్తంగా 4,000కు పైగా డ్రైవర్‌లెస్ రోబోట్యాక్సీలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. మధ్యప్రాచ్యం, ఆసియా, యూరప్ మార్కెట్లలో విస్తరణకు ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే Uberతో కలిసి యూరప్‌లో 2,000కు పైగా రోబోట్యాక్సీలను నడిపేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వాహనాల ప్రవేశానికి అవసరమైన అనుమతులు, నిబంధనలు పూర్తయ్యే కొద్దీ సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది చివరికి 3,500 వాహనాల సమూహాన్ని ఏర్పాటు చేయాలని Pony.ai లక్ష్యంగా పెట్టుకుంది.
అమెరికాలో ‘బుట్టబొమ్మ’ సందడి!
అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన ‘ఇండియా డే పరేడ్’ వేడుకల్లో సినీ నటి పూజా హెగ్డే పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా వెళ్లిన ఆమె, అక్కడ ఉన్న భారతీయులందరినీ ఎంతో ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా తన కెరీర్‌లోని సూపర్‌హిట్ సాంగ్ ‘బుట్టబొమ్మ’కు స్టేజీపైనే డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆదివాసీలకు 100% రిజర్వేషన్‌పై అసెంబ్లీలో బిల్లు పెట్టాలి
AP: ఆదివాసీలకు నూరు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రత్యామ్నాయ జీవో జారీ చేసి, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలని అల్లూరి సీతారామరాజు జిల్లా ఆదివాసీ గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు. డంబ్రిగుడ మండల కేంద్రంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి.సూర్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశం నిర్వహించారు. బాలదేవ్ మాట్లాడుతూ ఆదివాసీ హక్కులు, చట్టాల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే మహోద్యమం చేపడతామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు.

సినిమా ఇండస్ట్రీకి AI వరమా? శాపమా?
హాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో పెద్ద సెట్స్ వేసే రోజులు మారిపోతున్నాయి. 'ప్రామిస్' అనే కొత్త స్టూడియోలో యాక్టర్ టోరీ థామస్ వైట్ షీట్స్ ముందు నటిస్తుంటే, చైనీస్ AI మోడల్ 'Seedance 2.5' రియల్ టైమ్‌లోనే బ్యాక్‌గ్రౌండ్స్‌ని మ్యాజిక్‌లా మార్చేస్తోంది. తక్కువ ఖర్చుతోనే నెక్స్ట్ లెవెల్ విజువల్స్ వస్తుండడంతో ప్రోడుసర్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ AI ట్రెండ్ సినిమా పరిశ్రమకు కొత్త గోల్డెన్ ఏజ్ ఇస్తుందా లేక యాక్టర్స్, క్రియేటర్స్ ఉద్యోగాలకు ప్రాబ్లం అవుతుందా అని ఇండస్ట్రీలో హాట్ డిబేట్ నడుస్తోంది.