Latest

ప్రతి ఎకరాకు సాగునీరు.. ఇదే లక్ష్యం: చంద్రబాబు
AP: గోదావరి, కృష్ణా నదులను రాష్ట్రంలోని అన్ని నదులతో అనుసంధానించి ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తన ప్రధాన లక్ష్యమని CM చంద్రబాబు అన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమకాలువ నుంచి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు విడుదల చేశారు. గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చిన అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. వచ్చే ఏడాది నాటికి గోదావరి జలాలను సింహాద్రి అప్పన్న పాదాల చెంతకు తీసుకువెళ్తామని CM తెలిపారు.

Gen Zకి పెళ్లిపై ఎందుకు ఇంట్రెస్ట్ తగ్గుతోంది?
“ముందు పెళ్లి.. తర్వాత మిగతావన్నీ” అనే ఆలోచన కంటే.. “ముందు కెరీర్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, మన పీస్” అంటోంది Gen Z! 2025లో ఇండియన్ జర్నల్ ఆఫ్ పాజిటివ్ సైకాలజీలో వచ్చిన ఓ స్టడీ.. 100 మంది అవివాహిత మిలీనియల్స్, Gen Z అభిప్రాయాలను పరిశీలించింది. ఇందులో Gen Z సొసైటీ ప్రెజర్ కంటే ఎమోషనల్ రెడీనెస్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తేలింది. అంటే పెళ్లిని పూర్తిగా వద్దనడం కంటే.. ముందు లైఫ్‌లో స్థిరపడాలి, తర్వాత పెళ్లి గురించి ఆలోచించాలి అనే ఆలోచన కనిపిస్తోంది.

ఇల్లు చిన్నదైందా.. లేక మనమే పెద్దవాళ్లమయ్యామా?
చిన్నప్పుడు ఆ ఇంటి గుమ్మం దాటితే ప్రపంచమే పెద్దగా అనిపించేది.. మెట్ల మీద పరుగులు, గదుల్లో ఆటలు, మూలల్లో దాచిన జ్ఞాపకాలు అన్నీ అంతులేనివిగా ఉండేవి. కానీ ఏళ్ల తర్వాత అదే ఇంటికి వెళ్తే గదులు చిన్నగా, మెట్లు తక్కువగా అనిపిస్తాయి. నిజానికి ఇల్లు మారలేదు.. మనం పెరిగాం. చిన్నప్పుడు మన ఎత్తు, చూపు, ప్రపంచం చిన్నవి కాబట్టి ఆ ప్రదేశం పెద్దగా అనిపించింది. ఇప్పుడు మన అనుభవాలు, అవసరాలు, ప్రపంచం విస్తరించడంతో అదే ఇల్లు చిన్నదిగా కనిపిస్తోంది. అందుకే కొన్ని ఇళ్లు గోడలతో కాదు.. మన జ్ఞాపకాలతో పెద్దవిగా ఉంటాయి.

జీవిస్తున్నామా.. లేక చూపిస్తున్నామా?
మంచి క్షణం ఎదురైతే.. దాన్ని ఆస్వాదించే ముందు ఫోన్ తీసి ఫోటో తీస్తున్నామా? తినే ఫుడ్, వెళ్లే ట్రిప్, కలిసే మనుషులు.. ప్రతి అనుభవం వెంటనే పోస్ట్ చేయాలనే అలవాటు పెరుగుతోంది. సోషల్ మీడియాలో పంచుకోవడం తప్పు కాదు, కానీ ప్రతి క్షణం ఇతరులకు చూపించాలనే ఆలోచన పెరిగితే మన అనుభవం కంటే వారి రియాక్షన్ ముఖ్యమవుతుంది. మనం ఏం ఫీల్ అవుతున్నామో కంటే.. అది ఎలా కనిపిస్తుందో ఆలోచిస్తాం. నిజమైన జీవితం కెమెరా ముందు కాదు.. కెమెరా ఆఫ్ చేసిన తర్వాత సంతోషంగా అనిపించడంలో ఉంటుంది. చివరికి.. మనం జ్ఞాపకాలను జీవిస్తున్నామా?

సగం సమాచారం.. ఫుల్ కాన్ఫిడెన్స్!
మనకు విషయం పూర్తిగా తెలియకపోయినా.. ఎవరో ఒకరు అడిగితే వెంటనే “నా ఒపీనియన్ ఇదే” అని చెప్పేస్తాం. ఎందుకంటే మన మెదడు ఖాళీగా ఉండటం కంటే, అసంపూర్ణ సమాచారంతోనైనా ఒక నిర్ణయానికి రావడాన్నే సులభంగా భావిస్తుంది. పైగా సోషల్ మీడియాలో ఒకే వైపు కథనం పదేపదే కనిపిస్తే, అది నిజమే అనిపించొచ్చు. మన చుట్టూ ఉన్నవాళ్ల అభిప్రాయాలు కూడా మన ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. కానీ తెలియని విషయంపై గట్టిగా మాట్లాడటం, తెలిసిన విషయాన్ని చెప్పడంతో సమానం కాదు. “నాకు పూర్తిగా తెలియదు” అని చెప్పగలగడం కూడా ఒక తెలివైన స్పందనే.

పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు చేసే చిన్న తప్పులు
పిల్లలను పెంచడం అంటే వాళ్లకు మంచి స్కూల్, మంచి చదువు, మంచి సౌకర్యాలు ఇవ్వడం మాత్రమే కాదు.. రోజూ మనం మాట్లాడే మాటలు, చూపించే ప్రవర్తన కూడా వాళ్లపై బలమైన ముద్ర వేస్తాయి. “నీకు ఇది రాదు” అనడం, ఇతర పిల్లలతో పోల్చడం, వాళ్ల తప్పులను వెంటనే ఎత్తిచూపడం, ప్రతి సమస్యను మనమే పరిష్కరించడం లాంటి చిన్న విషయాలు పిల్లల్లో భయం, ఆత్మవిశ్వాసం తగ్గడం లేదా నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులకు దారితీయొచ్చు. అందుకే పిల్లలు ఏం చేస్తున్నారు కంటే.. వాళ్లతో మనం ఎలా వ్యవహరిస్తున్నామో కూడా గమనించాలి.

చెత్త వాహనాల పెట్రోల్ చోరీ.. ఇద్దరు డ్రైవర్లపై కేసు!
జగిత్యాల పట్టణంలో మున్సిపల్ చెత్త వాహనాల నుంచే పెట్రోల్ చోరీ! విద్యానగర్ వాటర్ ట్యాంక్ వద్ద ఇద్దరు డ్రైవర్లు పెట్రోల్ తీస్తుండగా పట్టుబడ్డారు. అవుట్‌సోర్సింగ్ డ్రైవర్లు ఇప్పటివరకు 83 లీటర్ల పెట్రోల్ తీశారని, దాదాపు రూ.10 వేల విలువ చేస్తుందని టౌన్ సీఐ పి.కరుణాకర్ చెప్పారు. కేసు నమోదు చేశారు. ఎస్సై జి.మహేష్ దర్యాప్తు చేస్తున్నారు.

వేంసూరులో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!
ఖమ్మం జిల్లా వేంసూరులో సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ఆకస్మిక తనిఖీలు చేశారు. SIR 2026లో భాగంగా అనామలీస్, నో మ్యాపింగ్ కేసులపై ఆయన దృష్టి పెట్టారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటర్ల వివరాలు, బీఎల్ఓల పరిశీలన చేశారు. అర్హత కలిగిన ఓటర్ల వివరాలను పారదర్శకంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని సూచించారు.

పదిరలో భర్త చేత భార్య హత్య.. అత్తపై కూడా దాడి!
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో దారుణం జరిగింది. భర్త పల్లపు సురేష్ తన భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. దాడిని అడ్డుకునే ప్రయత్నంలో అత్త కూడా తీవ్రంగా గాయపడింది. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. గాయపడిన వృద్ధురాలిని సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

గోబర్ గ్యాస్ ప్లాంట్.. సూరారంలో దుర్వాసన ముప్పు!
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో కొత్తగా ప్రారంభమైన గోబర్ గ్యాస్ ప్లాంట్ ప్రజలను ఇబ్బంది పెడుతోంది. రాత్రి 7 నుంచి ఉదయం 5 గంటల వరకు దుర్వాసన భరించలేనంతగా వస్తోంది. 40 శాతం పనులు మాత్రమే పూర్తయిన ఈ ప్లాంట్ 100 శాతం పూర్తయితే ఇంకా ఎంత భయంకరమవుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. NH 563 మీద ప్రయాణించే వారు, చుట్టుపక్కల వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పశువులు, పంట పొలాలు కూడా నాశనం అవుతున్నాయి. PCB అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణం స్పందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

గోల్డ్ మెడల్.. రంగారెడ్డి బాక్సర్ భవ్యతేజిని!
రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలానికి చెందిన ఓ పేద విద్యార్థిని సంచలనం సృష్టించింది. ఆమె పేరు జిల్లెళ్ళ భవ్యతేజిని. నార్సింగి గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు జంగయ్య, పరిమళ రాణి. ఈ చిన్నారి బాక్సింగ్ రింగ్‌లో సత్తా చాటుతోంది. హైదరాబాద్ షేక్‌పేట్ స్టేడియంలో డిస్ట్రిక్ట్ లెవల్ అండర్-17 బాక్సింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ నెగ్గింది. ఇప్పటివరకు ఆమె 4 గోల్డ్, 2 సిల్వర్ మెడల్స్ సాధించింది. పేదరికాన్ని జయించి.. ఇలా మెరవడం అద్భుతం కదూ! ఆమె ఇంకా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.

రీ-సర్వే పురోగతి.. మందసలో జాయింట్ కలెక్టర్ సమీక్ష!
శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో రీ-సర్వే పనుల పురోగతిపై జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సమీక్షించారు. మొత్తం 83 గ్రామాలకు గాను 47 గ్రామాల్లో రీ-సర్వే పూర్తయింది. మిగిలిన 36 గ్రామాల్లో పనులు 2027 మార్చిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రౌండ్ ట్రూతింగ్, ఈ-కేవైసీ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ బి.శ్రీహరి, డీటీ కె.రామకృష్ణ, సర్వేయర్ బాబురావు, ఎంఆర్ఐ ఇందిర పాల్గొన్నారు.

హనుమకొండలో పవన్ బర్త్ డే.. కార్యకర్త కుటుంబానికి FD!
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో జనసేన కార్యకర్తలుపవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు, పాఠశాలలో స్టూడెంట్స్‌కు పండ్లు పంపిణీ చేశారు. మర్రిపల్లిగూడెం గ్రామానికి చెందిన జియవొద్దీన్ అనే వీరాభిమాని రోడ్ ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన ఇద్దరు కూతుళ్లకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, బాండ్లను కుటుంబానికి అందజేశారు. పార్టీ అధికార ప్రతినిధి చల్లా శివారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్తకు రూ.5 లక్షల బీమా పాలసీ తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ దేనని గుర్తు చేశారు.

మర్రివానిపల్లిలో ఉచిత వైద్య శిబిరం!
కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం మర్రివానిపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఆదిత్య, అమృత ఆసుపత్రుల MD ఎలుక దేవేందర్ రెడ్డి ఈ క్యాంప్‌కు శ్రీకారం చుట్టారు. డాక్టర్ ఆకుల శ్రీనివాస్, డాక్టర్ భరత్, డాక్టర్ గ్రీష్మ వైద్య పరీక్షలు చేశారు. రోగులకు ఉచిత షుగర్ టెస్ట్లు, అవసరమైన మందులు కూడా అందజేశారు. సర్పంచ్ మర్రి శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ కడారి పద్మ-నవీన్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలిపారు.

మాధవరం కలాన్.. ప్రత్యేక మండలంగా డిమాండ్!
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలో ఓ కొత్త డిమాండ్ వినిపిస్తోంది. మాధవరం కలాన్‌ను ప్రత్యేక మండలంగా ప్రకటించాలని ప్రజలు కోరుతున్నారు. ఊటుకూరు, బండమిదీగూడెం, కొండారం, చిత్తలూరు, వంగమర్తి, ఇటుకులపాడ్, ఓగోడు, నడిగూడెం.. ఇలా మొత్తం 9 గ్రామాలను కలిపి కొత్త మండలం ఏర్పాటు చేయాలని డిమాండ్. మాజీ నీటిసంఘం చైర్మన్ దొంతురి యాదగిరి, యారాల మాధవరెడ్డి ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. దీనిపై ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి స్పందించి, రెవెన్యూ సెక్రెటరీ లోకేష్ కుమార్‌కి సిఫారసు చేశారు.

భీమదేవరపల్లిలో రీ-సర్వే.. అదనపు కలెక్టర్ తనిఖీ!
హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి గ్రామంలో రీ-సర్వే పనులు హడావిడిగా సాగుతున్నాయి. అదనపు కలెక్టర్ ఎన్. రవి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. సర్పంచ్ మాచర్ల కుమారస్వామితో కలిసి హద్దులు, రికార్డుల వివరాలు చెక్ చేశారు. నిబంధనల ప్రకారమే సర్వే చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్, సర్వేయర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

అటవీ ప్రాంతంలో మానవ అస్థిపంజరం.. నిర్మల్లో కలకలం!
నిర్మల్ జిల్లా కోథల్‌గావ్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో బుధవారం గుర్తుతెలియని వ్యక్తికి చెందిన అస్థిపంజరం లభ్యమైంది. పుర్రెతో పాటు కేవలం రెండు, మూడు ఎముకలు మాత్రమే దొరికాయి. దీంతో గ్రామంలో కలకలం రేగింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గత 4-5 నెలలుగా మానసిక స్థితి సరిగా లేని గుర్తుతెలియని వ్యక్తి ఆ అటవీ ప్రాంతంలో సంచరిస్తూ ఉండేవాడని గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. సంఘటనా స్థలంలో పంచనామా, స్పాట్ పీఎంఈ నిర్వహించిన పోలీసులు.. ఎముకలను శాస్త్రీయ పరీక్షల నిమిత్తం భద్రపరిచారు.

సైబర్ నేరాలపై చిన్న తాండ్రపాడులో అవగాహన!
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం చిన్న తాండ్రపాడులో ప్రత్యేక సదస్సు జరిగింది. సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్ రామాంజనేయులు మాట్లాడుతూ.. ఆందోళనగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. అపరిచితుల లింకులు, కాల్స్‌పై క్లిక్ చేయొద్దు. మోసపోతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఏదైనా అనుమానం వచ్చినప్పుడు 1930కి కాల్ చేయాలన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ ప్రకాష్, స్థానికులు పాల్గొన్నారు.

సీఎం సార్.. మా డబ్బులు మాకివ్వండి!
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఉద్యోగులు వినూత్న నిరసనకు దిగారు. “సీఎం సార్.. మా డబ్బులు మాకివ్వండి” అంటూ వాట్సాప్, సోషల్ మీడియాలో డీపీలు, స్టేటస్‌లు పెడుతున్నారు. రోడ్డుపైకి రాకుండా.. తమ విధులకు ఆటంకం లేకుండా సోషల్ మీడియానే ఆయుధంగా మార్చుకున్నారు. జేఏసీ అమరావతి పిలుపు మేరకు ఈ ఆన్‌లైన్ నిరసన మొదలైంది. ఒక్కొక్కరిగా మొదలై.. ఇప్పుడు రాజోలు వ్యాప్తంగా వైరల్ అవ్తోంది. తమకు రావాల్సిన బకాయిలు, ఆర్థిక ప్రయోజనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
క్లోరోక్విన్.. 7ఏళ్ల ఆదివాసి బాలిక మృతి!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎటపాక మండలంలో 7ఏళ్ల ఆదివాసి బాలిక మృతి చెందింది. ముందస్తు వైద్య పరీక్షలు లేకుండానే క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ చేశారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఆదివాసులు అస్వస్థతకు గురయ్యారన్నారు. కలెక్టర్ వ్యాఖ్యలు కూడా సరికావన్నారు. పోస్టుమార్టం నివేదిక రాకముందే జన్యు గుండె సమస్యల కారణాలను ప్రస్తావించడం సరికాదన్నారు. ఇది అధికారుల బాధ్యతను కప్పిపుచ్చే ప్రయత్నమేనన్నారు.

ఆత్మహత్యలు వద్దు.. రంగారెడ్డిలో ఎమ్మెల్యే హితబోధ!
రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌లోని గురుకుల కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. పరీక్షల ఒత్తిడికి గురై ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కళాశాలకు వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. బాధగా విద్యార్థులకు హితబోధ చేస్తూ.. ఒత్తిడికి లొంగొద్దని సూచించారు. నచ్చిన రంగాన్ని ఎంచుకుని రాణించాలని పిలుపునిచ్చారు. ఆశలు నెరవేరకపోతే ఆత్మహత్య సరైన నిర్ణయం కాదని అన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో సరిత, మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు, చైర్మన్ అగ్గునూరు విశ్వం పాల్గొన్నారు